Uttar Pradesh: హిందూ విద్యార్థులతో అన్య మత ప్రార్థనలు? గంగాజలంతో స్కూల్‌ను శుద్ధి చేసిన భాజపా
Uttar Pradesh News: కాన్‌పూర్‌లోని ఓ స్కూల్‌లో హిందూ విద్యార్థులతో ఇస్లాం ప్రార్థనలు చేయించటంపై భాజపా మండి పడుతోంది.
అన్ని మతప్రార్థనలూ జరుగుతాయి : స్కూల్ యాజమాన్యం
యూపీలోని కాన్పూర్‌లో ఓ ప్రైవేట్ స్కూల్‌లో హిందూ విద్యార్థులకు ఇస్లాంకు చెందిన "కల్మా" చెప్పారని ఆరోపిస్తూ భాజపా నేతలు ఆ పాఠశాలలో గంగాజలం చల్లారు. గంగా జలంతో స్కూల్‌ను పవిత్రం చేసినట్టు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, భజరంగ్ దళ్ సహా పలు హిందూ సంస్థలు ఆందోళన చేయగా, కమిషనరేట్ ఆఫ్ పోలీస్ స్పాట్‌కు వచ్చారు. అయితే ఈ స్కూల్ ప్రిన్సిపల్ మాత్రం ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. స్టూడెంట్స్ డైరీల్లో అన్ని మతాలకు సంబంధించిన ప్రేయర్స్ ఉంటాయని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాసెస్ కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చి వివాదాస్పదం అవటం వల్ల ఇకపై స్కూల్‌లో ప్రేయర్స్‌ను ఆపేస్తామని స్పష్టం చేశారు. స్కూల్ మేనేజర్ ఈ విషయాన్ని తెలిపారు. "నేనో స్కూల్ టీచర్‌ని. ఎంతో మందికి పాఠాలు చెప్పాను. కానీ...ఏ స్కూల్‌లో కూడా కలిమా చెప్పినట్టుగా చూడలేదు" అని ఓ పేరెంట్ ఆరోపించారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏసీపీ ఈ వివాదంలో జోక్యం చేసుకుని, సద్దుమణిగేలా చేశారు. ప్రేయర్ టైమ్‌లో మత ప్రార్థనలకు బదులుగా స్కూల్‌లో "జాతీయ గీతం" పాడటం ఇప్పటికే మొదలు పెట్టారని వెల్లడించారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే...కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
UP | Parents object to recitation of Islamic prayer during morning prayer at a school in Kanpur
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 1, 2022
We've prayers from all religions be it Hinduism, Islam, Sikhism & Christianity. As parents objected to Islamic prayer, we've stopped it & only national anthem is being sung:Principal pic.twitter.com/lywPvmpi5E
A matter came to the light, that students were made to recite some lines from Islam religion in a school. We talked to school admin, they told that they recited prayers of all religions. Since objection was raised, they stopped doing it: Nishank Sharma, ACP, Kanpur pic.twitter.com/n3TUzR9ZZV
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 1, 2022
My wife informed me about child reciting Islamic prayer fluently. Upon being questioned, he said he learnt it at school. I went to school but admin refused to stop it. Then I created WhatsApp group & informed the people along with those from BJP, says parent who raised objection pic.twitter.com/ZchaDj3mb9
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 1, 2022
ఇకపై జాతీయ గీతం మాత్రమే...
"హిందూ విద్యార్థులకు కలిమా చెబుతున్నారని ఓ ట్వీట్ దారా తెలిసింది. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడాం. దాదాపు 12 ఏళ్లుగా అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనలు జరుగుతున్నాయని వాళ్లు చెప్పారు. ఇప్పటి వరకూ ఎవరూ దీనిపై వివాదం చేయలేదని కూడా అన్నారు. ఏదేమైనా ఫిర్యాదులు అందిన తరవాత స్కూల్‌లో మత ప్రార్థనలు నిలిపివేశారు" అని ఏసీపీ స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో క్లాస్‌లు కండక్ట్ చేసిన సమయంలో విద్యార్థులకు కలిమా బోధించలేదని, వాళ్లతో తల్లిదండ్రులు ఉన్నారనే భయంతోనే ఇలా చేయలేకపోయారని భాజపా మహిళా మోర్చా గీతా నిగమ్ ఆరోపించారు. "ఇస్లాం ప్రార్థనలు చెప్పాలనుకుంటే, మదర్సాకు వెళ్లి చెప్పుకోండి. అల్లా తప్ప మరో దేవుడే లేదన్నదే కల్మా అర్థం" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Mona Lisa: మోనాలిసా ఆ నవ్వుని ఎలా మెయింటేన్ చేస్తోందో తెలుసా? సీక్రెట్ ఆఫ్ స్మైల్ రివీల్ అయింది
Also Read: Amit Shah: బిహార్‌లో బీజేపీ సమావేశాలు- తెలంగాణ నేతలను ఆకాశానికి ఎత్తేసిన అమిత్‌షా