News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Mona Lisa: మోనాలిసా ఆ నవ్వుని ఎలా మెయింటేన్ చేస్తోందో తెలుసా? సీక్రెట్ ఆఫ్ స్మైల్ రివీల్ అయింది

Mona Lisa: మోనాలిసా పెయింటింగ్‌లో నవ్వు చెక్కు చెదరకుండా ఇన్నేళ్లుగా ఎలా ఉంటోంది అన్న మిస్టరీ వీడింది. దీని వెనకున్న సీక్రెట్‌ను పారిస్ వెల్లడించింది.

FOLLOW US: 

Mona Lisa: 

మోనాలిసా "నవ్వు" మిస్టరీ వీడింది..

మోనాలిసా మోనాలిసా...చేశావులే నీ బానిస..
మోనాలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా..
ఈ పాలసీసా అందాన్ని చూడనేలేదు ఇంక ఏం లాభం..

అందం అంటే మోనాలిసా. మోనాలిసా అంటే అందం. అందుకే మన తెలుగు పాటల్లో ప్రేయసి అందాన్ని పొగిడేందుకు మోనాలిసానే రిఫరెన్స్‌గా తీసుకుంటారు. అంత ఫేమస్ మరి ఈ పేరు. వందల ఏళ్లక్రితం లియోనార్డీ డా విన్సీ గీసిన ఈ చిత్రం ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది. ఇప్పటికీ మోనాలిసా పెయింటింగ్ అంటే...ఉండే క్రేజే వేరు. ఈ పెయింటింగ్ అంత నచ్చటానికి కారణం..మోనాలిసా నవ్వు. ఓ నిముషం పాటు అలా ఈ చిత్రాన్ని చూస్తే రిలాక్స్ అయిపోతాం. అంత శక్తి ఉంది ఆ నవ్వులో. కేవలం ఆ నవ్వు వల్లే ఈ పెయింటింగ్‌కు అంత క్రేజ్  వచ్చిందంటే నమ్మి తీరాల్సిందే. ఇదంతా బానే ఉంది. మోనాలిసా నవ్వు వెనక మిస్టరీ ఏంటి..? ఇన్నేళ్లవుతున్నా ఆ నవ్వు చెదిరిపోకుండా 
ఎలా ఉంది..? పారిస్‌లోని లౌరే మ్యూజియంలో ఉన్న ఈ ఒరిజినల్ పెయింటింగ్‌ చెక్కు చెదరకుండా ఎలా మెయింటేన్ చేస్తున్నారు..? అనేది అంతుపట్టని రహస్యంగా ఉండిపోయింది. మొత్తానికి ఈ సీక్రెట్‌ను రివీల్ చేశారు. 

ఏంటీ రహస్యం..? 

పారిస్‌లో ఓ భారీ అండర్‌ గ్రౌండ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. భూమికి దాదాపు 98 అడుగుల లోతులో ఉంటుంది. ఐరోపాలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదైన తరుణంలో ఈ కూలింగ్ సిస్టమ్ నుంచి సుమారు 89 కిలోమీటర్ల వరకూ ఐస్ వాటర్‌ను పంపింగ్ చేస్తారు. 700 ప్రాంతాల్లో ఈ చల్లని నీరు పంపింగ్ చేయటం వల్ల అక్కడి వాతావరణం కాస్త చల్లబడుతుంది. రెనెవబుల్ సోర్సెస్ (పునరుత్పాదక వనరుల)తో ఉత్పత్తి చేసిన విద్యుత్‌నే ఇందుకోసం వినియోగిస్తారు. ఇది ఐరోపాలోనే అతి పెద్ద కూలింగ్ సిస్టమ్‌. ప్రస్తుతం ఐరోపాలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ వేడిని అక్కడి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఈ కూలింగ్ నెట్‌వర్క్‌ను హాస్పిటల్స్, స్కూల్స్, మెట్రో స్టేషన్స్‌కి విస్తృతం చేసేందుకు కనీసం రెండు దశాబ్దాల సమయం పడుతుందని అంచనా. అయితే అక్కడి ప్రజలకూ కూడా తెలియని ఓ రహస్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సిటీలోని క్వాయ్ బ్రాన్లీ మ్యూజియంతో పాటు మోనాలిసా పెయింటింగ్ ఉన్న లౌరే మ్యూజియాన్నీ ఈ కూలింగ్ నెట్‌వర్క్ కూలింగ్ చేస్తోంది. నిజానికి 1990ల నుంచే ఈ కూలింగ్ నెట్‌వర్క్‌ ఈ మ్యూజియంను అవసరమైనప్పుడల్లా చల్లబరుస్తోంది. ఇందులో ఎంతో అరుదైన పెయింటింగ్స్‌ను, ఆర్ట్‌వర్క్‌ను రక్షించుకునేందుకు యాజమాన్యం ఈ చర్యలు చేపడుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగిన సమయంలో ఈ మ్యూజియంలో విపరీతమైన ఉక్కపోత ఉంటుందని, అందులో పని చేసే సిబ్బంది చెబుతోంది. ఆ ఉక్కపోతకు ఆర్ట్ వర్క్ పాడైపోయే ప్రమాదముంది. అందుకే...ఐస్డ్‌ కోల్డ్‌ వాటర్‌ను పంపింగ్ చేస్తూ మ్యూజియంలోని వాతావరణాన్ని చల్ల బరుస్తున్నారు. 

మోనాలిసా గదిపై ప్రత్యేక శ్రద్ధ..

5 లక్షల 50 వేల ఆర్ట్‌వర్క్స్‌ ఉన్న ఈ మ్యూజియాన్ని కాపాడుకోటానికి అన్ని విధాల ప్రయత్నిస్తోంది యాజమాన్యం. ఇందులో ఏసీలు కూడా వినియోగించకుండా, కేవలం ఈ కూలింగ్ సిస్టమ్‌పైనే ఆధారపడతారు. మరి ఈ స్థాయిలో కూల్ వాటర్‌ను పంపింగ్ చేస్తుంటే కరెంట్ బిల్లు పేలిపోదా అనే అనుమానం కలగక మానదు. కానీ...ఈ నెట్‌వర్క్‌ను వినియోగించక ముందే కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చేదట. ఎప్పుడైతే ఈ కూలింగ్ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి కాస్త తగ్గిందని చెబుతున్నారు అక్కడి అధికారులు. మోనాలిసా పెయింటింగ్ ఉన్న స్టేట్‌ రూమ్‌పై మరింత ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఈ కూలింగ్ సిస్టమ్ వల్లే ఈ గది చల్లగా ఉంటుందని, ఉక్కపోత వల్ల పెయింటింగ్ పాడైపోయే ప్రమాదమే ఉండదని వివరిస్తున్నారు. సో ఆ విధంగా...మోనాలిసా పెయింటింగ్‌లో ఉన్న నవ్వుని కాపాడుతున్నారన్నమాట. 

Also Read: Weight loss: శ్వాసతో బరువు తగ్గొచ్చు, ఇదిగో ఇలా ప్రయత్నించండి

Also Read: Viral Video: ఆమె డ్యాన్స్ చేస్తే ఇన్‌స్టా షేక్ అవ్వాల్సిందే, అమెరికా మహిళ భాంగ్రా స్టెప్పులు అదుర్స్

Published at : 01 Aug 2022 03:32 PM (IST) Tags: Paris Monalisa Monalisa Smile Secret Louvre cope Museusm Secret Behind Monalisa Smile

సంబంధిత కథనాలు

Munawar Faruqui : హైదరాబాద్ లో మునవార్ ఫారుఖీ షో, అడ్డుకుంటామని బీజేవైఎస్ వార్నింగ్

Munawar Faruqui : హైదరాబాద్ లో మునవార్ ఫారుఖీ షో, అడ్డుకుంటామని బీజేవైఎస్ వార్నింగ్

Kurnool News : కర్నూలు జిల్లాలో గడప గడపకూ నిరసన సెగ

Kurnool News : కర్నూలు జిల్లాలో గడప గడపకూ నిరసన సెగ

Nizamabad News: వర్షం పడింది- మొక్కజొన్నకు డిమాండ్ పెరిగింది

Nizamabad News: వర్షం పడింది- మొక్కజొన్నకు డిమాండ్ పెరిగింది

Breaking News Live Telugu Updates: మంత్రి బొత్సతో అసంపూర్తిగా ముగిసిన ఉపాధ్యాయ సంఘాల చర్చలు  

Breaking News Live Telugu Updates: మంత్రి బొత్సతో అసంపూర్తిగా ముగిసిన ఉపాధ్యాయ సంఘాల చర్చలు  

Rajinikanth as Governor: రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ ! బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?

Rajinikanth as Governor:   రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ !  బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?

టాప్ స్టోరీస్

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి  దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!