Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Andhra News: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. తాను ఎవరి మీద ఎలాంటి ఫిర్యాదు చేయలేదని బాలిక తండ్రి మీడియాకు తెలిపారు.
Big Twist On Pocso Case On Chevireddy Bhaskar Reddy: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై (Chevireddy Bhaskarreddy) నమోదైన పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను ఎవరి మీద ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదని బాలిక తండ్రి తెలిపారు. ఆదివారం ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. 'మా కుమార్తెపై దాడి జరిగిందని మేమే స్వయంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పిలిచాం. ఆపదలో ఉంటే చెవిరెడ్డి గారే మమ్మల్ని ఆదుకున్నారు. ఆయనపై కేసు పెట్టాలని నేను పోలీసులకు చెప్పలేదు. నా బిడ్డకు సాయం చేయడానికి వచ్చిన వారిపై నేను కేసు ఎలా పెడతాను.?. బాలికపై దాడి చేసిన వారిని శిక్ష పడాలని కోరాను. నేను చదువుకోలేదు. పోలీసులు చెప్పిన చోట సంతకం మాత్రమే చేశాను. మా బిడ్డకు అన్యాయం జరిగిందని సహాయం చేయడానికి వచ్చిన వారిపై నేను కేసు ఎలా పెడతాను.?.' అని బాలిక తండ్రి ప్రశ్నించారు.
ఇదీ జరిగింది
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన బాలిక (14) అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడం సహా సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేశారన్న ఆరోపణలతో పోలీసులు చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేశారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండానే అసత్య ప్రచారం చేశారని చర్యలు చేపట్టారు. బాలిక పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా ముసుగు వేసుకున్న దుండగులు తనపై దాడి చేసి మత్తు మందు తాగించారని నమ్మించింది. ఘటనా పూర్వపరాలు తెలుసుకోకుండానే.. బాలిక చదివే పాఠశాలకు వెళ్లిన చెవిరెడ్డి.. ఆమెపై అత్యాచారం జరిగిందని, ఆమెకు అండగా ఉంటామని వ్యాఖ్యానించినట్లు పోలీసులు గుర్తించారు. బాలికకు వైద్య పరీక్షలు చేసి అత్యాచారం జరగలేదని పోలీసులు తెలిపినా.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినట్లు తేల్చారు. ఈ మేరకు అసత్య ప్రచారం చేసి తమను మనో వేదనకు గురి చేశారని బాలిక తండ్రి ఫిర్యాదు చేశారని.. చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరికొందరిపైనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే బాలిక తండ్రి పోలీసులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనతో పోలీసులే సంతకం పెట్టించుకున్నారంటూ మీడియాకు తెలిపారు.
Also Read: Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతితో తీవ్ర విషాదం