By: ABP Desam | Updated at : 30 Sep 2023 08:00 AM (IST)
గెలుపు గుర్రాలకే టిక్కెట్లు - సీనియర్లు అయినా బేరాల్లేవ్ !
Telangana Congress : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎక్కడా రాజీ పడటం లేదు. టిక్కెట్ల కోసం ఒత్తిడి తెచ్చే వాళ్లను దూరం పెడుతోంది. గెలుపు గుర్రాలనుకుంటే ఏ పార్టీలో ఉన్నా వదిలి పెట్టడం లేదు. ప్రతీ సారి టిక్కెట్ల విషయంలో రచ్చ చేసే సీనియర్లకు ఈ సారి గట్టి షాకే ఇచ్చింది. దాంతో ఎవరూ నోరు మెదపడం లేదు.
తెలంగాణ కాంగ్రెస్‌పై హైకమాండ్ ముద్ర
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ అధిష్టానమే డైరెక్టుగా రంగంలో దిగింది. ఈసారి ‘చేయి’ జారకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. అన్నిస్థాయిల్లోనూ ఫైరవీలను నియంత్రిస్తోంది. టిక్కెట్ల కోసం ఒత్తిడి తెచ్చే వారికి నేరగానే .. అధికారంలోకి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి మర్యాదగా పంపిస్తున్నట్టు నేతలు చెబుతున్నారు. టికెట్ల విషయంలో తాము రిస్క్ తీసుకుంటే, ఎన్నికల్లో పార్టీ కుప్పకూలుతుందని అధినేతలు వారిని హెచ్చరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌తో నేరుగా తలపడి గెలిచే అభ్యర్థులతోనే నాయకులే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల్లో రణరంగంలోకి దిగుతుందని మొహంమీదనే చెప్పేస్తున్నారు. టికెట్టు ఇచ్చిన తర్వాత కూడా అవసరమైతే బిఫామ్ మారే అవకాశం ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నారు. టార్గెట్ మిస్సవ్వకుండా కారును ఢీ కొట్టాలని చెబుతున్నారు.
గెలిపించుకుని వస్తామని గ్యారంటీ కోరుతున్న హైకమాండ్
ఏఐసీసీ టికెట్టు ఇచ్చిన తర్వాత అభ్యర్థికి సహకరించని వారెవరైనా ఉంటారని అనుకుంటే వారికి ముందుగానే హెచ్చరికలు పంపుతోంది. అధికార బీఆర్‌ఎస్ అంగ, ఆర్థిక బలాన్ని ధీటుగా ఎదుర్కొనే నాయకులే ఈ పరిస్థితుల్లో అవసరమని భావిస్తోంది. మొత్తంగా అన్ని ఒడపోతలు పూర్తి చేసి గెలుపు గుర్రాల వైపే మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేవి ఎన్ని సీట్లు? వాటి జాబితా ఇవ్వండి? మీరు చెప్పిన నాయకుడికి టికెట్ ఇస్తే గెలిపించేందుకు మీరే బాధ్యత తీసుకుంటారా? అందుకు మీరేం చేస్తారో ముందుగా కాగితంపై రాసి ఇవ్వాలని పార్టీ సీనియర్లకు మెలిక పెట్టినట్టు తెలుస్తోంది. టికెటు ఇప్పించుకోవడం, ఆ తర్వాత చేతులెత్తేయడం…ఫలితంగా పార్టీ ఓడిపోవడం ఆనవాయితీగా వస్తోందని ఈ సారి అలాంటి పరిస్థితి రానీయబోమని అంటున్నారు.
గెలుపు గుర్రాలకు రెండు , మూడు టిక్కెట్ల హామీలు
టీడీపీ, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలైనా సరే…గెలువడమే ముఖ్యం. అటువంటి వారికే టికెట్లు ఇస్తామని తేల్చి చెబతున్నారు. మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండాసురేఖ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితోపాటు మరికొంత మంది సీనియర్ నాయకులు సైతం రెండు టికెట్లు కావాలని అధిష్టానంపై ఒత్తిడి పెడుతున్నట్టు ఏఐసీసీ పెద్దలు చెబుతున్నారు. బీఫామ్ మీక్కావాలో, మీ కుటుంబ సభ్యులకు కావాలో తేల్చుకోవాలని హైకమాండ్ కోరుతున్నది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు మూడు టికెట్టు కేటాయిస్తున్నారని ఆ మూడు సీట్లలో ఎంత ఖర్చయినా బాధ్యత తనదేేనంటూ కచ్చితంగా గెలిపించుకొస్తానంటూ మైనంపల్లి అధిష్టానికి హామీ ఇచ్చారు. అలాంటి నేతలకు చాన్స్ ఇస్తోంది. సీనియర్లు మాత్రం గట్టిగా ఏదీ చెప్పలేకపోతున్నారు. దాంతో బేరాల్లేవని హైకమాండ్ తేల్చి చెబుతోంది.
Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!
Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?
Congress CM Candidate : కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి పంచాయతీ తప్పదా ? రేవంత్ రెడ్డిని సీనియర్లు అంగీకరిస్తారా ?
Revant Reddy : రేవంత్ రెడ్డితో అభ్యర్థుల భేటీ - పోలింగ్ సరళిపై విశ్లేషణ !
Telangana Cabinet Meet : సోమవారం తెలంగాణ కేబినెట్ భేటీ - ఫలితాలపై కేసీఆర్ గట్టి నమ్మకం !
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>