అన్వేషించండి

Top Headlines Today: తిరుమలలో చిక్కిన మరో చిరుత- ఇంకా ఎన్ని ఉన్నాయ్‌?- ఏపీలో విద్యుత్ కోతలపై ఎర్రబెల్లి సెటైర్లు!

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today

తిరుమలలో చిక్కిన ఐదో చిరుత 

తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న టీటీడీ అటవీశాఖ అధికారులు ఇప్పుడు ఐదో చిరుతను బంధించారు. నరసింహస్వామి ఏడో మైలు రాయి వద్ద నాలుగు రోజుల క్రితం ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలను గుర్తించిన అధికారులు అక్కడ ఎరను పెట్టి బోనును ఏర్పాటు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున అందులో చిరుత పడినట్లు గుర్తించారు. దీన్ని కూడా  మగ చిరుతగానే గుర్తించిన అధికారులు జూకు తరలించి శాంపుల్స్ తీసి తిరుపతి ఐసర్ కు పంపించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఏపీపై సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలపై తెలంగాణ మంత్రి సెటైర్లు వేశారు. ఏపీలో పరిస్థితులు, ఉద్యోగాలు, ఇతర అభివృద్ధి అంశాలపై సమయం చిక్కినప్పుడల్లా తెలంగాణ మంత్రులు సెటైర్లు పేలుస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విద్యుత్ కోతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

తిరుమలలో ఇంకా చిరుతలు సంచరిస్తున్నాయా?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిరుత పులులను బంధించారు. ఇదే ఆఖరుది ఇకపై భయం లేదు... అని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. కానీ వారం పది రోజుల వ్యవధిలోనే చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఇంతకీ ఇప్పటికైనా ఈ బెడద వదిలిందా లేకుంటే ఇంకా ఉందా అనే సందేహం భక్తుల్లో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

జిల్లా అధికారులతో తుది నిర్ణయం

గత రెండుమూడు రోజులుగా తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. భారీవర్షాలు కురిసినప్పుడు విద్యార్థులు పాఠశాలకు రాలేని పరిస్థితి ఉంటే, ఆ జిల్లాధికారులు సెలవులు ప్రకటించవచ్చని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. వాతావరణశాఖ హెచ్చరికలతో రాష్ట్రం మొత్తం సెలవులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో కురవవని వివరించింది. వర్షాలతో ఎక్కువరోజులు సెలవులు ఇచ్చినప్పుడు సిలబస్ పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పునఃప్రవేశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లగడపాటి రాజగోపాల్ ది ప్రత్యేకమైన స్థానం. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రెండు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. గత కొద్ది కాలం నుంచి మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన ఖండించారు. మళ్లీ ఆయన అనుచరులు విజయవాడలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. లగడపాటిని రాజకీయాల్లోకి ఆహ్వానించాలని అనుకుంటున్నారు.అయితే ఆయనకు తెలియకుండా అనుచరులు సమావేశం అవుతారా అన్న చర్చ నడుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి

తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఇప్పుడు మరింత ఎక్కువగా అసంతృప్తి పెరిగిపోతోందన్న సూచనలు కనిపిస్తున్నాయి.  నాయకత్వ మార్పు తర్వాత చంద్రశేఖర్, యెన్నం శ్రీనివాసరెడ్డి వంటి వారు పార్టీ మారిపోయారు. ఇటీవల జరుగుతున్న మార్పులతో మరికొంత మంది సీనియర్ నేతలు కూడా మండిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉందని.. ఎప్పుడైనా బద్దలు కావొచ్చునన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

గుడ్ న్యూస్

హైదరాబాద్ ప్రజలకు మరో గుడ్ న్యూస్. మెట్రో సేవలను ఎయిర్ పోర్ట్ వరకు పొడిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మెట్రో పనులను కార్యరూపం దాల్చనున్నాయి. విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో పనులను క్షేత్రస్థాయిలో మొదలెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారంలో పనులు మొదలయ్యే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

శెట్టి హిట్ కొట్టినట్టేనా!

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'కి (Miss Shetty Mr Polishetty Review) ఓవర్సీస్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సినిమాలో కామెడీ బావుందని ఎన్నారైలు చాలా గొప్పగా చెబుతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు మెగా బూస్ట్ లభించింది. మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేకంగా సినిమాను ప్రదర్శించారు. తనకు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' నచ్చిందని, థియేటర్లలో మళ్ళీ చూడాలని ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి, సినిమా చూసిన ప్రేక్షకుల స్పందన ఏమిటి? వాళ్ళు ఏమంటున్నారు? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పాకిస్థాన్‌కు మంచి బూస్ట్

ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు విజయం లభించింది. ఆదివారం భారత్‌తో జరగనున్న సూపర్-4 మ్యాచ్‌కు పాకిస్తాన్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం పాకిస్తాన్ 39.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నాలుగు లక్షల  టికెట్లు

క్రికెట్ అభిమానులకు శుభవార్త. రాబోయే ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లకు సంబంధించి తదుపరి దశలో మరో నాలుగు లక్షల టిక్కెట్లను విక్రయించనుంది. క్రికెట్ అభిమానులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. బీసీసీఐ దీనికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. వరల్డ్‌కప్ టిక్కెట్లకు చాలా డిమాండ్ ఉందని ఇందులో పేర్కొన్నారు. దీని కోసం సుమారు నాలుగు లక్షల టిక్కెట్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy :  విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
Another shock for YSRCP:  రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా  ?
రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా ?
Harish Rao: చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే  అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vijaya Sai Reddy Quit Politics | రాజకీయాలు వదిలేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటన | ABP DesamRachakonda CP on Meerpet Case | మీర్ పేట కేసు తేల్చాలంటే నిపుణులు కావాలి | ABP DesamMS Dhoni Rare Seen With Mobile | ప్రాక్టీస్ సెషన్ లో మొబైల్ తో ధోనీ | ABP DesamNetaji Subhash Chandra Bose Fiat Car | రాంచీలో పెట్టిన ఈ ఫియట్ కారు చరిత్ర తెలుసా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy :  విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
Another shock for YSRCP:  రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా  ?
రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా ?
Harish Rao: చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే  అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
Mamata Kulakarni : దేశాన్ని ఊపేసిన మోహన్ బాబు హీరోయిన్.. కుంభమేళా లో సన్యాసినిగా....
దేశాన్ని ఊపేసిన మోహన్ బాబు హీరోయిన్.. కుంభమేళా లో సన్యాసినిగా....
Tirumala News: తిరుమలలో రథసప్తమికి ఘనంగా ఏర్పాట్లు - ఫిబ్రవరి 3 తర్వాత వెళ్లే భక్తులకు కీలక సూచనలు
తిరుమలలో రథసప్తమికి ఘనంగా ఏర్పాట్లు - ఫిబ్రవరి 3 తర్వాత వెళ్లే భక్తులకు కీలక సూచనలు
Viral News: కబడ్డీ ఆటలో కొట్టుకున్న మహిళా ప్లేయర్లు.. ప్రేక్షకులు కూడా తలో చేయి వేసి.. 
కబడ్డీ ఆటలో కొట్టుకున్న మహిళా ప్లేయర్లు.. ప్రేక్షకులు కూడా తలో చేయి వేసి.. 
Karimnagar BRS Mayor: కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ - బీజేపీలోకి మేయర్, పది మంది కార్పొరేటర్లు - చక్రం తిప్పిన బండి సంజయ్
కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ - బీజేపీలోకి మేయర్, పది మంది కార్పొరేటర్లు - చక్రం తిప్పిన బండి సంజయ్
Embed widget