Drugs: డ్రగ్స్ తీసుకొన్నాడనే ఆరోపణతో హీరోయిన్ సోదరుడి అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోదరుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
బాలీవుడ్‌తో పాటూ తెలుగు ప్రేక్షకులకూ శ్రద్ధాకపూర్ బాగా పరిచయమే. ఆమె సోదరుడు సిద్ధాంత్ కపూర్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి నగరంలోని ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రేవ్ పార్టీ జరుగుతుండడంతో 35 మంది దాకా అదుపులోకి తీసుకున్నారు. వారిలో సిద్ధాంత్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి శాంపిల్స్ ని పరీక్సకుల పంపగా ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయినట్టు చెప్పారు. ఆ ఆరుగురిలో సిద్ధాంత్ కూడా ఉన్నాడు. వీరిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
తెలియదంటున్న శక్తి కపూర్
ఈయన కూడా నటుడే. బాలీవుడ్లోని కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. దాదాపు ఆయన శ్రద్ధా నటించిన సినిమాల్లో కనిపించాడు. ఈ అంశంపై శక్తి కపూర్ స్పందించారు. తమకు పూర్తి విషయం తెలియదని, టీవీలో చూశాక అరెస్టు చేసిన సంగతి తెలిసిందని చెప్పారు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. సిద్ధాంత్ మొదట డిస్క్ జాకీగా కెరీర్ ప్రారంభించాడు. తరువాత సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అనంతరం నటుడిగా మారాడు. కానీ మంచి గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకోపోయాడు.
గతంలో శ్రద్ధాను కూడా నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ వాడకం విషయంలో విచారించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో శ్రద్ధా విచారణను ఎదుర్కొంది. సినిమా ఇండస్ట్రీపై డ్రగ్స్ నీలి నీడలు ఎప్పటికప్పుడు కమ్ముకుంటూనే ఉన్నాయి. గతేడాది షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూడా రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలనతో అరెస్టయ్యాడు. ముంబై తీరంలో ఉన్న ఓ క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీపై దాడి చేసి పోలీసులు ఆర్యన్ ఖాన్ ను పట్టుకున్నారు. అయితే చివరికి ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది ఆయన్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది.
View this post on Instagram
Also read: నయనతార - విఘ్నేష్ పెళ్లిని నెట్‌ఫ్లిక్సే చేసిందా?