Viral News: కబడ్డీ ఆటలో కొట్టుకున్న మహిళా ప్లేయర్లు.. ప్రేక్షకులు కూడా తలో చేయి వేసి..
Viral News: రిఫరీ కాస్త దురుసుగా ప్రవర్తించి, తమిళనాడు ఆటగాళ్లపై దాడికి దిగారు. దీంతో ఇరుజట్ల మధ్య కొట్లాట స్టార్ట్ అయింది. ప్రేక్షకులు ప్లేయర్లకు సపోర్టుగా నిలిచి ఫైటింగ్ లో పాలు పంచుకున్నారు.

Viral News: మైదానంలో కబడ్డీ.. కబడ్డీ అని ఆడుకోవాల్సిన మహిళా ప్లేయర్లు.. ముష్టి యుద్ధాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. ఈ ఘటన పంజాబ్ లో జరిగింది. నార్త్ జోన్ ఇంటర్ వర్సిటీ, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ మహిళా చాంపియన్షిప్ 2024-25 పోటీల సందర్బంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడు ప్లేయర్లతోపాటు కొంతమంది నార్త్ ప్లేయర్లకు దెబ్బలు తగిలినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అందులో ప్లేయర్లు, ప్రేక్షకులు కొట్టుకుంటూ రణరంగాన్ని తలపిస్తున్నారు. అభిమానులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తూ, షేర్ చేస్తున్నారు.
Is this how punjabis treat women in pinjab?
— கருணாகரன் கவுண்டர் (@karuna_ms) January 24, 2025
My Tamil kabaddi female players were beaten up by Punjabi men in Punjab.
Do you believe it’s Punjabi pride ?
Common guys . it’s really shame for the whole state of Punjabi’s, moreover the whole union of states must be shame for… pic.twitter.com/zknH6wsndm
అసలేమైందంటే..
తమిళనాడుకు చెందిన మదర్ థెరిసా యూనివర్సిటీ, ధర్బంగా యూనివర్సిటీ జట్లకు మధ్య జరిగిన పోటీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ మధ్యలో ఫౌల్ అటాక్ చేసినట్లు తమిళనాడు ప్లేయర్లు ఆరోపిస్తూ రిఫరీని సంప్రదించారు. అయితే రిఫరీ కాస్త దురుసుగా ప్రవర్తించి, తమిళనాడు ఆటగాళ్లపై దాడికి దిగినట్లు సమాచారం. దీంతో ఇరుజట్ల మధ్య కొట్లాట స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. మ్యాచ్ కు వచ్చిన ప్రేక్షకులు ధర్బంగా యూనివర్సిటీ ప్లేయర్లకు సపోర్టుగా నిలిచి ఫైటింగ్ లో పాలు పంచుకున్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఈ పోటీలకు తమిళనాడులోని మదర్ థెరిసా యూనివర్సిటీ, పెరియార్ యూనివర్సిటీ, అలగప్పా యూనవర్సిటీ, భారతీయార్ వర్సిటీల ప్లేయర్లు పాల్గొన్నారు.
ధ్రువీకరించిన తమిళ మంత్రి ఉదయనిధి స్టాలిన్..
తమ ప్లేయర్లపై దాడి జరగడం దురదృష్టకరమని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటూ బాగుండేనని చురకలు అంటించారు. అయితే ఈ ఘటనలో ఆటగాళ్లకు గీరుకు పోవడం, చిన్న చిన్న దెబ్బలు తప్ప తీవ్ర గాయాలు కాలేదని పేర్కొన్నారు. పోటీలలో పాల్గొన్న 36 మంది తమిళ విద్యార్థులు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఘటన గురించి తెలియగానే కోచ్ తో మాట్లాడామని, ఆటగాళ్లకు అదనపు భద్రతా కల్పించాలని భటిండా కలెక్టర్ ను కోరినట్లు పేర్కొన్నారు. జట్టుతోపాటు కోచ్ లు, పీడీలను పంపినా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు భటిండా నుంచి డిల్లీకి ప్రయాణమైనట్లు తెలిపారు. వారికి ఢిల్లీ హౌస్ లో బస ఏర్పాటు చేసి, రాష్ట్రానికి తీసుకొస్తామని తెలిపారు. మరోవైపు ఈ దాడులను ఏఐడీఎంకే లీడర్ డీ జయకూమార్ ఖండించారు.





















