మహిళల హక్కుల కోసం ఉద్యమించిన నర్గీస్ మహమ్మదికి నోబెల్ శాంతి పురస్కారం
Nobel Peace Prize 2023: ఇరాన్‌కి చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మహమ్మదిని నోబెల్ శాంతి బహుమతి వరించింది.
Nobel Peace Prize 2023:
నోబెల్ శాంతి పురస్కారం
ఇరాన్‌కి చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మహమ్మదిని (Narges Mohammadi) అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం (Nobel Peace Prize) వరించింది. ఈ మేరకు అకాడమీ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారు మహమ్మది. ఈ క్రమంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న 19వ మహిళగా రికార్డు సృష్టించారు. మానవ హక్కులపై పోరాటం చేయడంతో పాటు ఇరాన్లో అందరి స్వేచ్ఛ కోసం ఉద్యమించారు మహమ్మది. 11 మిలియన్ల స్వీడిష్ క్రోన్స్ (స్వీడన్ కరెన్సీ) విలువైన బహుమతిని అందించనున్నారు. డిసెంబర్ 10వ తేదీన ఓస్లోలో ఈ పురస్కారం అందజేస్తారు.
BREAKING NEWS
— The Nobel Prize (@NobelPrize) October 6, 2023
The Norwegian Nobel Committee has decided to award the 2023 #NobelPeacePrize to Narges Mohammadi for her fight against the oppression of women in Iran and her fight to promote human rights and freedom for all.#NobelPrize pic.twitter.com/2fyzoYkHyf
ప్రపంచంలోనే మహిళల హక్కులు అణిచివేతకు గురవుతున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇప్పటికీ ఆ దేశం అట్టుడుకుతోంది. హిజాబ్‌కి వ్యతిరేకంగా అక్కడి మహిళలు ఉద్యమిస్తున్నారు. మొరాలిటీ పోలీసుల కస్టడీలో 19 ఏళ్ల యువతి చనిపోయింది. అప్పటి నుంచి అక్కడ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. నర్గీస్ మహమ్మది కూడా ఇలానే చాలా సందర్భాల్లో మహిళల హక్కుల కోసం ఉద్యమించారు. 13 సార్లు అరెస్ట్ అయ్యారు. 5 సార్లు దోషిగా తేలారు. ఇప్పటి వరకూ దాదాపు 31 ఏళ్ల పాటు జైల్లోనే గడిపారు. సమాజం కోసం ఎంతో ధైర్యంగా పోరాడిన ఆమె...వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టారని నోబెల్ అకాడమీ ప్రశంసించింది.
"నర్గీస్ మహమ్మది మానవ హక్కు కార్యకర్తే కాదు స్వాతంత్ర్య సమర యోధురాలు కూడా. ఆమె సేవల్ని గుర్తించి నోబెల్ శాంతి పురస్కారం అందిస్తున్నాం. ఆమె ధైర్యానికి మేమిచ్చే గౌరవం ఇది. ఇరాన్లో ప్రజాస్వామ్యం కోసం ఆమె పోరాడిన తీరుకి ఇది మా సత్కారం"
- నోబెల్ ప్రైజ్ కమిటీ
ప్రస్తుతం నర్గీస్ మహమ్మది జైలు నుంచి బయటకు వచ్చాక కూడా తన పోరాటాన్ని ఆపలేదు. ఇరాన్లో ఉరిశిక్షకు వ్యతిరేకంగా ఉద్యమించారు. నోబెల్ కమిటీ లెక్కల ప్రకారం..గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ ఇరాన్లో 860 మంది ఖైదీలను ఉరి తీశారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఉరిశిక్షలపై పోరాటం చేస్తున్నారు నర్గీస్. 2015లో అరెస్ట్ అయ్యారు. జైళ్లలో మహిళలపై అత్యాచారాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పలు కేసుల్లో టెహ్రాన్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు నర్గీస్. దేశానికి వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వం ఆమెపై ఆరోపణలు చేసింది. ఇరాన్‌లోని Defenders of Human Rights Center కి డిప్యుటీ హెడ్‌గానూ పని చేస్తున్నారు నర్గీస్ మహమ్మది. ఈ సంస్థని షిరిన్ ఎబది నడుపుతున్నారు. షిరిన్ కూడా 2003లో నోబెల్ పురస్కారం అందుకున్నారు. సాహిత్య రంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా అకాడమీ ఇలా సత్కరించింది.
Also Read: PM Modi Threat: లారెన్స్ బిష్ణోయ్‌ని విడుదల చేయండి, లేదంటే మోదీని చంపేస్తాం - NIAకి ఆగంతకుల మెయిల్