By: ABP Desam | Updated at : 30 Sep 2023 07:18 AM (IST)
ప్రశాంత్ కిషోర్ లేని లోటు తెలుస్తోందా ? వైఎస్ఆర్‌సీపీలో అంతర్మథనం !
YSRCP I PAC : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ అధికార పార్టీ . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ స్ట్రాటజీలతో వైఎస్ఆర్‌సీపీ బలపడింది. విమర్శలు ఎదుర్కొన్నా.. రాజకీయాల్లో అంతిమ లక్ష్యం గెలుపు. అందు కోసం ప్రశాంత్ కిషోర్ చేయాల్సినదంతా చేశారు. భారీ విజయాన్ని వైఎస్ఆర్‌సీపీకి లభించేలా చేశారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్‌సీపీకి ఐ ప్యాక్ సంస్థనే పని చేస్తోంది. కానీ ఆ పార్టీలో నమ్మకం లేకుండా పోయింది. ఐ ప్యాక్ స్ట్రాటజీలు ఎన్ని అమలు చేస్తున్నా అనుకున్న రెస్పాన్స్ రావడం లేదు. దీంతో ప్రశాంత్ కిషోర్ లేని లోటు కనిపిస్తోందని వైఎస్ఆర్‌సీపీలోని ముఖ్య నేతలు ఫీలవుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో ఇది మరింత ఎక్కువగా వినిపిస్తోంది.
గ్రౌండ్ రియాల్టీ సీఎం జగన్‌కు తెలియడం లేదా ?
ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆయన తన రాజకీయ భవిష్యత్ కోసం బీహార్‌లో సొంత పార్టీ పెట్టుకున్నారు. కొన్నాళ్లు పాదయాత్ర చేశారు. గాయం కావడంతో ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ ఆయన మళ్లీ పొలిటికల్ స్ట్రాటజీస్ బాధ్యతలు తీసుకోవాలని అనుకోవడం లేదు. చిన్న మాట సాయం కూడా చేయడం లేదని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన శిష్యులే ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీకి స్ట్రాటజిస్టుగా ఉన్నారు. రుషిరాజ్ అనే యూపీకి చెందిన వ్యక్తి స్ట్రాటజిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే గ్రౌండ్ రియాలిటీ గురించి నివేదికలు సీఎం జగన్ కు చేరవేస్తున్నారు. అయితే సీఎం జగన్ ను సంతృప్తి పరిచేందుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని.. వైఎస్ఆర్‌సీపీ నేతలు అనుమాన పడుతున్నారు. సీఎం జగన్ ఇటీవలి కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలే వారి అనుమానాలకు కారణం.
సక్సెస్ ఫుల్ స్ట్రాటజీలు లేవని ఆవేదన
వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీలన్నీ ఐ ప్యాక్ వే. చివరికి ఎక్కడ రోడ్లు వేయాలన్నది కూడా ఐ ప్యాక్ డిసైడ్ చేస్తుంది. నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పర్యటనలు చేస్తోంది. రాష్ట్ర స్థాయి ప్రచార కార్యక్రమాలనూ రూపొందిస్తోంది. ఆ సంస్థ రూపొందిన ఒక్క కార్యక్రమం పార్టీకి ప్లస్ కాలేదన్న భావనలో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఉన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో రెండేళ్ల కిందటే కార్యక్రమం ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని బయటకు తెలిసేలా చేశారన్న ఆగ్రహం పార్టీ నేతల్లో ఉంది. తర్వాత జగనన్న సురక్ష, జగనన్నకు చెబుతాం అంటూ పలు కార్యక్రమాలను హడావుడిగా ప్రారంభించారు. అవన్నీ ఎలా ప్రారంభమయ్యాయో అంతే వేగంగా సైలెంట్ అయిపోయారు. గతంలో కావాలి జగన్ - రావాలి జగన్ అనే క్యాంపెయిన్ ప్లాన్ చేశారు. క్లిక్ అయింది. అందుకే ఈ సారి వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రచారం ప్లాన్ చేశారు. కానీ ఇంగ్లిష్ లో ఎంత మందికి అర్థమవుతుందని.. తెలుగులో చెప్పుకోవడానికి ఎబ్బెట్టుగా ఉందని వైసీపీ నేతలే అంటున్నారు. ఇది క్లిక్ అవుతందని వైసీపీ నేతలు కూడా అనుకోవడం లేదు.
సీఎం జగన్ కూడా అసంతృప్తికి గురవుతున్నారా?
మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఐ ప్యాక్ వైసీపీకి భారీ విజయాలు వస్తాయని నివేదికలు ఇచ్చింది. కానీ ఫలితాలు తేడా వచ్చాయి. ఆ సమయంలోనే సీఎం జగన్ ఈగోను శాటిస్ ఫైచేయడానికి గ్రౌండ్ రియాలిటీని ఐ ప్యాక్ చెప్పడం లేదని సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడును ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడం వల్ల వచ్చే పరిస్థితులను కూడా విశ్లేషించడంలో విఫలమయ్యారన్న అభిప్రాయంలో ఉన్నారు. చంద్రబాబుపై కేసులను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని.. అవి రాజకీయ కక్ష సాధింపులు కాదని ఎక్కువగా ప్రచారంలో పెట్టడంలోనూ ఐ ప్యాక్ సమర్థంగా పని చేయలేదన్న వాదన వినిపిస్తోంది. సీఐడీ , ఏఏజీ ప్రెస్ మీట్లతో పాటు.. మొత్తం చంద్రబాబు కేసులకు సంబంధించి ఐ ప్యాక్ ఓ వార్ రూమ్ ను ఏర్పాటు చేసుకున్నా.. ఇంపాక్ట్ చూపించలేకపోతోందని ఫీలవుతున్నారని చెబుతున్నారు.
అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ పూర్తి పవర్
మరో వైపు అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఐ ప్యాక్ కే అప్పగించారు. ఐ ప్యాక్ సర్వే లు చేసి ఎవరు గెలుస్తారు అంటే వాళ్లకే టిక్కెట్లు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. కొంత మందికి టిక్కెట్లు నిరాకరిస్తామని కూడా చెప్పారు. మరో వైపు పార్టీ నేతల పనితీరు విషయంలో హైకమాండ్ కు ఐ ప్యాక్ తప్పుడు నివేదికలు పంపుతోందన్న ఆరోపణలు కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్నాయి. అందుకే మరో ఇద్దరు కీలక నేతలతో సర్వేలు చేయించి రిపోర్టు తెప్పించుకుంటున్నారట. దీనికి ఈ మధ్య కాలంలో కొన్ని నామినేటెడ్ పోస్టుల బర్తీ కూడా హోల్ట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఐప్యాక్ కొంతమంది పేర్లు సూచిస్తే వాటిని తిరస్కరించినట్టు సమాచారం. వీటన్నింటినీ ఉదాహరణగా చూపించి ప్రశాంత్ కిషోర్ లేని లోటును వైసీపీ ఎక్కువగా చూస్తోందని ఆ పార్టీలో చెప్పుకుంటున్నారు.
Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!
Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?
Congress CM Candidate : కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి పంచాయతీ తప్పదా ? రేవంత్ రెడ్డిని సీనియర్లు అంగీకరిస్తారా ?
Revant Reddy : రేవంత్ రెడ్డితో అభ్యర్థుల భేటీ - పోలింగ్ సరళిపై విశ్లేషణ !
Telangana Cabinet Meet : సోమవారం తెలంగాణ కేబినెట్ భేటీ - ఫలితాలపై కేసీఆర్ గట్టి నమ్మకం !
Telangana Election Results 2023 LIVE: 2 రౌండ్లు ముగిసే సరికి మ్యాజిక్ ఫిగర్ కు చేరిన కాంగ్రెస్
Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం
Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
/body>