అన్వేషించండి

Top Headlines Today: ఎన్డీఏలో చంద్రబాబే కీలకం అవుతారా?; రేవ్ పార్టీ కేసులో మళ్లీ రాజకీయ దుమారం - నేటి టాప్ న్యూస్

AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

ఎన్డీఏలో చంద్రబాబే కీలకం అవుతారా?

ఒక్క బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏ మొత్తానికి నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఎన్నికల రేస్ ను ప్రారంభించింది. ఆరు విడతలు అయిపోయిన తర్వాత జాతీయ స్థాయిలో సెఫాలజిస్టులు పోలింగ్ సరళిని విశ్లేషించి బీజేపీకి అంత జోరు లేదని  తేల్చేస్తున్నారు. అయితే బొటాబొటి మెజార్టీ లేదా మెజార్టీకి కాస్త తక్కువగానే ఉంటాయని సెఫాలజిస్టులు వరుసగా అంచనాలు వేయడం ప్రారంభించారు. ఇంకా చదవండి

Karimnagar పోలీసుల అత్యుత్సాహం

హనుమాన్ మాలధారణలో ఉన్న వ్యక్తిని వందల అడుగులు వాహనంతో లాక్కెళ్లారు పోలీసులు. ఇతర వర్గానికి చెందిన వ్యక్తితో శోభాయాత్ర విషయంలో గొడవ జరిగింది. సమచారం అందుకున్న కరీంనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని అత్యుత్సాహం ప్రదర్శించారు. కరీంనగర్‌లో హనుమాన్ మాలదారులు కొందర్ని పోలీసులు అరెస్టు చేయగా.. మరో హనుమాన్ మాలధారుడ్ని పోలీసులు వాహనంతో లాక్కెళ్లడం వివాదాస్పదం అవుతోంది. ఇంకా చదవండి

రేవ్ పార్టీ కేసులో మళ్లీ రాజకీయ దుమారం

బెంగళూరు రేవ్ పార్టీ కేసుపై ఏపీలో మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది.  రేవ్‌ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు వాసు ముఖ్య అనుచరుడు, ఈ కేసులో ఏ2గా ఉన్న అరుణ్‌ కుమార్‌ను బెంగళూరు క్రైం బ్యాచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో అరుణ్‌ ఏ2గా ఉన్నాడు. బర్త్‌ డే పార్టీ నిర్వహించిన వాసుకు అరుణ్‌ ముఖ్య అనుచరుడు. సొంతూరు మాత్రం తవణంపల్లె మండలం మడవనేరి గ్రామం. అరుణ్‌ కుమార్‌ బెంగళూరులో ఉంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు.   అరుణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ఇంకా చదవండి

పవన్ కల్యాణ్ చెప్పిందే నిజమైందా?

అనేక మంది మహిళలు, తెలుగు వాళ్లు అదృశ్యమవుతున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు గతంలో సంచలనం సృష్టించాయి. అయితే అదంతా అబద్దమని ఆయనపై కేసులు కూడా పెట్టింది  ప్రభుత్వం. కానీ ఇప్పుడు బయట పడుతున్న ఘటనలు చూస్తే  పవన్ కళ్యాణ్ భయపడినట్టే జరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఒక్క కంబోడియా లోనే బానిసలుగా 5000 మంది మనవాళ్ళు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇంకా చదవండి

గూగుల్ కోఫౌండర్‌ భార్యతో మస్క్‌కి అఫైర్‌

టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కి గూగుల్ కోఫౌండర్ భార్యకి అఫైర్ ఉందంటూ ఓ రిపోర్ట్ సంచలన విషయం చెప్పింది. గూగుల్ కోఫౌండర్ సెర్గే బ్రిన్‌ భార్య నికోలే షానహాన్‌తో (Nicole Shanahan) అఫైర్‌ నడిపించాడని వెల్లడించింది. 2021లో ఓ పార్టీలో వీళ్లిద్దరూ కలిసే ఉన్నారని, ఆ టైమ్‌లో కలిసే డ్రగ్స్ కూడా తీసుకున్నారని తేల్చి చెప్పింది. ఇంకా చదవండి

బీజేపీ మళ్లీ నిలబడనుందా?

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కమలం పార్టీ ప్రయత్నిస్తోంది. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న హస్తం పార్టీ 'if not now, then never' అన్న రీతిలో ఈ ఎన్నికల్లో పోరాడుతోంది. దేశంలోని 543 పార్లమెంట్ సీట్లకు గాను అధికారంలోకి రావాలంటే ఏ పార్టీ అయినా.. పార్టీల కూటమి అయినా 272 సీట్లు గెల్చుకోవాలి. అయితే ఈ దఫా 400 సీట్లే లక్ష్యమని బీజేపీ చెబుతూ తమ పార్టీ శ్రేణులను ముందుకు కదిలిస్తుంటే, ఇండియా కూటమిదే అధికారం అంటూ కాంగ్రెస్ ఎన్నికల కదనరంగంలో సాగుతోంది. ఇంకా చదవండి

పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయలేదా?

 ఇప్పటికీ పాన్‌-ఆధార్‌ నంబర్‌ లింక్‌ చేయని టాక్స్‌పేయర్ల కోసం ఆదాయ పన్ను విభాగం ఇటీవల ప్రకటించిన రిలీఫ్‌ తాలూకు డెడ్‌లైన్‌ అతి సమీపంలోకి వచ్చింది. ఈ నెల 31తో ఆ గడువు ముగుస్తుంది. ఈ డెడ్‌లైన్‌ దాటిన తర్వాత కూడా పాన్‌-ఆధార్‌ నంబర్‌ లింక్‌ చేయకపోతే రెట్టింపు పన్ను + జరిమానా తప్పదు. ఇంకా చదవండి

కాండ్రకోట మిస్టరీలో సంకెళ్లు వీడే సందేహం పోయే..

వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'నింద'. ఈ చిత్రానికి 'ఏ కాండ్రకోట మిస్టరీ' అనేది ఉప శీర్షిక. దీని ప్రత్యేకత ఏమిటి? అంటే... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏపీలోని కాండ్రకోట మిస్టరీ స్ఫూర్తి, ఆధారంగా రూపొందిన చిత్రమిది. రాజేష్ జగన్నాథం 'నింద' చిత్రానికి దర్శక నిర్మాత. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కించారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ సినిమాలో 'సంకెళ్లు వీడే...' పాటను గానామాస్ స్పెషల్ పాఠశాలకు చెందిన పిల్లల చేత విడుదల చేయించారు. ఇంకా చదవండి

సేల్స్ పర్సన్‌గా మారిన దీపికా పదుకొనె

ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయాల్లో దీపికా పదుకొనె ప్రెగ్నెన్సీ కూడా ఒకటి. ప్రెగ్నెన్సీ తర్వాత దీపికా పలు కార్యక్రమాల్లో పాల్గొంది. కానీ తాజాగా తన సేల్స్ పర్సన్‌గా మారి తన సొంత స్కిన్ కేర్ బ్రాండ్‌కు ప్రమోషన్ చేస్తున్న వీడియోలో తన బేబీ బంప్ మొదటిసారిగా స్పష్టంగా కనిపించింది. ఇంకా చదవండి

నేడే IPL అంతిమ యుద్ధం

ఐపీఎల్(IPL)-17 అంతిమ సమరానికి సమయం ఆసన్నమైంది. చెన్నై వేదికగా జరగనున్న ఫైనల్‌లో కోలకతా(KKR), హైదరాబాద్‌(SRH) జట్లు తలపడనున్నాయి. లీగ్‌ దశను అగ్రస్థానంతో ముగించిన కోల్‌కతా హ్యాట్రీక్‌ కప్పుపై కన్నేసింది. ఈ సీజన్‌లో విధ్వంసక బ్యాటింగ్‌ సరికొత్త రైజర్స్‌ చూపించిన హైదరాబాద్‌ రెండో కప్పును అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. బలాబలాల్లో సమవుజ్జీల్లా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య చెపాక్‌లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా చదవండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Runa Mafi In Telangana: ఇప్పటి వరకు నిరుద్యోగులు- ఇకపై రైతులు రోడ్లపైకి వస్తారు- ప్రభుత్వానికి విపక్షాల హెచ్చరిక
ఇప్పటి వరకు నిరుద్యోగులు- ఇకపై రైతులు రోడ్లపైకి వస్తారు- ప్రభుత్వానికి విపక్షాల హెచ్చరిక
Nara Lokesh: కువైట్ బాధితుడు సేఫ్, వైరల్ వీడియోలోని వ్యక్తిని రక్షించాం: నారా లోకేశ్
కువైట్ బాధితుడు సేఫ్, వైరల్ వీడియోలోని వ్యక్తిని రక్షించాం: నారా లోకేశ్
Allu Arjun: అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసి మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసి మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్'లో రెండో పాట 'మార్ ముంత చోడ్ చింత' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్!
'డబుల్ ఇస్మార్ట్'లో రెండో పాట 'మార్ ముంత చోడ్ చింత' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PCB Threatened BCCI Regarding 2025 Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ సస్పెన్స్‌లో కొత్త అప్‌డేట్ | ABP Desamటీ20ల్లో ఓపెనర్లుగా ఈ నలుగురిలో ఎవరికి ఛాన్స్ | ABP DesamAnant Ambani gifts 2Cr Worth Watches |పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ కి కళ్లు చెదిరే గిఫ్టులిచ్చిన అంబానీVizianagaram Fort Lesser Known Story | దేశానికి ఆఖరి కోటగా చెప్పే విజయనగరం కోటపై ఆసక్తికర విషయాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Runa Mafi In Telangana: ఇప్పటి వరకు నిరుద్యోగులు- ఇకపై రైతులు రోడ్లపైకి వస్తారు- ప్రభుత్వానికి విపక్షాల హెచ్చరిక
ఇప్పటి వరకు నిరుద్యోగులు- ఇకపై రైతులు రోడ్లపైకి వస్తారు- ప్రభుత్వానికి విపక్షాల హెచ్చరిక
Nara Lokesh: కువైట్ బాధితుడు సేఫ్, వైరల్ వీడియోలోని వ్యక్తిని రక్షించాం: నారా లోకేశ్
కువైట్ బాధితుడు సేఫ్, వైరల్ వీడియోలోని వ్యక్తిని రక్షించాం: నారా లోకేశ్
Allu Arjun: అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసి మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసి మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్'లో రెండో పాట 'మార్ ముంత చోడ్ చింత' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్!
'డబుల్ ఇస్మార్ట్'లో రెండో పాట 'మార్ ముంత చోడ్ చింత' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్!
Us Election 2024 : డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం- ఉపాధ్యక్ష అభ్యర్థిగా జె.డి.వేన్స్‌
డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం- ఉపాధ్యక్ష అభ్యర్థిగా జె.డి.వేన్స్‌
Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరో 5 రోజులు ఇంతే - ఐఎండీ
తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరో 5 రోజులు ఇంతే - ఐఎండీ
Madhya Pradesh :డిగ్రీలతో ప్రయోజనం లేదు- పంక్చర్ షాపులు పెట్టుకోండి- బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్
డిగ్రీలతో ప్రయోజనం లేదు- పంక్చర్ షాపులు పెట్టుకోండి- బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్
Telangana: గ్రూప్-2 వాయిదా వేయాలని అభ్యర్ధుల ఆందోళన, అరెస్టు చేసిన పోలీసులు
గ్రూప్-2 వాయిదా వేయాలని అభ్యర్ధుల ఆందోళన, అరెస్టు చేసిన పోలీసులు
Embed widget