Israel Hamas War: యుద్ధం ఆపవద్దు, శత్రువులు కోలుకోని విధంగా నాశనం చేద్దాం: సైన్యానికి ఇజ్రాయెల్ ఐడీఎఫ్ చీఫ్ లేఖ
Hamas Attack Anniversary | శత్రువులను దెబ్బ తీయడంతో పాటు వాళ్లు మళ్లీ కోలుకోలేని విధంగా నష్టపరచాలని ఇజ్రాయెల్ సైన్యానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ హెర్జి హలేవి లేఖ రాశారు.
Israel Defence Forces Chief Letter To Troops | పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై యుద్ధానికి తెరతీసింది. దాని పరిణామాలను హమాస్ ఇంకా ఎదుర్కోంటోంది. ఆ మరుసటి రోజే ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ను ఊచకోత కోసింది. తమకు వీలున్న అన్ని విధాలుగా ఇజ్రాయెల్ బలగాలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. మంగళవారం (అక్టోబర్ 8)తో పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ పై ఇజ్రాయోల్ దాడులకు ఏడాది పూర్తికానుంది.
యుద్ధాన్ని ఇంతటితో ఆపడం లేదు..
ఈ క్రమంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి మాట్లాడుతూ.. యుద్ధాన్ని ఇంతటితో ఆపడం లేదని స్పష్టం చేశారు. శత్రువుల శక్తి సామర్థ్యాలను వీలైనంత వరకు దెబ్బ తీద్దామంటూ సైన్యానికి లేఖ రాశారు. తమ దేశంపై హమాస్ దాడికి ఏడాది పూర్తయిన సందర్భంగా తమ వ్యూహాలు ఏంటి, ఇంకా ఏం చేయబోతున్నామనే వివరాలు వెల్లడించారు. ఓవైపు గాజాలోని హమాస్ టెర్రరిస్టులతో, మరోవైపు లెబనాన్‌లోని హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ బలగాలు దీటుగా పోరాడుతున్నాయి.
లెఫ్టినెంట్ జనరల్ హలేవి మాట్లాడుతూ.. ‘శక్తి సామర్థ్యాలతో పాటు సంకల్ప బలంతోనే సుదీర్ఘ యుద్ధం సాధ్యమైంది. మన గడ్డపై ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి, వారి హక్కుల కోసం యుద్ధం చేస్తున్నాం. గాజా ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దక్షిణ ఇజ్రాయెల్ లోకి ప్రవేశించి దాడులు చేస్తోంది. మా సైన్యం 1,200 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. 253 మందిని బందీలను పట్టుకుందని’ చెప్పారు.
దేశ చరిత్రలో అది చీకటి రోజు
అక్టోబర్ 7 సాధారణ తేదీ కాదు. మరిచిపోలేని రోజు అని.. దానిపై మనం ఆత్మపరిశీలన చేసుకుని ఎదురుదాడులు చేశామన్నారు ఇజ్రాయెల్ లెఫ్టినెంట్ జనరల్ హలేవి. మన వైఫల్యాల నుంచి నేర్చుకుంటూ దీటుగా శత్రువులను దెబ్బకొట్టాలని సైన్యానికి సూచించారు. ‘ఓ సంవత్సరం గడిచిపోయింది. ఇందులో భాగంగా మనం హమాస్ సైన్యాన్ని ఓడించాము. ఆ సంస్థ తీవ్రవాద సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో అణిచివేసేందుకు శక్తి వంచన లేకుండా పోరాడదాం. మరోవైపు హిజ్బుల్లాపై దాడులు చేసి వారి నాయకుడ్ని మట్టుపెట్టి, లీడర్ లేకుండా చేశాం. అయినా దాడులు ఆపకూడదు. మనం పోరాడుదాం. తప్పుల నుంచి నేర్చుకుంటి మరింత దీటుగా బదులిద్దాం. పదునైన వ్యూహాలతో ఇజ్రాయెల్ అన్ని సరిహద్దులలో సైన్యం గొప్పగా సేవలు అందించాలి. మన శత్రువుల సామర్థ్యాలను కోలుకోలేని విధంగా నాశనం చేద్దాం. దాంతో మరోసారి గత ఏడాది అక్టోబర్ 7న జరిగిన ఘటన పునరావృతం కాదు’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి తమ సైన్యానికి ముఖ్యమైన సందేశం పంపారు.
ఏడాది పూర్తయినా మనం ఇంకా బాధలో ఉన్నామని, ఆ భయంకరమైన ఘటనను తలుచుకుని పోరాటం కొనసాగిద్దామని బలగాలకు ఐడీఎఫ్ చీఫ్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ దాడులతో నాశనమైన గాజా సరిహద్దు ప్రాంతాల్లో మూడు రోజులపాటు పర్యటించాడు. మరింత శక్తి కూడగట్టుకుని దాడులు ముమ్మరం చేసి, మరోసారి ఇజ్రాయెల్ జోలికి రావాలంటే వణికిపోవాలన్నాడు.