అన్వేషించండి

Jubilee Hills Rape Case: రేప్‌ కేసులో మైనర్ల మధ్య తగాదా, జువైనల్ హోంలో ఒకర్నొకరు కొట్టుకున్న నిందితులు!

Minors in Juvenile Home: ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వంటే నువ్వేనంటూ ఐదుగురు మైనర్లు ఒకరిపై ఒకరు ప్లేట‌తో దాడి చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేపు కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో కొట్టుకున్నారు. వీరు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వంటే నువ్వేనంటూ ఐదుగురు మైనర్లు ఒకరిపై ఒకరు ప్లేట‌తో దాడి చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. బాలికను ట్రాప్ చేద్దామని నువ్వే అన్నావని కార్పొరేటర్ కుమారుడు టార్గెట్‌గా ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అతణ్ని టార్గెట్ చేసుకుని మిగిలిన నలుగురు దాడి చేశారు. అతను తిరగబడి వీరిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. చివరకు పోలీసులు, జువైనల్ హోం అధికారుల జోక్యంతో వారికి సర్ది చెప్పి ఈ వివాదం సద్దుమణిగేలా చేసినట్లుగా సమాచారం. ఈ ఘటనతో నిందితులు ఉన్న జువెనైల్ హోమ్ కు పోలీసులు భద్రత పెంచారు.

ఏ - 1 సాదుద్దీన్‌కి ముగిసిన పోలీసుల కస్టడీ
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మలిక్ పోలీసుల కస్టడీ ముగిసింది. ఈ రోజు ఉదయం ఏ - 1 అయిన సాదుద్దీన్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మలిక్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని పోలీసులు చంచల్‌ గూడ జైలుకు తరలించారు. కస్టడీ చివరి రోజైన నిన్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన సంగతి తెలిసిందే.

కార్పొరేటర్ కొడుకే మొదట లైంగిక దాడి!

బాధిత బాలికపై మొదటగా కార్పొరేటర్‌ కుమారుడే లైంగిక దాడికి పాల్పడినట్టుగా సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ తర్వాత పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తర్వాత కేసులో ఏ - 5గా ఉన్న బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన బాలుడు (16), ప్రభుత్వ రంగ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించారు. ఆ తర్వాతే మిగిలిన ఇద్దరు మైనర్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ పూర్తి అయ్యాక ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. నాలుగు రోజుల కస్టడీ గడువు ముగియడంతో సాదుద్దీన్‌ మాలిక్‌ను సోమవారం ఉదయం న్యాయస్థానంలో హజరుపరచి, చంచల్‌గూడ జైలుకు తరలించారు.

బిర్యానీ తెప్పించలేదు, మామూలు ఆహారమే పెట్టాం - పోలీసులు
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన నిందితులకు బయటి నుంచి వారి బంధువులు తెచ్చిన ఆహారాన్ని ఇచ్చారనే వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను పోలీసు అధికారులు కొట్టిపారేశారు. పోలీసుల సెక్యురిటీ కోసం సిబ్బంది బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకున్నారని, అది చూసి నిందితులకు ఆ ఆహారం పెట్టామేమో అని ఓ వర్గం మీడియా భ్రమ పడిందని అన్నారు. నిందితులకు అందరిలాగే పప్పు అన్నం మాత్రమే ఇచ్చినట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget