By: ABP Desam | Updated at : 30 Sep 2023 07:58 AM (IST)
ఐదేళ్ల RDలపై మరింత ఎక్కువ వడ్డీ
Small Savings Interest Rate Hike: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి (Q3FY24) చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు పెంచింది. అదే సమయంలో... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), కిసాన్ వికాస్ పత్ర (KVP), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు చేయకుండా, పాత రేట్లనే కొనసాగించింది. ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి, డిసెంబర్ 31 వరకు వర్తిస్తాయి.
1. రికరింగ్ డిపాజిట్:
5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపై (RD) వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు (0.20 శాతం) పెరగడంతో, అది ప్రస్తుతమున్న 6.50 శాతం నుంచి 6.70 శాతానికి చేరింది. పేరులో సూచించినట్లుగా, ఈ పోస్టాఫీస్ స్కీమ్ 5 సంవత్సరాల కాల వ్యవధితో ఉంటుంది. నెలకు కనీసం రూ. 100తో ఈ ఖాతాను తెరవవచ్చు. గరిష్ట పరిమితి లేదు. వడ్డీ మొత్తాన్ని ఏటా కలుపుతారు.
2. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF):
PPF ఖాతాకు వడ్డీ రేటు మారకుండా 7.4% వద్ద కొనసాగుతుంది. PPF ఖాతాలో, ఒక సంవత్సరంలో కనిష్టంగా రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షలను, ఒకేసారి లేదా వాయిదాల్లో జమ చేయవచ్చు. ఈ డిపాజిట్లకు సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. PPF అకౌంట్‌పై లోన్/నిబంధనలకు లోబడి విత్‌డ్రా ఫెసిలిటీ కూడా ఉంటుంది. వడ్డీని ఏటా కలుపుతారు.
3. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS):
SCSS ఖాతాలపై కూడా కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను మార్చలేదు. సీనియర్ సిటిజన్లు, ఈ ఖాతాల నుంచి సంవత్సరానికి 8.2% సంపాదన కొనసాగిస్తారు. ఈ ఖాతాను కనిష్టంగా రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 30 లక్షలతో ప్రారంభించవచ్చు. ఈ పథకం 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా, ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని SCSS ఖాతాల్లో మొత్తం వడ్డీ రూ. 50,000/- దాటితే, దానిపై పన్ను చెల్లించాలి. మొత్తం వడ్డీ నుంచి నిర్ణీత రేటులో TDS కట్ అవుతుంది. ఫామ్ 15G/15H సమర్పిస్తే, నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ వడ్డీని పొందకపోతే TDS కట్ కాదు.
4. సుకన్య సమృద్ధి ఖాతా (SSA):
ఆడపిల్లల కోసం ఉద్దేశించిన ఈ చిన్న మొత్తాల పొదుపు పథకంపైనా FY24 Q3లో 8% రేటు కొనసాగుతుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ ఖాతాను తెరవవచ్చు. కవలలు/ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన సందర్భంలో రెండు కంటే ఎక్కువ ఖాతాలను తెరవవచ్చు. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిల కోసం అకౌంట్ ఓపెన్ చేయాలంటే గార్డియన్ ఉండాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఈ ఖాతాలో జమ చేయవచ్చు. ప్రారంభించిన తేదీ నుంచి గరిష్టంగా 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఈ ఖాతాకు వడ్డీని జమ చేస్తారు. ఇది సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును అందిస్తుంది. ఈ పథకంలో పొందే వడ్డీ ఆదాయం మీద కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
5. కిసాన్ వికాస్ పత్ర (KVP):
కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేట్లను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. ఇది, దీర్ఘకాలిక పొదుపు ప్రణాళిక. తక్కువ-రిస్క్, హామీతో కూడిన రాబడి వస్తుంది. ఈ పథకంపై అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికంలో 7.5% వడ్డీ రేటును సంపాదించవచ్చు. దీనిని ఇది ఏటా కలుపుతారు. KVPలో పెట్టుబడి పెట్టిన మొత్తం 115 నెలల్లో (9 సంవత్సరాల 7 నెలలు) రెట్టింపు అవుతుంది. ఈ ఖాతాను కనీసం రూ. 1,000తో ఓపెన్ చేయవచ్చు, దీనికి గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు.
ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు:
అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు, సేవింగ్ డిపాజిట్ స్కీమ్ మీద 4% వడ్డీ ఆఫర్ కొనసాగుతుంది. నెలవారీ ఆదాయ ఖాతా పథకం మీద 7.4%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) మీద 7.7% వడ్డీ రేటు కంటిన్యూ అవుతుంది.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ల విషయానికి వస్తే... 1 సంవత్సరం టైమ్ డిపాజిట్ 6.9%; 2 సంవత్సరాలు & 3 సంవత్సరాల టైమ్ డిపాజిట్లు తలో 7% వడ్డీని అందిస్తాయి. 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ స్కీమ్ మీద FY24 Q3లో 7.5% వడ్డీ ఆదాయం వస్తుంది.
Income Tax: ఆ వివరాలు వెల్లడించకపోతే రూ.10 లక్షలు ఫైన్ - ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వార్నింగ్
High Interest: ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ధనలక్ష్మికి నకళ్లు - అధిక రాబడికి గ్యారెంటీ
EMI Fact: ఈఎంఐ చెల్లింపుల్లో అందరిలాగే మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? - తప్పదు భారీ నష్టం!
Gold-Silver Prices Today 18 Nov: మళ్లీ పరుగు మొదలు పెట్టిన పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్‌కి ప్లాన్ ఇదే
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు