TPCC Rally Hyderabad: కొనసాగుతున్న కాంగ్రెస్ నేతల ర్యాలీ, ఈ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ - ఈ ప్రాంతాల్లో ఆంక్షలు
Hyderabad Traffic News: ఈ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ను మళ్లించాల్సి వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.
Telangana Congress Protest: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్ తలపెట్టిన ర్యాలీ జరిగింది. ఇందుకు పోలీసులు అనుమతించారు. ఆ నిరసనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ర్యాలీ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఈ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ను మళ్లించాల్సి వచ్చింది. ఖైరతాబాద్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, చింతల్ బస్తీ, లక్డీ క పూల్, బషీర్ బాగ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ జంక్షన్, అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ జంక్షన్, సెక్రెటేరియట్ మార్గాల్లో వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాస్కి, జగ్గారెడ్డి సహా అందరు కాంగ్రెస్ నేతలు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. నల్ల బట్టలు, నల్ల కండువాలు ధరించారు. జగ్గారెడ్డి ఏకంగా సోనియా గాంధీ విగ్రహం ఎక్కి నిరసన తెలిపారు. వీరంతా అక్కడ నుంచి బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు.
Telangana Congress’ protest against ED’s summon to Shri @RahulGandhi pic.twitter.com/N9dHcklIaV
— Aditya Goswami (@AdityaGoswami_) June 13, 2022
విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణకు సోమవారం హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ భారీ ఎత్తున నిరసనలు చేపడుతోంది. 'సత్యాగ్రహ' పేరుతో తలపెట్టిన ఈ ఆందోళనలను ఎక్కడికక్కడ పోలీసులు నిలువరిస్తున్నారు. ఈ నిరసనకు అనుమతి లేదని దిల్లీ పోలీసులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరు కావడానికి ముందు ఆయనకు మద్దతుగా నినాదాలు చేసినందుకు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీని పిలిపించిన ఈడీ చర్యకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి బయలుదేరిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ#IndiaWithRahulGandhi pic.twitter.com/y36dUanqxL
— Congress for Telangana (@Congress4TS) June 13, 2022