Rains in Telangana: తెలంగాణలో భారీ వర్షాలు, సెలవులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు
భారీవర్షాలు కురిసినప్పుడు విద్యార్థులు పాఠశాలకు రాలేని పరిస్థితి ఉంటే, ఆ జిల్లాధికారులు సెలవులు ప్రకటించవచ్చని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.
గత రెండుమూడు రోజులుగా తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. భారీవర్షాలు కురిసినప్పుడు విద్యార్థులు పాఠశాలకు రాలేని పరిస్థితి ఉంటే, ఆ జిల్లాధికారులు సెలవులు ప్రకటించవచ్చని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. వాతావరణశాఖ హెచ్చరికలతో రాష్ట్రం మొత్తం సెలవులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో కురవవని వివరించింది. వర్షాలతో ఎక్కువరోజులు సెలవులు ఇచ్చినప్పుడు సిలబస్ పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
నేడు ఈ ఏరియాల్లో భారీ వర్షాలు - ఐఎండీ అలర్ట్..
సెప్టెంబర్ 7న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 08 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 90 శాతంగా నమోదైంది.
ALSO READ:
కర్ణాటక స్టూడెంట్స్‌కు సూపర్ న్యూస్, ఏకంగా మూడు సార్లు పబ్లిక్ పరీక్షలు
కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్‌మెంట్ బోర్డ్ (KSEAB) పదో తరగతి, 12 తరగతి పరీక్షా విధానంలో భారీ సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి సంవత్సరానికి మూడు సార్లు వార్షిక పరీక్షను ప్రవేశపెట్టనుంది. మంగళవారం బెంగళూరులో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప ఈ విషయాన్ని ప్రకటించారు. గతంలో ఉన్న సప్లిమెంటరీ పరీక్షల స్థానంలో వార్షిక పరీక్ష 1, 2, 3 ప్రవేశపెట్టనుంది అక్కడి ప్రభుత్వం. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడం, వారిలో సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహించేలా మూడు అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ ఇటీవల రెండు సార్లు బోర్డు పరీక్షలను ప్రతిపాదించింది. అయితే కర్ణాటక ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఏడాదికి మూడు వార్షిక పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టింది. 2024 మార్చి/ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలు లోకి రానుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
అక్టోబర్ 5 నుంచి 'ఎస్‌ఏ-1' పరీక్షలు - 8 నుంచి 10వ తరగతులకు ఏడు పేపర్లతో పరీక్షల నిర్వహణ
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ (సమ్మేటివ్ అసెస్‌మెంట్)-1 పరీక్షలు అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రాధా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం (ఆగస్టు 2) ఉత్తర్వులు జారీ చేశారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..