అన్వేషించండి

Nayantara: నయనతార - విఘ్నేష్ పెళ్లిని నెట్‌ఫ్లిక్సే చేసిందా?

సెలెబ్రిటీల పెళ్లంటే మామూలు విషయమా? నయనతార పెళ్లిపై ఎంతో ఆసక్తి నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే.

నయనతార  తాను ప్రేమించిన విఘ్నేష్ శివన్‌ను అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి తమిళ, తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మొదట తిరుపతిలో పెళ్లాడాలని భావించిన ఈ జంటకు అనుమతి లభించలేదు. దీంతో పెళ్లి వేదిక మహాబలిపురంలోని ఓ ప్రముఖ రిసార్ట్‌కు మారింది.వీరి పెళ్లికి నెట్‌ఫ్లిక్సే అంతా ఖర్చు పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దాదాపు వివాహం కోసం రూ.25 కోట్ల దాకా చెల్లించిందనే టాక్ కూడా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌కి ఇంత ఖర్చుపెట్టాల్సిన అవసరం ఏముందని ఆలోచిస్తున్నారా? ఆ పెళ్లి వేడుక తాలూకు డిజిటల్ హక్కులు ఈ సంస్థ తీసుకుందట. త్వరలో ఆ ఓటీటీలో ఈ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కాబోతోందని కూడా వినిపిస్తోంది. 

రూపాయి ఖర్చులేదా?
నయనతార - విఘ్నేష్ శివన్ తమ పెళ్లి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని,విందు దగ్గర నుంచి అతిథులకు గదుల బుకింగ్ వరకు అంతా నెట్ ఫ్లిక్సే చూసుకుందని అంటున్నారు. ఓ గ్లాస్ ప్యాలెస్‌ను కూడా నిర్మించారని టాక్ వస్తోంది. వారి వివాహం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయితే ఇవన్నీ పుకార్లు కాదు నిజమేనని నమ్మవచ్చు. అంతేకాదు విందులో ఒక్కప్లేటు కోసం రూ.3500 చెల్లించినట్టు చెబుతున్నారు. అంతేకాదు మేకప్ ఆర్టిస్టులను, సెక్యూరిటీని ముంబై నుంచి తీసుకువచ్చారట. ఇక ఈ పెళ్లి డైరెక్షన్ చేసింది గౌతమ్ మీనన్ అని చెప్పుకుంటున్నారు. పెళ్లి వేదిక ఫోటోలు కూడా ఇంతవరకు బయటికి రాలేదు, దీన్ని బట్టి నెట్ ఫ్లిక్స్ నిజంగానే త్వరలో స్ట్రీమింగ్ చేయబోతోందా? అన్న అనుమానాలు సాధారణ ప్రజలకు వస్తున్నాయి. 

నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్లి జూన్ 9 ఉదయాన జరిగింది. అయితే పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉండాలని నయన్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలియదు కానీ, ఆమె అభిమానుల్లో మాత్రం కలవరానికి కారణమైంది. బాలీవుడ్లో పెళ్లయిన తరువాత కూడా కరీనా కపూర్, అనుష్క శర్మ, సోనమ్ కపూర్ వంటివారు రాణిస్తున్నారు. మరి నయనతార వారిని ఆదర్శంగా తీసుకుంటుందో లేక వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే ఆస్వాదించాలనుకుంటుందో తెలియదు. అలాగే విఘ్నేష్ తల్లి కూడా పెళ్లి తరువాత సినిమాల్లో నటించకూడదనే షరతు పెట్టారని టాక్ వచ్చింది. పెళ్లికి ఒప్పుకోవడానికి ముందే ఆవిడ ఈ కండిషన్ పెట్టిందని, అందుకు ఒప్పుకునే నయనత వివాహం చేసుకుందని అంటున్నారు. అయితే హీరోయిన్ గా చేయకపోయినా, నిర్మాతగా చేసే అవకాశం ఉందట. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by nayanthara🔵 (@nayantharaaa)

Also read: ముంబై వీరుడి సినిమా థియేటర్లలో అంటూ అమితాబ్ ట్వీట్, స్పందించిన ప్రిన్స్ మహేష్

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Nikhil Vijayendra Simha: డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget