అన్వేషించండి

Andhra Pradesh : ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు - ఐపీఎస్ సునీల్‌కుమార్‌పై చర్యలకు సిద్ధమైన ఏపీ సర్కార్

IPS : ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేయడంతో క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయింది.

Andhra Pradesh IPS officer Sunil Kumar is in trouble : వైఎస్ఆర్‌సీపీ హయాంలో కీలకంగా పని చేసి ప్రస్తతం పోస్టింగ్ లేకండా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గత జూలైలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇవి ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్దమని ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. వీటిపై పదిహేను రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులుజారీ చేసింది. పీవీ సునీల్ కుమార్ నుంచి స్పందన వచ్ిచన తర్వాత ఆయనపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పీవీ సునీల్ కుమార్ ఎక్కువ కాలం సీఐడీ డీజీగా పని చేశారు.ఆ సమయంలోనే రఘురామకృష్ణరాజును రాజద్రోహం కింద సుమోటోగా కేసులు పెట్టి అరెస్టు చేశారు. రఘురామ కృష్ణరాజు పుట్టిన రోజునే అరెస్టు చేశారు. అదే రోజున ఆయనను గుంటూరు సీఐడీ ఆఫీసుకు తరలించి ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్‌న ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై రఘురామకృష్ణరాజు పోరాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఆయన ఏపీలో అడుగు పెట్టలేకపోయారు. ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత ఆయన తనపై జరిగి నదాడి విషయంలో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 30 జిల్లాలంటూ ప్రచారం - ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత ఇదే

ఐపీఎస్ సునీల్‌ కుమార్ కూడా కీలకంగా వ్యవహరించారని తేలడంతో పాటు ఆయన దాడి చేశారన్నదానికి సాక్ష్యాలు కూడా సేకరించారన్న ప్రచారం జరుగుతోంది. కేసు నమోదు చేసినప్పుడు పీవీ సునీల్ సోషల్ మీడియాలో స్పందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఇవి కూడా వైరల్ అయ్యాయి. పీవీ సునీల్ కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయితే ప్రభుత్వం ప్రాసెస్ ప్రకారం ఆయనపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికి అభియోగాల నమోదు ప్రక్రియను పూర్తి చేసి పీవీ సునీల్‌కు నోటీసులు జారీ చేశారు. 

అనుభవమైతేనే తత్వం బోధపడుతుంది - డెలివరీ ఏజెంట్‌గా మారి కష్టాలు తెలుసుకున్న జొమాటో సీఈవో !

పీవీ సునీల్‌కు ప్రభుత్వం పదిహేను రోజుల సమయం ఇచ్చింది. ఆ సమయంలోపు ఆయన ఇచ్చే వివరణను బట్టి చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే పీవీ సునీల్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో హిందూ మతానికి వ్యతిరేకంగా.. రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని కేంద్రం దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే పలు అంశాల్లో వివాదాస్పదమైన ఆయన తీరుపై టీడీపీ నేతలు చాలా సార్లు ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపడిన పీవీ సునీల్‌పై పదిహేను రోజుల తర్వాత సస్పెన్షన్ వేటు వేసే అవకాశాలు ఉన్నాయని.. ఆయనకు మరోసారి పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు.                      

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Embed widget