అన్వేషించండి

TG EAPCET: టీజీ ఎప్‌సెట్ - 2024 బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలు ఇవే

EAPCET Counselling: తెలంగాణలో ఎంసెట్‌ బైపీసీ స్ట్రీమ్ విభాగానికి సంబంధించిన మొదటి కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 19న ప్రారంభమై.. నవంబరు 12తో ముగియనుంది. ఆ తర్వాత స్పాట్ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు.

TGEAPCET Bi.P.C. Stream Counselling Schedule: తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫార్మసీ, బయెటెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబరు 19 నుంచి 22 వరకు బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి అక్టోబరు 21 నుంచి 23 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులకు అక్టోబరు 21 నుంచి 25 వరకు వెబ్‌‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. వీరికి అక్టోబరు 28న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 28 నుంచి 30లోపు సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని, నిర్ణీత ట్యూష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా అగ్రికల్చర్‌ విభాగంలో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు బీఫార్మసీ, ఫార్మ్-డీ, బ‌యో టెక్నాల‌జీ, బ‌యో మెడిక‌ల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటిక‌ల్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మసీ కోర్సుల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు 91,633 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, ఇందులో అమ్మాయిలో 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, ఇందులో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

నవంబరు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్..
ఇక సీట్ల భర్తీకి సంబంధించి మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు దక్కనివారు, కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులు న‌వంబ‌ర్ 4న ప్రాసెసింగ్ ఫీజు, స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి నవంబరు 5న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌ పూర్తయినవారు నవంబరు 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి న‌వంబ‌ర్ 9న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు న‌వంబ‌ర్ 9 నుంచి 11 లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని, ట్యూష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబరు 11, 12 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోయిన సీట్ల భర్తీకి న‌వంబ‌ర్ 12న 'స్పాట్ అడ్మిషన్'కి సంబంధించిన మార్గదర్శకాలు విడుద‌ల కానున్నాయి.  

ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

తొలివిడత కౌన్సెలింగ్ షెడ్యూలు..

➥ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌: అక్టోబరు 19 నుంచి 22 వరకు.

➥ ధ్రువపత్రాల పరిశీలన: అక్టోబరు 21 నుంచి 23 వరకు.

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: అక్టోబరు 21 నుంచి 25 వరకు.

➥ తొలి విడత సీట్ల కేటాయింపు: అక్టోబరు 28న.

➥ సెల్ఫ్ రిపోర్టింగ్: అక్టోబరు 28 నుంచి 30 వరకు

తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..

రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌: న‌వంబ‌ర్ 4న.

➥ ధ్రువపత్రాల పరిశీలన: నవంబరు 5న.

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: నవంబరు 5, 6 తేదీల్లో.

➥ తొలి విడత సీట్ల కేటాయింపు: న‌వంబ‌ర్ 9న

➥ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: న‌వంబ‌ర్ 9 నుంచి 11 వరకు

➥ కాలేజీల్లో రిపోర్టింగ్: నవంబరు 11, 12 తేదీల్లో.

➥ స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు: న‌వంబ‌ర్ 12న.

కౌన్సెలింగ్ వెబ్‌సైట్  

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget