అన్వేషించండి

Top 10 Headlines Today: నేడు తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు, తెలంగాణ కాంగ్రెస్‌ గాడిలో పడిందా?, మధ్యప్రదేశ్‌లో హంగ్‌ తప్పదా?

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today: 

నేడు తల్లుల ఖాతాల్లో నిధులు

వరుసగా నాలుగో ఏడాది అమ్మ ఒడి నిధులను జమ చేసేందుకు జగన్ సర్కార్ రెడీ అయ్యింది.  2022-23 విద్యా సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి.... బతుకులు మార్చే గుడి గా సర్కార్ చెబుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

దారిలో పడ్డట్టేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసింది. ఓ రోజు పార్టీలో చేరే నేతల హడావుడి.. మరో రోజు స్ట్రాటజీ మీటింగ్ జరిగింది. ఈ రెండు సందర్భాల్లోనూ రాహుల్ గాంధీ మొత్తం పరిస్థితిని కంట్రోల్ చేశారు . ఎవరూ మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా  పార్టీ లైన్ దాటితే  ఉపేక్షించేది లేదన్నారు. ప్రత్యేకంగా ఇద్దరు నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా చెపుతున్నారు.  దీంతో తెలంగాణ కాంగ్రెస్ సెట్ రైట్ అయినట్లేనా ? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

జల్లులే తప్ప దంచికొట్టిందిలేదు 

నిన్నటి ఒడిశా, పరిసరాలలోని దక్షిణ జార్ఖండ్ & ఉత్తర ఛత్తీస్ గఢ్ వద్ద ఉన్న అల్పపీడనం ఈ రోజు తెలంగాణ నుండి దూరంగా వెళ్ళిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు ఈ రోజు కొన్ని చోట్ల, రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో  కూడిన  వర్షాలు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన ముగిసింది. నేడు సాయంత్రం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంలో సీఎం కేసీఆర్ తుల్జాపూర్ భవానీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. భవానీ అమ్మవారిని దర్శించుకొని సీఎం మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ ఆశ్వీర్వచనం అందించారు. తీర్థ ప్రసాదాలు అందించారు. తర్వాత ఆలయ అధికారులు సీఎం కేసీఆర్ గారికి సాంప్రదాయబద్ధంగా తలపాగాను ధరింపజేసి, శాలువాతో సత్కరించి అమ్మవారిని ప్రతిమను బహూకరించారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు భారీ కాన్వాయ్ లో తిరుగు పయనం అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వింత లెక్క పని పడతాం

జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తూర్పు కాపుల జనాభాపై వైసీపీ వింత లెక్కలు తేలుస్తామని ఆ పార్టీ అధనేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాగే వారి సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కాల్ల మండలం పెద్ద అమిరంలోని నిర్మలా దేవి ఫంక్షన్ హాలులో తూర్పు కాపు రాష్ట్ర స్థాయి నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరుకాగా... పలువురు తూర్పు కాపు నాయకులు పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సంద్భంగా జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ... పశ్చిమ గోదావరి జిల్లా భీమరవరం తనకు బలమైన జ్ఞాపకాలను ఇచ్చిందని చెప్పారు. అలాగే తూర్పు కాపుల సంక్షేమానికి ఇక్కడే బీజం పడిందని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను తెలుకునే కార్యక్రమమే జనవాణి అని చెప్పుకొచ్చారు. తూర్పు కాపుల సమస్యలను విన్నామని, వారి బాధలు, సమస్యలను దగ్గరి నుంచి చూశానని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మేకపాటి కుటుంబానికి బంపర్‌ ఆఫర్

మేకపాటి కుటుంబానికి మరోసారి సముచిత ప్రాధాన్యత కల్పించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2019లో మేకపాటి కుటుంబం తరపున నెల్లూరు జిల్లానుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి గెలిచి మంత్రి పదవి చేపట్టారు, ఆయన మరణం తర్వాత ఆ సీటు మేకపాటి విక్రమ్ రెడ్డికి దక్కింది, కానీ మంత్రి పదవి మాత్రం రాలేదు. ఇక ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు కానీ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ తో ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా పాల్గొనడంతో చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరడం ఖాయమని తేలిపోయింది. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గానికి వైసీపీ ఇన్ చార్జ్ గా మేకపాటి కుటుంబం నుంచి రాజగోపాల్ రెడ్డిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో 2024 ఎన్నికల్లో మరోసారి మేకపాటి కుటుంబానికి రెండు సీట్లు ఖాయం చేసినట్టు తేలిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కీ చూసుకున్నారా?

తెలంగాణలో హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి జూన్ 17న నిర్వహించిన రాతపరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ'ని టీఎస్‌పీఎస్సీ జూన్ 27న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది. మాస్టర్‌ ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు కమిషన్ తెలిపింది. జులై 26 వరకు రెస్పాన్స్‌షీట్లు ఆన్‌లైన్‌లో ఉండనున్నాయి. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే జూన్‌ 28 నుంచి జులై 1 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఇంగ్లిష్‌లో మాత్రమే తమ అభ్యంతరాలు నమోదుచేయాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మద్యప్రదేశ్‌లో హంగ్‌ తప్పదా?

త్వరలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ ఒకటి. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023కి సంబంధించి తొలి ఒపీనియన్ పోల్ ఫలితాలు వచ్చేశాయి. ఏబీపీ-సీవోటర్ సర్వే (ABP- CVoter Survey) మధ్యప్రదేశ్ ఎన్నికలలపై ఫస్ట్ ఒపీనియన్ పోల్ నిర్వహించి బీజేపీ, కాంగ్రెస్ లకు ఎన్ని సీట్లు వస్తాయో వెల్లడించింది. మొత్తం 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో అధికారం ఈసారి కూడా రెండు పార్టీలను దోబూచులాడేలా కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అప్పుడు సచిన్ కోసం- ఇప్పుడు కోహ్లీ కోసం 

టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశాడు. విరాట్‌ కోహ్లీ కోసం ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను గెలవాలని సూచించాడు. 2011 నాటి వారసత్వాన్ని కొనసాగించాలని పేర్కొన్నాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ లాగే విరాట్‌ టీమ్‌ఇండియా కోసం టన్నుల కొద్దీ పరుగులు చేశాడని గుర్తు చేశాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ షెడ్యూలు కార్యక్రమంలో అతడు మాట్లాడాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

విశ్రాంతి అవసరం- హెల్త్‌ అప్‌డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్

ఇటీవల మలయాళం ఫిల్మ్ విలయత్ బుద్ధ మూవీ షూటింగ్ లో గాయపడ్డ ప్రముఖ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్.. తాజాగా తన హెల్త్ అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తనకు యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమేనని ధృవీకరించారు. తానిప్పుడు బాగానే ఉన్నానని, కొన్ని నెలలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఆయన వెల్లడించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget