By: ABP Desam | Updated at : 01 Aug 2022 04:43 PM (IST)
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది బీజేపీ యే - అమిత్ షా
Amit Shah: బిహార్ పాట్నాలో జరిగిన వివిధ మోర్చా కార్యక్రమాల్లో, జాతీయ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు తెలంగాణ బీజేపీ చేస్తున్న పోరాటాలు, కార్యక్రమాల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు చేస్తున్న పోరాటాల స్ఫూర్తితో మోర్చాల నేతలు పని చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల పరిధిలో ఇటీవల జాతీయ నాయకులు 2 రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయాన్ని అమిత్ షా, జేపీ నడ్డా ప్రస్తావించారు.
బండి సంజయ్ యాత్రలు అభినందనీయం...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పోరాటాలను పదేపడే ప్రస్తావించారు. ఆయన చేస్తున్న పాదయాత్రలు, యాత్రలను గురించి వివరించారు. వారు చేస్తున్నట్లుగానే మోర్చా నాయకులు చేస్తే బీజేపీ గెలుపు కచ్చితంగా సాధ్యం అవుతుందని అన్నారు. జాతీయ కార్యక్రమాల్లో తెలంగాణ ముచ్చట రావడంతో వివిధ మోర్చాలకు చెందిన తెలంగాణ నాయకులు చప్పట్లు కొట్టారు. ఆనందం వ్యక్తం చేశారు. తాము పడుతున్నకష్టాలను జాతీయ నాయకత్వం గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే..
పార్టీలో పైపదవుల్లో ఉన్న వాళ్లు గుర్తించి మెచ్చుకుంటే.. పార్టీ శ్రేణులు మరింత కష్టపడతారని స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ లీడర్లు. అప్పుడే రాబోయే ఎన్నికల్లో గెలిచే వరకు ఉత్సాహంగా పని చేయగలరన్నారు. అది దృష్టిలో పెట్టుకునే అమిత్ షా, జేపీ నడ్డా పదే పదే తెలంగాణ నేతల పేర్లు జాతీయ సమావేశాల్లో తీస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా జాతీయ స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు పని చేస్తున్నారని అంటున్నారు. బిహార్ లోనూ రెండోసారి విజయవంతంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. బిహార్ రాష్ట్రంలో జూలై 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు జరిగిన వివిధ మోర్చాల జాతీయ సంయుక్త సమావేశాలు జరిగాయి. వీటిలో పాల్గొన్న అమిత్ షా, జేపీ నడ్డాలు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు అందిరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ ఎంపీలు నియోజక వర్గాల్లోకి వెళ్లాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు అమిత్ షా తెలిపారు. సమావేశాల అనంతరం మూడు రోజులపాటు ఎంపీలు తమ తన నియోకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హైదరాబాద్‌లో నెల క్రితం జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో అన్నారు. రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టిన అమిత్ షా బంగాల్, తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా కమలం అధీనంలోకి తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
పసుపు బోర్డు చిన్నదవుద్దని స్పైస్ బోర్డుకు ట్రై చేస్తున్నాం: ఎంపీ అర్వింద్
Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు
KCR : బీజేపీ వల్లే సమస్యలు - తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కేసీఆర్ పిలుపు !
Munugodu BJP : మునుగోడులో టీఆర్ఎస్కు షాక్ - బీజేపీలో చేరిన చౌటుప్పల్ ఎంపీపీ !
RajBhavan Vs Pragati Bhavan : ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ ! కేసీఆర్ తీరుతో వివాదం మరింత ముదురుతోందా?
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?
Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!