అన్వేషించండి

Top Headlines Today: చంద్రబాబు తప్పు చేయరంటున్న రవిబాబు- తెలంగాణలో బేరాల్లేవమ్మా అంటున్న కాంగ్రెస్- నేటి టాప్ న్యూస్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today

 

జగన్‌పై రవిబాబు ఫైర్

చంద్రబాబు నాయుడు అరెస్టుపై రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్  వేదికగా ఆయనను విడిచి పెట్టాలని కోరుతున్నారు. అయితే తాజాగా క్రియేటివ్ దర్శకుడు, నటుడు రవిబాబు చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. రామారావు, చంద్రబాబుల కుటుంబాలు తమకు ఆప్తులని రవిబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబును ఎంతో కాలంగా చూస్తున్నానని.. ఆయన డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని అన్నారు. అలాగే బాబు ఏదైనా పని చేసే ముందు వంద యాంగిల్స్ లో ఆలోచించి అందరినీ సంప్రదించిన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఎవరికీ ఇబ్బంది కల్గకుండా చూడడమే ఆయన అంతిమ లక్ష్యం అంటూ వెల్లడించారు. ఆయనకు భూమి మీద ఇదే చివరి రోజు అని తెలిస్తే.. వచ్చే యాభై ఏళ్లలో తీసుకోవాల్సిన సోషల్ డెవలప్ మెంట్ గురించి ప్లాన్ చేస్తారని వివరించారు. 73 ఏళ్ల వయసున్న అలాంటి నాయకుడని ఎలాంటి ఆధారాలు లేకుండా జైల్లో పెట్టి హింసించడం దారుణం అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

బేరాల్లేవమ్మా అంటున్న కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎక్కడా రాజీ పడటం లేదు. టిక్కెట్ల కోసం ఒత్తిడి తెచ్చే వాళ్లను దూరం పెడుతోంది. గెలుపు గుర్రాలనుకుంటే ఏ పార్టీలో ఉన్నా వదిలి పెట్టడం లేదు. ప్రతీ సారి టిక్కెట్ల విషయంలో రచ్చ చేసే సీనియర్లకు ఈ సారి గట్టి షాకే ఇచ్చింది. దాంతో ఎవరూ నోరు మెదపడం లేదు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఐ ప్యాక్‌, జగన్ మధ్య గ్యాప్!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ అధికార పార్టీ . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ స్ట్రాటజీలతో  వైఎస్ఆర్‌సీపీ బలపడింది. విమర్శలు ఎదుర్కొన్నా.. రాజకీయాల్లో అంతిమ లక్ష్యం గెలుపు. అందు కోసం ప్రశాంత్ కిషోర్ చేయాల్సినదంతా చేశారు. భారీ విజయాన్ని వైఎస్ఆర్‌సీపీకి లభించేలా చేశారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్‌సీపీకి ఐ ప్యాక్ సంస్థనే పని చేస్తోంది. కానీ ఆ పార్టీలో నమ్మకం లేకుండా పోయింది. ఐ ప్యాక్ స్ట్రాటజీలు ఎన్ని అమలు చేస్తున్నా అనుకున్న రెస్పాన్స్ రావడం లేదు. దీంతో ప్రశాంత్ కిషోర్ లేని లోటు కనిపిస్తోందని వైఎస్ఆర్‌సీపీలోని ముఖ్య నేతలు ఫీలవుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో ఇది మరింత ఎక్కువగా వినిపిస్తోంది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వర్షాలు పడే అవకాశం 

ఈ రోజు అల్పపీడనం ఈశాన్య, పరిసర ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిమీ ఎత్తు వరకు వ్యాపించింది. ఈరోజు తూర్పు- పశ్చిమ షియర్ జోన్ (గాలి విచ్ఛిన్నతి) సుమారుగా 15°N అక్షాంశం వెంబడి  సగటు సముద్ర మట్టం నుండి 3.1 & 4.5 కి మి మధ్యన స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

సర్కారు వారి పాట 

 ఆంధ్రప్రదేశ్ సర్కార్ లిక్కర్ పాలసీని ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మద్యం విధానాన్ని ప్రకటించింది. 2019లో జారీ చేసిన ఎక్సైజ్‌ విధానాన్నే, ఈ ఏడాదికి కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్‌ లో పేర్కొంది. శనివారంతో ఎక్సైజ్‌ విధానం గడువు ముగియనుండటంతో మరోమారు పాత విధానాన్ని పొడిగిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.  గతంలో పేర్కొన్నట్టుగానే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గంలో ఎలాంటి దుకాణానికి లైసెన్సు మంజూరు చేయబోమని స్పష్టం చేసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని అబ్కారీ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఎన్నికల సన్నాహాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబరు మొదటి వారంలో షెడ్యూల్ ను ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలించారు. అక్టోబరులో నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబరు పోలింగ్ జరపాలని యోచిస్తోంది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి (Q3FY24) చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు పెంచింది. అదే సమయంలో... పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), కిసాన్ వికాస్ పత్ర (KVP), సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్ స్కీమ్‌ (SCSS), నేషనల్‌ సేవింగ్స్ సర్టిఫికెట్‌ (NSC), పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు చేయకుండా, పాత రేట్లనే కొనసాగించింది. ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి, డిసెంబర్ 31‌ వరకు వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

జాహ్నవి కందుల కేసులో ప్రభుత్వం చర్యలు

తెలుగు యువతి జాహ్నవి కందుల కేసులో తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా పోలీసులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. జాహ్నవిని ఉద్దేశించి హేళనగా మాట్లాడిన పోలీస్ డేనియల్ అడెరర్ ను సియాటెల్​నగర పోలీసు ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న డేనియెల్ ఆడెరర్​ను ఆ విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు సియాటిల్ పోలీసు శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి నాన్-ఆపరేషనల్ పొజిషన్​ లో ఉంచినట్లు వెల్లడించింది. డేనియల్ ఆడెరర్ సియాటెల్​ పోలీసు ఆఫీసర్స్ గిల్డ్​ ఉపాధ్యక్షుడి పని చేస్తున్నాడు. ఇటీవల అతడి బాడీకామ్​లో రికార్డైన దృశ్యాలను సియాటిల్ పోలీసు శాఖ విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఇంగ్లండ్‌తో ఇండియా వామప్ మ్యాచ్

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో టీమ్‌ఇండియా మొదటి సన్నాహక మ్యాచ్‌ ఆడుతోంది. శనివారం గువాహటి వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు పోటీ మొదలవుతుంది. హిట్‌మ్యాన్‌ సేన ఆసీస్‌పై, జోస్‌ బట్లర్‌ టీమ్‌ న్యూజిలాండ్‌పై 2-1 తేడాతో వన్డే సిరీసులు గెలిచి ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచులో రెండు జట్లు రిజర్వు బెంచీ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

బేబీ దర్శకుడికి నిర్మాత సర్‌"ప్రైజ్‌"

ఒకప్పుడు తాము తెరకెక్కించిన సినిమాలు సూపర్ హిట్‌ను సాధిస్తే.. డైరెక్టర్స్‌ను ప్రత్యేకంగా ప్రశంసించేవారు నిర్మాతలు. కానీ ఈరోజుల్లో ట్రెండ్ మారిపోయింది. ఒక డైరెక్టర్.. ఒక నిర్మాతగా బ్లాక్‌బస్టర్ సినిమాను అందించి.. దానివల్ల నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడితే.. ఆ డైరెక్టర్‌కు గిఫ్ట్‌లు ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. అది కూడా మామూలు గిఫ్ట్‌లు కాదు, చాలా కాస్ట్‌లీ గిఫ్ట్‌లు. ఇలా నిర్మాతలు.. డైరెక్టర్లకు కార్లు, వాచ్‌లు, గోల్డ్ గిఫ్ట్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దానిని చూసి ఇతర నిర్మాతలు కూడా ఇదే ఫార్ములా ఫాలో అయిపోతున్నారు. తాజాగా ‘బేబి’ మూవీ నిర్మాత కూడా అదే పనిచేశారు. దర్శకుడికి ఒక బ్రాండ్ న్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget