Akhilesh on Aparna Yadav: 'నా మరదలు భాజపాలో చేరడం సంతోషం.. నాన్న వద్దన్నారు'
అపర్ణా యాదవ్.. భాజపాలో చేరడం వల్ల తమ భావజాలం మరింత విస్తరించిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు.
తన మరదలు అపర్ణా యాదవ్.. భాజపాలో చేరడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తమ పార్టీ భావజాలాన్ని భాజపా వరకు తీసుకువెళ్లినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అపర్ణా యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
#WATCH | Firstly, I will congratulate her and I am happy that Samajwadi Party's ideology is expanding...Netaji (former UP CM Mulayam Singh Yadav) tried to convince her: Samajwadi Party chief Akhilesh Yadav after Aparna Yadav joined BJP pic.twitter.com/aA294cMeVJ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 19, 2022
టికెట్ ఇవ్వలేదనేనా?
అపర్ణా యాదవ్‌కు టికెట్ నిరాకరించడమే ఆమె సమాజ్‌వాదీ పార్టీ వీడటానికి కారణమనే వార్తలను అఖిలేశ్ ఖండించారు. తాము ఇంకా పూర్తి స్థాయిలో టికెట్లు ఇవ్వలేదని అఖిలేశ్ అన్నారు. అయినా టికెట్ ఎవరికి ఇవ్వాలనేది తమ అంతర్గత సర్వే ఆధారంగా నిర్ణయిస్తామని చెప్పారు.
అపర్ణా యాదవ్ 2017లో సమాజ్‌వాదీ అభ్యర్థిగా లఖ్‌నవూ కాంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈరోజు భాజపాలో చేరారు.
యూపీ సమరం..
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మొదలుకానున్నాయి. మొత్తం ఏడు విడతల్లో యూపీ ఎన్నికలు జరగనున్నాయి.
- మొదటి విడత: Feb 10
- రెండో విడత: Feb 14
- మూడో విడత: Feb 20
- నాలుగో విడత: Feb 23
- ఐదో విడత: Feb 27
- ఆరో విడత: March 3
- ఏడో విడత: March 7
- ఫలితాలు విడుదల: March 10
Also Read: Aparna Yadav BJP: ములాయం సింగ్ దీవెనలతోనే భాజపాలో చేరాను: ABPతో అపర్ణా యాదవ్
Also Read: Aparna Yadav Joins BJP: అనుకున్నట్లే అయింది.. భాజపాలోకి ములాయం చిన్నకోడలు.. సమాజ్‌వాదీలో గుబులు!
Also Read: UP Election 2022: ఊ అన్న అఖిలేశ్ యాదవ్.. యూపీ ఎన్నికల బరిలో ఇక సమరమే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి