అన్వేషించండి
Advertisement
Todays Top 10 headlines:పోలవరానికి నిధులు విడుదల, హైదరాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Top 10 News :
ఆంధ్రా యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఆర్కిటెక్చర్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థినులను సెకండియర్ విద్యార్థినులు.. హాస్టల్‌లో డ్యాన్సులు వేయాలంటూ ర్యాగింగ్ చేశారు. అంతేకాకుండా ఈ తతంగాన్నంతా వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. తమకు డ్యాన్స్ రాదని చెప్తే అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకుని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టినట్లు బాధితులు వాపోయారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. ప్రధానితో చంద్రబాబు కీలక చర్చలు
ప్రధాని మోదీతో చర్చలు ఫలవంతంగా జరిగాయని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పోలవరం సవరించిన వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ‘‘ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించా. రాష్ట్రం ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనే విషయాల్లో కేంద్ర మద్దతు ఉంది. అమరావతికి ప్రధాని మద్దతును అభినందిస్తున్నా’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. సునీల్ కుమార్‌పై చర్యలు తప్పవా..?
వైసీపీ హయాంలో కీలకంగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత జూలైలో సునీల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇవి ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్దమని ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. వీటిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులుజారీ చేసింది. సునీల్ స్పందన వచ్చాక ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్‌ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రూ. 17 వేల కోట్లతో 7,444 కి. మీ మేర సీఎస్ఎంపీకి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. సీఎస్‌ఎంపీని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇవ్వాలని కోరారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ తేదీలు ఇవే
తెలంగాణ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫార్మసీ, బయెటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. అక్టోబరు 19 నుంచి 22 వరకు బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి అక్టోబరు 21 నుంచి 23 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. 21 నుంచి 25 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. అక్టోబరు 28న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో మంగళ, బుధ వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. దేశంలోనే రిచ్చెస్ట్ రైల్వే స్టేషన్ ఏదంటే..?
ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది సైతం రైల్వే స్టేషన్ల ఆదాయాన్ని రైల్వే శాఖ వెల్లడించింది. 2023 - 24 ఆర్థిక ఏడాదికి ఎక్కువ ఆదాయం పొందిన 100 రైల్వే స్టేషన్లలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో ఉంది. పశ్చిమబెంగాల్‌లోని హౌరా స్టేషన్ రెండు, చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ మూడు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఢిల్లీ స్టేషన్ రూ.3,337 కోట్లు..సికింద్రాబాద్ స్టేషన్ రూ.1,276 కోట్లు అర్జించాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. యుద్ధం ఆపేది లేదు.. వారిని విడిచేది లేదు
హిజ్బుల్లా, హమాస్ అంతమే పంతంగా ముందుకు సాగుతున్న ఇజ్రాయెల్ దళాలు.. లెబనాన్‌పై భీకర దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఇంతటితో ఆపడం లేదని స్పష్టం చేశారు. శత్రువుల శక్తి సామర్థ్యాలను వీలైనంత వరకు దెబ్బ తీద్దామంటూ సైన్యానికి లేఖ రాశారు. శత్రువును నాశనం చేసే వరకూ వెనకడుగు వేయవద్దని తేల్చి చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. ఆసక్తికరంగా ‘యుఫోరియా’ గ్లింప్స్
సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న 'యుఫోరియా' మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తే.. ప్రస్తుతం సమాజంలో బర్నింగ్ ఇష్యూగా ఉన్న డ్రగ్స్, అమ్మాయిలపై అత్యాచారాలు వంటి అంశాల చుట్టు గుణశేఖర్ ఈ కథను అల్లుకున్నట్లు కనిపిస్తుంది. విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక నటిస్తున్న ఈ సినిమాలో భూమిక కీలక పాత్రలో నటించారు. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. టీ 20 ప్రపంచకప్‌లో కీలక పోరు
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన తర్వాత భారత్ లంకతో జరిగే మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. అయితే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో టాపార్డర్ విఫలం కావడం కూడా భారత్‌ను ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంకను తేలిగ్గా తీసుకునే అవకాశమే లేదని ఆటగాళ్ళు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన తర్వాత భారత్ లంకతో జరిగే మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. అయితే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో టాపార్డర్ విఫలం కావడం కూడా భారత్‌ను ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంకను తేలిగ్గా తీసుకునే అవకాశమే లేదని ఆటగాళ్ళు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
నిజామాబాద్
ఎంటర్టైన్మెంట్
ఫుడ్ కార్నర్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion