By: ABP Desam | Updated at : 19 Jan 2022 03:55 PM (IST)
Edited By: Murali Krishna
అఖిలేశ్ యాదవ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. అయితే దేశ ప్రజల దృష్టి మొత్తం ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. భాజపా, సమాజ్‌వాదీ పార్టీ మధ్య ఈసారి హోరాహోరీ పోరు జరగనున్నట్లు కనిపిస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా ఈసారి ఎన్నికల యుద్ధంలో దిగుతున్నట్లు సమాచారం.
అయితే కొద్దిరోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని అఖిలేశ్ ప్రకటించారు. కానీ పార్టీ సభ్యులతో పలు దఫాలు చర్చించి బరిలోకి దిగడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆజంగఢ్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా అఖిలేశ్ యాదవ్ ఉన్నారు.
ఎక్కడి నుంచి పోటీ?
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అఖిలేశ్ యాదవ్‌కు ఇదే తొలిసారి. అయితే ఏ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగుతారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ మూడు లేదా నాలుగో విడత ఎన్నికల్లో ఆయన పోటీకి దిగే అవకాశం ఉందని సమాచారం. పూర్వాంచల్ లేదా సెంట్రల్ యూపీ నుంచి బరిలోకి దిగొచ్చు.
2000లో తొలిసారి కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు అఖిలేశ్ యాదవ్. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి విజయం సాధించారు. 2012లో అఖిలేశ్ యాదవ్.. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం అయ్యారు.
7 విడతల్లో..
403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు మొదలుకానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.
సర్వే ఫలితాలు..
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ నిర్వహించింది. దీంట్లో యూపీలో భాజపా తిరిగి అధికారం చేపట్టనున్నట్లు తేలింది. గత నాలుగు సర్వే ఫలితాల ప్రకారం భాజపా.. ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయనుంది. కానీ సమాజ్‌వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.
జనవరి 6న చేసిన సర్వే ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి భాజపా అధికారం చేపడుతుందని 49 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 30 శాతం మంది ప్రజలు సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తుందని 7 శాతం మంది ప్రజలు అన్నారు.
జనవరి 3న చేసిన సర్వేలో 44 శాతం మంది ప్రజలు.. యోగి ఆదిత్యనాథ్ తమకు ముఖ్యమంత్రిగా కావాలన్నారు. 32 శాతం మంది అఖిలేశ్ యాదవ్ సీఎం కావాలని తెలిపారు. 15 శాతం మంది మాత్రమే మాయావతి సీఎం కావాలని కోరారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Delhi Dog Man : కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ - ఢిల్లీలో ఐఏఎస్ అఫీసర్ నిర్వాకం !
Kodali Nani : చిన్న పిల్లల్ని రెచ్చగొట్టి రోడ్లపైకి పంపారు, పవన్ కల్యాణ్ పై కొడాలి నాని హాట్ కామెంట్స్
Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు
TRS Leaders On Modi: తెలంగాణ నేలపై కమలం వికసించే ఛాన్స్ లేదు- మోదీ కామెంట్స్‌కు టీఆర్ఎస్ కౌంటర్
MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్‌పైనే అడిగిన స్టాలిన్ !
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్డేట్, మరీ అంత త్వరగానా?
Haridwar court historic decision: తల్లిదండ్రులను వేధించే పిల్లలకు ఇదో హెచ్చరిక- చారిత్రాత్మక తీర్పు చెప్పిన హరిద్వార్ కోర్టు
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!