Top Headlines Today: ఏపీలో లిక్కర్ ప్రకంపనలు ఖాయమా! అభివృద్ధి నినాదంతోనే కేసీఆర్ ప్రచారం- టాప్ టెన్ న్యూస్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
లిక్కర్ ప్రకంపనలు
ఏపీలో భారీ లిక్కర్ స్కాం జరుగుతోదని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఓ సారి హోంమంత్రి అమిత్ షాకు..రెండు సార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. క్షేత్ర స్థాయి పర్యటనల సమయంలో లిక్కర్ స్కాంపైనే దృృష్టి పెట్టారు. ఏపీ మద్యం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని ఆస్పత్రులకు వెళ్లి పరామర్శించారు. డిజిటల్ పేమెంట్స్ తీసుకోకపోవడంపైనా దుకాణంలోకి వెళ్లి మరీ నిజం బయట పెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పొత్తు ఖాయమేనా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. తెలంగాణలో బీజేపీ - జనసేన పార్టీల పొత్తు, సీట్ల సర్దుబాటుపై వీరు చర్చించుకున్నారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. పవన్ కల్యాణ్‌ను కలిసి తెలంగాణలో బీజేపీకి మద్దతివ్వాలని కోరిన సంగతి తెలిసిందే. అటు తెలంగాణలో పోటీ చేయాలని జనసేన కూడా రెడీగా ఉన్నట్లు ప్రకటించడంతో.. ఇక రెండు పార్టీల మధ్య పొత్తుపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అమెరికాలో కాల్పులు
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. లివిన్‌స్టన్, మైనే లూయిస్ టన్‌లో బుధవారం (అక్టోబర్ 25) కాల్పులు జరిగాయి. ఈ దాడిలో కనీసం 22 మంది మరణించినట్లు సమాచారం. సిఎన్ఎన్ నివేదిక ప్రకారం, 50-60 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలంగాణలో చలి
ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
గద్వాలలో త్రిముఖ పోరు తప్పదా?
గద్వాల రాజకీయాలను డీకే కుటుంబం దశాబ్దాలుగా శాసిస్తోంది. గద్వాల నియోజకవర్గం అంటే డీకే ఫ్యామిలీ...డీకే ఫ్యామిలీ అంటే గద్వాల అనేలా మార్చేసుకున్నారు. డికే సత్యారెడ్డి నుంచి డీకే అరుణ వరకు గద్వాల రాజకీయాల్లో ప్రత్యేక ముద్రవేశారు. డీకే అరుణ కుటుంబానికి ఇది కంచుకోట. 70ఏళ్లుగా గద్వాల రాజకీయాలను డీకే కుటుంబమే శాసిస్తోంది. ప్రతిసారి గద్వాల ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. గడచిన మూడు సాధారణ ఎన్నికల్లో ప్రధానంగా అత్తా అల్లుళ్ల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాజీ మంత్రి డీకే అరుణ, సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తలపడనున్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాలను లెక్కలేసుకొని సరితా తిరుపతియ్యను బరిలోకి దించింది. దీంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. త్రిముఖపోటీ అనివార్యంగా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నేటి నుంచి సామాజిక బస్ యాత్ర
దేశంలో సామాజిక న్యాయాన్ని పాటించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. అక్టోబర్ 26వ తేదీ (గురువారం) నుంచి మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర ప్రారంభం కానుంది. ఆ వివరాలను మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి వివరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సామాజిక సాధికార యాత్ర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అభివృద్ధి నినాదమే
తెలంగాణ రాజకీయం అంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్. కేసీఆర్ పేరు చెప్పినా.. టీఆర్ఎస్ ను గుర్తు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చేది తెలంగాణనే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయంగా తిరుగులేని స్థానం ఇచ్చింది తెలంగాణ. ఇక్కడ తెలంగాణ ప్రాంతం కాదు. ఉద్యమం. తెలంగాణ ఉద్యమం.ప్రజల్లో తెలంగాణపై ఉన్న ప్రేమను ఉద్యమంగా మార్చడం.. ఆ ఉద్యమానికి నేతృత్వం వహించడం వల్ల కేసీఆర్‌కు రాజకీయంగా బాహుబలిలాగా ఎదిగారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయనకు తెలంగాణ ఉద్యమమి అండగా నిలిచింది. కానీ ఈ సారి ఎన్నికల్లో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఆయన పక్కన పెట్టి అభివృద్ధి ఆయుధంతో బరిలోకి దిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
'మంగళవారం' సినిపై ఆసక్తి
'మంగళవారం' సినిమాపై ముందు నుంచి అంచనాలు బావున్నాయి. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఫస్ట్ లుక్ విడుదల తర్వాత ప్రేక్షకుల చూపు పడింది. టీజర్ విడుదలైన తర్వాత అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదల తర్వాత ఆ అంచనాలను మరింత పెంచారు దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). దాంతో డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం డిమాండ్ ఏర్పడింది. ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి వెళుతున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే...పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
క్షమాపణలు చెప్పిన సుమ
ప్రముఖ యాంకర్, టీవీ వ్యాఖ్యాత సుమ కనకాల గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా తన చలాకీ మాటలతో ఆడియన్స్ ను అలరిస్తూ, ప్రతీ తెలుగు ఇంటిలోనూ భాగమైంది. ఓవైపు హోస్ట్ గా బుల్లితెరపై హవా కొనసాగిస్తూనే, మరోవైపు యాంకర్ గా వరుస సినిమా ఈవెంట్స్ తో దూసుకుపోతోంది. ఆమె డేట్స్ ఖాళీ లేక సినిమా ఫంక్షన్స్ వాయిదా వేసుకుంటున్నారంటే సుమ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తన మాటలతో, పంచ్ డైలాగ్స్ తో ఎలాంటి వేదికనైనా తన కంట్రోల్ లోకి తెచ్చుకునే సుమ.. ఇతరులను నొప్పించకుండానే సెటైర్స్ వేయడంలో దిట్ట అనిపించుకుంది. అయితే అనుకోకుండా ఆమె చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్స్
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్ సేన వరుస విజయాలతో ఊపు మీదుంది. టాపార్డర్ పరుగుల వరద పారిస్తుండడం.. బౌలర్లు తమ పాత్రను సమర్థంగా పోషిస్తుండడంతో ఆడిన అయిదు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన కొనసాగుతోంది. తాజాగా ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లోనూ భారత బ్యాటర్లు సత్తా చాటారు. ఏకంగా ముగ్గురు టీమిండియా బ్యాటర్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో కొనసాగుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి