1 PM Telugu News Today: మధ్యాహ్నం 1 గంట వరకు టాప్ న్యూస్ మీ కోసం
1 PM Telugu News Today: ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న టాప్ న్యూస్ ఏంటో చూద్దాం
1 PM Telugu News Today: ఈడీ ముందుకు రాహుల్ గాంధీ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు సహా ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న టాప్ న్యూస్‌పై ఓసారి లుక్కేద్దాం.
ఈడీ విచారణకు రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ భారీ ఎత్తున నిరసనలు చేపడుతోంది. 'సత్యాగ్రహ' పేరుతో తలపెట్టిన ఈ ఆందోళనలను ఎక్కడికక్కడ పోలీసులు నిలువరిస్తున్నారు. ఈ నిరసనకు అనుమతి లేదని దిల్లీ పోలీసులు చెబుతున్నారు.
పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రేప్ కేసులో మైనర్ల మధ్య తగాదా
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేపు కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో కొట్టుకున్నారు. వీరు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వంటే నువ్వేనంటూ ఐదుగురు మైనర్లు ఒకరిపై ఒకరు ప్లేటతో దాడి చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
దేశంలో కరోనా భయం
దేశంలో వరుసగా మూడో రోజు కరోనా కేసులు 8 వేలకు పైనే నమోదయ్యాయి. కొత్తగా 8,084 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు. తాజాగా 4,592 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
అనంతపురంలో ఉద్రిక్తత
జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు పిలుపునివ్వడం అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్తతలకు దారిదీసింది. టీడీపీ నేతలు నేడు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా.. ఈ క్రమంలో కలెక్టరేట్ వద్ద టీడీపీ నేతలు, పచ్చ చొక్కాలు కనిపిస్తే చాలు పోలీసులు వారిని నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. టీడీపీ ముఖ్య నేతలను ఆదివారం రాత్రి నుంచి గృహనిర్బంధం చేస్తున్నారు.
హీరోయిన్ సోదరుడి అరెస్ట్
హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి నగరంలోని ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రేవ్ పార్టీ జరుగుతుండడంతో 35 మంది దాకా అదుపులోకి తీసుకున్నారు. వారిలో సిద్ధాంత్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
భారీగా ట్రాఫిక్ జామ్ - ఈ ప్రాంతాల్లో ఆంక్షలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలవడంపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ ర్యాలీ చేస్తోంది. ఇందుకు పోలీసులు అనుమతించారు. ఆ నిరసనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ర్యాలీ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.