PM Boris Johnson: ఆహా, అట్నా- 'వర్క్ ఫ్రమ్ హోం' గురించి ఏం చెప్పారు పీఎం సారూ!
PM Boris Johnson: 'వర్క్ ఫ్రమ్ హోం' విధానం వల్ల మనం చేసే పనేంటో మర్చిపోతామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.
PM Boris Johnson: కరోనా మహమ్మారి వల్ల వర్క్ ఫ్రమ్ హోం విధానం దాదాపు ఉద్యోగులందరికీ అలవాటైంది. కరోనా కేసులు తగ్గినా ఇప్పటికీ చాలా సంస్థలు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యం కల్పిస్తున్నాయి. అయితే ఈ విధానంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల మనం చేస్తున్న పనేమిటో మరిచిపోతామన్నారు.
ఆఫీసుకు
కరోనా కేసులు తగ్గుతుండటంతో మళ్లీ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని బోరిస్ జాన్సన్ అన్నారు. చుట్టూ మనతోటి ఉద్యోగులు ఉండటం వల్ల పని ఎక్కువ చేయగలమని అభిప్రాయపడ్డారు. ఉత్సాహంతో పాటు కొత్త కొత్త ఐడియాలతో పనిచేసే అవకాశం ఉందన్నారు.
రాజీనామా
చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రమ్మని పిలుస్తున్నాయి. ఇక్కడి నుంచే పని చేయాలని పలు కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే చాలా మంది ఉద్యోగులు మాత్రం ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోం విధానానికే మొగ్గు చూపుతున్నారు. ఆఫీసుకు రమ్మని పిలుస్తోన్న కంపెనీలకు ఉద్యోగులు షాకిస్తున్నారు.
ఆఫీసు నుంచి పని చేయమని అడిగిన తర్వాత 800 మంది వైట్‌హ్యాట్ జూనియర్ ఉద్యోగులు గత రెండు నెలల్లో తమ జాబ్‌కు రిజైన్ చేశారు. కిడ్స్ ఆన్‌లైన్ కోడింగ్ లెర్నింగ్ ఎడ్టెక్ స్టార్ట్-అప్ నుంచి వీరు రాజీనామా చేసినట్లు ఐఎన్‌సీ42 నివేదిక తెలిపింది. ఈ వార్తలతో ఐటీ కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌పై పునరాలోచనలో పడ్డాయి. మరికొన్ని రోజుల పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానం అవలంబించాలని ఆలోచిస్తున్నాయి.
Also Read: Green Card: భారతీయులకు శుభవార్త- ఇక ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డ్‌కు క్లియరెన్స్!
Also Read: Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!