(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Threat: లారెన్స్ బిష్ణోయ్‌ని విడుదల చేయండి, లేదంటే మోదీని చంపేస్తాం - NIAకి ఆగంతకుల మెయిల్
PM Modi Threat: ప్రధాని మోదీని చంపేస్తామంటూ NIAకి ఆగంతకులు మెయిల్ పంపారు.
PM Modi Threat:
NIAకి మెయిల్..
ప్రధాని మోదీకి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. National Investigation Agency (NIA)కి కొందరు ఆగంతకులు ప్రధాని మోదీని చంపేస్తామంటూ మెయిల్ పంపారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ( Narendra Modi stadium)ని పేల్చేస్తామనీ బెదిరించారు. రూ.500 కోట్లు ఇవ్వడంతో పాటు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని (Lawrence Bishnoi) విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మెయిల్ వచ్చిన వెంటనే NIA ముంబయి పోలీసులను అప్రమత్తం చేసింది. ప్రధానికి సెక్యూరిటీ ఇచ్చే ఏజెన్సీలన్నింటికీ ఈ మెయిల్‌ని ఫార్వర్డ్ చేసింది. గుజరాత్ పోలీసులూ అలెర్ట్ అయ్యారు. వాంఖడే స్టేడియంలో ఐదు వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో భద్రత ఏర్పాటు చేశారు. ఈ మెయిల్ తరవాత సెక్యూరిటీ పెంచారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుగొనే పనిలో పడ్డారు అధికారులు. అక్టోబర్ 5న ఉదయం ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది.
"మీ ప్రభుత్వం మాకు రూ.500 కోట్లు ఇవ్వాలి. లారెన్స్ బిష్ణోయ్‌ని వెంటనే విడుదల చేయాలి. ఇలా చేయకపోతే నరేంద్ర మోదీని చంపేస్తాం. నరేంద్ర మోదీ స్టేడియంనీ పేల్చేస్తాం. మీరెంత సెక్యూరిటీ పెంచినా సరే. మా నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీరు మాట్లాడాలనుకుంటే ఈ మెయిల్‌లో రిప్లై ఇవ్వండి"
- NIAకి వచ్చిన మెయిల్‌లోని మ్యాటర్
ఈ ఏడాది జూన్‌లోనూ ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ ఢిల్లీ పోలీసులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రధానితో పాటు ఓ కేంద్రమంత్రిని, బిహార్ ముఖ్యమంత్రిని కూడా చంపేస్తామని బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఆ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వరుస పెట్టి రెండు కాల్స్ రావడం వల్ల అంతా స్పెషల్‌గా ఓ టీమ్‌ని ఏర్పాటు చేసి విచారించారు. ముందు ఫోన్ చేసి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను చంపేస్తామని బెదిరించిన ఆ వ్యక్తి...ఆ తరవాత మరోసారి కాల్ చేశాడు. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రినీ హత్య చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు.
Delhi Police's outer district police received two PCR calls today from a man who threatened to kill the Prime Minister, Union Home Minister and Bihar CM; a team deployed to locate the caller, say Delhi Police.
— ANI (@ANI) June 21, 2023
ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు ఆ యువకుడిని గుర్తించారు. ఆ యువకుడి పేరు సుధీర్ శర్మ అని నిర్ధరించారు. ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం...ఆ యువకుడి కుటుంబ సభ్యులనూ పోలీసులు విచారించారు. ఫుల్‌గా మందు కొట్టాడని వాళ్లు వెల్లడించారు. మద్యం మత్తులో ఇలా బెదిరించి ఉంటాడని పోలీసులు చెప్పారు. ఈ వరుస కాల్స్ పోలీసులను పరుగులు పెట్టించాయి. ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. చివరకు ఇవి ఫేక్ కాల్స్ అని తేలాక ఊపిరి పీల్చుకున్నారు.