Weather Latest Update: త్వరలో బంగాళాఖాతం మరో అల్పపీడనం, నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఈ రోజు కొన్ని చోట్ల, రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
నిన్నటి ఒడిశా, పరిసరాలలోని దక్షిణ జార్ఖండ్ & ఉత్తర ఛత్తీస్ గఢ్ వద్ద ఉన్న అల్పపీడనం ఈ రోజు తెలంగాణ నుండి దూరంగా వెళ్ళిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఈ రోజు కొన్ని చోట్ల, రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని తెలిపారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.0 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 77 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే ఛాన్స్ ఉంది.
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
‘‘నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుతుపవన వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. నిన్న రాత్రి, నేడు ఉదయం నిన్నటి అంచనా ప్రకారం చాలా తక్కువ చోట్లల్లో మాత్రమే వర్షాలు పడ్డాయి. నేడు కూడా అలాగే కొనసాగనున్నాయి. ఎందుకంటే అల్పపీడనం మధ్య భారత దేశం వైపుగా వెళ్ళిపోయింది కాబట్టి మధ్యప్రదేశ్ విదర్భ ప్రాంతాల్లో భారీ వర్షాలను నేడు, రేపు చూడగలము. అలాగే ఈ అల్పపీడనం రాజస్థాన్ లోకి వెళ్ళనుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు ఆదిలాబాద్, కొమరంభీం అసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలు పడనుంది. అలాగే నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జనగామ జిల్లాల్లో తేలికపాటి వర్షాలను నేడు చూడగలం. రేపటికి అవి కూడా తగ్గుముఖం పడతాయి.
జూలై 3, 4 న మరో అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనుంది. ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా -42% లోటు వర్షపాతం కనిపిస్తోంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.