Congress Protest: ఈడీ ముందుకు రాహుల్ గాంధీ- 'తగ్గేదేలే' అంటూ కాంగ్రెస్ సత్యాగ్రహ ర్యాలీ
Congress Protest: ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ సత్యాగ్రహ ర్యాలీ చేపట్టింది.
Congress Protest: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణకు సోమవారం హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ భారీ ఎత్తున నిరసనలు చేపడుతోంది. 'సత్యాగ్రహ' పేరుతో తలపెట్టిన ఈ ఆందోళనలను ఎక్కడికక్కడ పోలీసులు నిలువరిస్తున్నారు. ఈ నిరసనకు అనుమతి లేదని దిల్లీ పోలీసులు చెబుతున్నారు.
Congress workers stage protest holding placards in support of party leader Rahul Gandhi ahead of his appearance before ED today in the National Herald case.
— ANI (@ANI) June 13, 2022
Visuals from outside AICC headquarters, Delhi pic.twitter.com/jJrzCsRzYx
ఎక్కడికక్కడ అరెస్ట్
#WATCH 'Rahul Gandhi zindabad, zindabad' song resonates at Congress party headquarters in Delhi as RG is set to march to Enforcement Directorate to appear before it in National Herald case
— ANI (@ANI) June 13, 2022
Top Congress leaders are present at the party HQ to show solidarity with party leadership pic.twitter.com/6NaCL6QuiK
రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరు కావడానికి ముందు ఆయనకు మద్దతుగా నినాదాలు చేసినందుకు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీని పిలిపించిన ఈడీ చర్యకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తగ్గేదేలే
అయితే కాంగ్రెస్ మాత్రం తన సత్యాగ్రహ యాత్రను కొనసాగిస్తుందని ఆ పార్టీ నేత రణదీప్ సుర్జేవాలా తెలిపారు. దిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించిన కొన్ని గంటల తర్వాత ఆయన ఈ మేరకు వెల్లడించారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తుందని సుర్జేవాలా వివరించారు.
మరోవైపు కొవిడ్-19 సంబంధిత సమస్యలతో ఆసుపత్రి పాలైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జూన్ 23న ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు.
Also Read: Presidential Polls: దీదీకి ఉద్ధవ్ ఠాక్రే షాక్- ఆ సమావేశానికి మహారాష్ట్ర సీఎం డుమ్మా!
Also Read: Starbucks Update: మోకాళ్ల మీద పడి రిక్వెస్ట్ చేస్తా, దయచేసి ఆఫీస్‌కు రండి-స్టార్‌బక్స్ సీఈవో కష్టాలు