Weight loss: శ్వాసతో బరువు తగ్గొచ్చు, ఇదిగో ఇలా ప్రయత్నించండి
చెమట పట్టకుండా, కఠినమైన వ్యాయామాలు చెయ్యకుండా, తిండి మానెయ్యకుండా కూడా బరువు తగ్గొచ్చు. అదెలాగా అని ఆలోచిస్తున్నారా..! అందుకోసమే ఈ శ్వాస వ్యాయామాలు.
బరువు తగ్గేందుకు తిండి మానేస్తూ, వ్యాయామాలు చేస్తూ చెమట చిందిస్తున్నారా? ఆ అవేవీ చేయకుండానే మీరు సులభంగా బరువు తగ్గొచ్చనే సంగతి తెలుసా? అదెలా అనుకుంటున్నారా? ఆ బరువు తగ్గే అస్త్రం మీ దగ్గరే ఉంది. కేవలం శ్వాసతోనే మీరు తగ్గిపోవచ్చు. రోజూ ఈ శ్వాస వ్యాయామాలు చేస్తే.. బరువు తగ్గడమే కాకుండా మానసిక ఆందోళనల నుంచి కూడా బయటపడొచ్చు.
కపలభతి (Kapalbhati)
కపలభతి అనేది అద్భుతమైన శ్వాస వ్యాయామం. ఇది అధిక బరువును తగ్గించడంతో పాటు బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. యోగా మ్యాట్ మీద నిటారుగా కూర్చుని కాళ్ళు రెండు దగ్గరకు మడవాలి. మీ వీపు, మెడ భాగం రెండు సమానమైన భంగిమలో ఉండేలా చూసుకోవాలి. మీ రెండు అరచేతులని రెండు మోకాళ్ళపై ఉంచి.. మెల్లగా కళ్ళు మూసుకుని, శ్వాస పీల్చి వేగంగా వదలాలి. ఇలా రోజుకు కనీసం 5 నిమిషాలపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
భస్ట్రిక (Bhastrika)
భస్త్రికా శ్వాస వ్యాయామం మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. మీ జీవక్రియను పెంచుతుంది. ఈ వ్యాయమంతో త్వరగా కేలరీలు బర్న్ అవుతాయి. భస్త్రికా ప్రాణాయామం సాధన చేయడానికి, మీ వీపు, మెడ నిటారుగా ఉంచి విశ్రాంతిగా కూర్చోవాలి. మీ పొట్ట కండరాలను తేలికగా ఉండే విధంగా కాళ్ళు ముడుచుకుని గట్టిగా శ్వాస పీల్చడం, వదలడం చెయ్యాలి. మీరు శ్వాస తీసుకోవడం రిథమిక్ గా ఉండాలి. ఈ ఆసనం కొంచెం కపలభతిని పోలి ఉంటుంది. ఊపిరి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు సెకను కంటే ఎక్కువ వ్యవధి ఉండకుండా చూసుకోవాలి. ఈ విధానాన్ని రోజు 5 నుంచి 10 నిమిషాల పాటు ప్రాక్టీస్ చెయ్యాలి.
భ్రమరి (Bhramari)
ఈ రకమైన వ్యాయామం మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది, శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. మీ శరీరం హార్మోన్ల స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇంట్లో ఒక మూలన మంచి స్థలాన్ని ఎంచుకుని పద్మాసనం మాదిరిగా కూర్చోవాలి. మీ భుజాలని చాచి మీ విపుని నిటారుగా ఉంచాలి. మీ కనుబొమ్మల పైన మీ చూపుడు వేళ్లు మీ నుదిటిని తాకే విధంగా మీ చేతులను ఉంచండి. మీ మధ్య, ఉంగరపు వేళ్లు మీ మూసిన కళ్లపై ఉండాలి. మీ నోరు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకోవాలి. మీరు ఈ విధానాన్ని పూర్తి చేసిన తర్వాత మీ మోకాళ్లపై మీ వేళ్లను సున్నితంగా ఉంచండి. సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు ఈ వ్యాయామాన్ని చెయ్యాలి.
డయాఫ్రాగటిక్ శ్వాస (Diaphragmatic breathing)
ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు మీ శరీరంలోని కణాలలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. యోగా చాపపై పడుకుని, మీ కడుపు క్రమంగా పైకి క్రిందికి కదిలించాలి. ఇలా చెయ్యడం వల్ల పొట్టలోని కొవ్వును తగ్గుతుంది. ఇది శరీర కండరాలను సడలించేందుకు సహాయపడుతుంది.
నోటితో గట్టిగా శ్వాస తీసుకోవడం (Mouth breathing)
మీరు నోటి నుంచి ఊపిరి పీల్చుకున్నప్పుడు.. పొట్టలో ఉన్న అదనపు కొవ్వు తగ్గించేందుకు ఈ వ్యాయామం సహాయపడుతుంది. ఈ వ్యాయామం చేసేటప్పుడు.. నోరు తెరిచి శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు 10 అంకెల వరకు లెక్కించాలి. వేగంగా గాలి పీల్చి నెమ్మదిగా వదలాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే ఫలితం బాగుంటుంది.
Also Read: ఉల్లి నూనెతో జుట్టు సమస్యలన్నీ పరార్ - ఇదిగో ఇలా తయారు చేయండి
Also Read: ఇండియాలోని ‘మంకీపాక్స్’కు ఐరోపాలోని సూపర్‌స్ప్రెడర్‌కి పోలికే లేదంట! ఇదెక్కడి చోద్యం?