Bill Gates Dance Video: మైక్రోసాప్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ డాన్స్ వీడియో చూశారా, మిలియన్ల వ్యూస్
మైక్రోసాప్ట్ సహా వ్యవస్థాపకుడు, కోటీశ్వరుడు బిల్ గేట్స్ 1995లో జరిగిన మైక్రోసాఫ్ట్ విండోస్ లాంచ్ పార్టీలో డాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరలవుతుంది.
మైక్రోసాప్ట్ సహా వ్యవస్థాపకుడు, ప్రపంచ టాప్ 10 కుబేరులలో ఒకరైన బిల్ గేట్స్ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. 1995లో జరిగిన మైక్రోసాఫ్ట్ విండోస్ లాంచ్ పార్టీలో తన కొలీగ్స్ తో కలిసి బిల్ గేట్స్ డాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియోలో అమెరికా వ్యాపార దిగ్గజం పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ట్విట్టర్ లో వీడియో పోస్ట్, వైరల్
ట్విట్టర్ వినియోగదారుడు లాస్ట్ ఇన్ హిస్టరీ ఈ వీడియోను షేర్ చేశారు. దాదాపు 3 దశాబ్దాల క్రితం నాటి ఈ వీడియోలో బిల్ గేట్స్ ఎంతో ఉత్సాహంతో కనిపించారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ మాజీ సీఈవో స్టీవ్ బల్మేర్ తో కలిసి మైక్రోసాఫ్ట్ విండోస్ లాంచ్ పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వీడియో కింద మైక్రోసాఫ్ట్ విండోస్ లాంచ్ పార్టీ , 1995 అని రాసి పోస్టు చేశారు. పోస్టు అయినప్పటి నుంచి ఆరు మిలియన్ల వీక్షణలు, ఏడు వేలకు పైగా లైక్ లతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏదైనా అద్భుత ఘట్టం జరిగిన సమయంలో సంతోషంతో స్టెప్పులు వేయడం కామన్ అని నెటిజన్లు అంటున్నారు.
కామెంట్స్, లైక్స్ తో నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ వీడియో పై ఓ యూజర్ ఇలా కామెంట్ చేశాడు. " చాలా సంతోషంగా, ఆశ్చర్యంగా ఉంది. 30 ఏళ్ల సంవత్సరాల తరవాత ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్టు డాన్స్ చేయండి’ అని నెటిజన్ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. మరో యూజర్ "బిల్ , సాధారణంగా ఇలాగే ఉంటారు! లాంచ్ పార్టీ అయితే ఎంత ఉత్సాహంగా జరగాలి, కంపెనీ యొక్క ప్రయత్నాన్ని బయటకు పరిచయం చేసే వేడుకలా కానీ ఏదో ఓ వ్యక్తి ప్రెజెంటేషన్ ఇచ్చేలా ఉండకూడదు" అని అన్నారు. మరో యూజర్ "నేను ఈ వీడియో కనిపించిన ప్రతిసారి ఈ వీడియో చూసేందుకు ఇష్టపడుతాను’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలాంటి పాత వీడియోలు చూడటం నాకు చాలా ఇష్టం. వారి కళ్ళజోడు, హెయిర్ స్టైల్, బట్టలు నాకు బాగా నచ్చాయి "అని కామెంట్ చేశాడు.
Microsoft Windows 1995 Launch Party 🕺🏻🖥 pic.twitter.com/3bzSVqSRVM
— Lost in History (@LIHpics) September 29, 2022
సంచలన పోస్టు చేసిన బిల్ గేట్స్
కొంత కాలం క్రితం ఈ వ్యాపార దిగ్గజం తన జీవితంలో చేసిన విచిత్రమైన పనుల గురించి లింకెడిన్ వేదికగా షేర్ చేసి వార్తల్లో నిలిచాడు. నవంబర్ 19న జరుపుకునే 'వరల్డ్ టాయిలెట్ డే' సందర్భంగా ఓ పోస్టు షేర్ చేస్తూ తన జీవితంలో మలం కలిసిన బురద నుంచి నీరు తాగడం నుంచి, ఎన్నో పెద్ద వేదికలు పంచుకోవడం వరకు ఎన్నో విచిత్రమైన పనులు చేశానని ఒప్పుకున్నారు. పోస్టు కింద ఆయన "జిమ్మీ ఫాల్కన్ తో కలిసి కొన్నేళ్ళ క్రితం మలంతో నిండిన బురద నుంచి నీరు తాగాను, మానవుల మలంతో నిండిన జాడిలతో వేదిక పంచుకున్నాను. ఎది ఏమైనా అవన్నీ ఒక గొప్పపని కోసమే "అని రాశారు.