Pawan Kalyan: తూర్పు కాపుల లెక్కలు తేలుస్తాం, వారి సమస్యలను జనసేన ప్రభుత్వంలో పరిష్కరిస్తాం: పవన్ కల్యాణ్
Pawan Kalyan: జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తూర్పు కాపుల సమస్యలను పరిష్కరిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
Pawan Kalyan: జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తూర్పు కాపుల జనాభాపై వైసీపీ వింత లెక్కలు తేలుస్తామని ఆ పార్టీ అధనేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాగే వారి సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కాల్ల మండలం పెద్ద అమిరంలోని నిర్మలా దేవి ఫంక్షన్ హాలులో తూర్పు కాపు రాష్ట్ర స్థాయి నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరుకాగా... పలువురు తూర్పు కాపు నాయకులు పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సంద్భంగా జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ... పశ్చిమ గోదావరి జిల్లా భీమరవరం తనకు బలమైన జ్ఞాపకాలను ఇచ్చిందని చెప్పారు. అలాగే తూర్పు కాపుల సంక్షేమానికి ఇక్కడే బీజం పడిందని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను తెలుకునే కార్యక్రమమే జనవాణి అని చెప్పుకొచ్చారు. తూర్పు కాపుల సమస్యలను విన్నామని, వారి బాధలు, సమస్యలను దగ్గరి నుంచి చూశానని అన్నారు.
తన రూ.300 కోట్ల ఆస్తి కోసం
— JanaSena Party (@JanaSenaParty) June 27, 2023
ఏపీ ఆస్తి తెలంగాణకు వదిలేసిన జగన్ రెడ్డి#VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP pic.twitter.com/XEsMjZ9pC6
మొత్తం 46 లక్షల జనాభా.. టీడీపీ 26 లక్షలంటే, వైసీపీ 16 లక్షలని లెక్కలు
ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు దాటితే తూర్పు కాపులకు బీసీ ధ్రువీకరణ పత్రం ఇవ్వరని..కేవలం ఆ మూడు జిల్లాల్లోనే వారికి బీసీ కార్డు పనికొస్తుందని అన్నారు. తెలంగాణకు వెళ్తే అసలు వారిని బీసీలుగానే గుర్తించరని చెప్పారు. వంశధార నిర్వాసితుల్లో ఎక్కువ మంది తూర్పు కాపులే ఉన్నారని.. వాళఅలే ఎక్కువగా వలసలు వెళ్తున్నారని వివరించారు. తూర్పు కాపులు మొత్తం 46 లక్షల మంది ఉన్నారని కుల సంఘాల నాయకులు చెబుతున్నారని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో వారిని 26 లక్షలుగా గుర్తిస్తే.. వైసీపీ వారిని కేవలం 16 లక్షలే అని లెక్కలు చెబుతోందని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక తూర్పు కాపుల లెక్కలు తేలుస్తామని.. అలాగే వారి సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
• తూర్పుకాపుల సమస్యలను జనసేన ప్రభుత్వంలో పరిష్కరిస్తాం
— JanaSena Party (@JanaSenaParty) June 27, 2023
• భీమవరంలో తూర్పుకాపుల సమావేశంలో మాట్లాడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP pic.twitter.com/cr48o8LZvd
రూ.300 కోట్ల ఆస్తి కాపాడుకునేందుకు ప్రజల ఆస్తులు వదిలేశారు..!
ప్రతీసారి పవన్ కల్యాణ్ ఆవేశంతో మాట్లాడతాడు, ఉక్రోషంతో ఊగిపోతాడని కామెంట్లు చేస్తారని.. కానీ దాని వెనుక పేదోడి ఆవేదన దాగి ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. తాను ప్రజలను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని.. వారికి అన్యాయం జరిగితే తనకు జరిగినట్లే అనుకుంటానని.. చెప్పారు. ప్రజలు వారి సమస్యల గురించి చెబితే.. తన కుటుంబ సభ్యుల సమస్యలు విన్నట్లు అనిపించి, తన రక్తం మరిగిపోతుందని వివరించారు. జగన్ రెడ్డి తెలంగాణలోని తన రూ.300 కోట్ల ఆస్తిని కాపాడుకోవడానికి.. తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తులను మొత్తం ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాక, తెలంగాణకు వదిలేసి వచ్చేశాడని ఆరోపించారు. విభజన సమయంలో ఏపీకి చెందాల్సిన వేల కోట్ల ఆస్తులు అవంటూ కామెంట్లు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని 23 కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిందని... దాని గురించి మాట్లాడని వైసీపీ పాలకులు తమ ఆస్తులు కాపాడుకునేందుకు ప్రజల ఆస్తులను వదిలేశారన్నారు.
23 బీసీ కులాలను తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగిస్తే కనీసం మాట్లాడరు
— JanaSena Party (@JanaSenaParty) June 27, 2023
• ఉత్పత్తి కులాలకు రాజ్యాధికారం రావాలి
• తూర్పుకాపుల సమస్యలను జనసేన ప్రభుత్వంలో పరిష్కరిస్తాం
• జనసేనలో చేరిన అఖిల భారత తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలు#VarahiVijayaYatra#HelloAP_ByeByeYCP pic.twitter.com/HMBsqVe1k3