అన్వేషించండి

Andhra Liquor Scam : లిక్కర్ స్కామ్‌పై విచారణకు పట్టుబడుతున్న పురందేశ్వరి - హైకమాండ్ అంగీకరిస్తే రాజకీయంగా సంచలనమేనా ?

ఏపీలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందని విచారణ చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పట్టుబడుతున్నారు. బీజేపీ హైకమాండ్ వద్ద పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి విచారణ చేయిస్తారా?

 

Andhra Liquor Scam :   ఏపీలో భారీ లిక్కర్ స్కాం జరుగుతోదని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఓ సారి హోంమంత్రి అమిత్ షాకు..రెండు సార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. క్షేత్ర స్థాయి పర్యటనల సమయంలో లిక్కర్ స్కాంపైనే దృృష్టి పెట్టారు. ఏపీ మద్యం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని ఆస్పత్రులకు వెళ్లి పరామర్శించారు. డిజిటల్ పేమెంట్స్ తీసుకోకపోవడంపైనా దుకాణంలోకి వెళ్లి మరీ నిజం బయట పెట్టారు. 

ఏపీలో మద్యం విధానంపై విమర్శలు 

జగన్‌ మోహన్ రెడ్డి అధికారం చేపట్టగానే  మద్య నిషేధ లక్ష్యంతో   నూతన మద్యం విధానం ప్రవేశపెట్టింది.  ఏపీలో ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగింది. అప్పటికప్పుడు ప్రైవేటు షాపులన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు వచ్చాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పేరున్న బ్రాండ్లేమీ అమ్మడం లేదు. పూర్తిగా కొత్త బ్రాండ్లు అమ్ముతున్నారు. డిజిటల్ పేమెంట్స్ నిన్నామొన్నటి వరకూ తీసుకోలేదు. మద్యం ధరలు రెండు వందల శాతానికిపైగా పెంచారు. దీని వల్ల తాగే వారు తగ్గుతారని ప్రభుత్వం చెప్పింది. మొదటి ఏడాది దుకాణాల సంఖ్యను తగ్గించారు.కానీ తర్వాత మళ్లీ వివిధ మద్యం మాల్స్, టూరిజం పేరుతో సాధారణ స్థితికి దుకాణాలు తెచ్చారు. కానీ ఏపీలో అమ్మే మద్ంయ మాత్రం బయట ఎక్కడా దొరకదు. ఫల్ సేల్ ఏపీ ఓన్లీ మద్యం మాత్రమే అమ్ముతారు. 
 
మద్యం బ్రాండ్లు అన్నీ వైఎస్ఆర్‌సీపీ నేతలేవేనని పురందేశ్వరి ఆరోపమ

ఏపీలో మద్యం తయారు చేసే  డిస్టిలరీస్  యాజమాన్య వివరాలను పురందేశ్వరి ప్రకటించారు. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పోరేషన్‌లో వందకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో 16 కంపెనీల ద్వారానే 74 శాతం మద్యం సేకరణ జరుగుతుంది అని తెలిపారు. 100 కంపెనీలు ఉంటే.. 16 కంపెనీలకే ఎందుకు ప్రాధాన్యాత ఇస్తున్నారుని పురంధేశ్వరి ప్రకటించారు.  అదాన్ డిస్టలరీస్ 2019లో హైదరాబాద్ సాగర్ సొసైటీ ప్లాట్ నెంబర్ 16  లో ప్రారంభించారు. ఈ అదాన్ కంపెనీకి రూ.1,160కోట్ల కేటాయింపు జరిగింది. చింతకాయల రాజేశ్, పుట్టా మహేశ్ కంపెనీల నుంచి కంపెనీలు లీజ్ కు తీసుకుని నడుపుతున్నారు. వీరిని బెదిరించి.. అదాన్ డిస్లరీస్ కంపెనీ సబ్ లీజ్‌కు తీసుకున్నారు. వారి నుంచి బలవంతంగా లాక్కుని బ్రాండ్‌లను తయారు చేస్తున్నారు’ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపిస్తున్నారు.  ఆదాన్ డిస్లరీస్ వెనుక వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి  ప్రకటించారు.  రూ.1863కోట్ల మద్యం ఈ డిస్లరీస్ నుంచి సేకరణ జరుగుతుంది అని ఆరోపించారరు. ఆదాన్ వెనుక ఎంపీ విజయసాయిరెడ్డి, ఎస్పీవై వెనుక ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారని పురందేశ్వరి ప్రకటించారు.  ఆదాన్, ఎస్పీ వై సంస్థల అడ్రస్ రెండూ హైదరాబాద్ ఒకే చిరునామా అని పత్రాలు బయట పెట్టారు.  ఎంయస్ బయెటెక్ సంస్థ తరపున అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి సబ్ లీజుకు తీసుకుని మద్యం సరఫరా చేస్తున్నారు.   యన్.కె. డిస్లరీస్ తరపున రూ.1966.66కోట్ల మద్యం సరఫరా చేశారు అని పురంధేశ్వరి ఆరోపించారు. గతంలో ఎప్పుడూ వీళ్లు తయారు చేసిన కంపెనీల పేర్లే మార్కెట్‌లో లేవని చెబుతున్నారు.ప్రకాశంజిల్లాలో పాల్ డిస్లరీస్‌కు రూ.931.32కోట్ల మద్యానికి ఆర్డర్ ఇచ్చారు. సీఎం అనుచరులు బెదిరించి.. ఈ కంపెనీ లాక్కుని నడుపుతున్నారు. బి.ఆర్.కె స్పిరిట్స్ రూ.1040 కోట్ల మద్యం సేకరణ జరిగింది. శర్వాణి బేవరేజెస్ ను చంద్రారెడ్డి నడుపుతుండగా రూ.426.60 కోట్ల మద్యం ఆర్డర్ ఇచ్చారు. బిడి.యస్.హెచ్ ఆగ్రో కు రూ.328 కోట్ల మద్యం ఆర్డర్ ఇచ్చారు. ఈ కంపెనీల పేర్లు, యజమానుల పేర్లు చెప్పాలని కోరినా ప్రభుత్వం స్పందించ లేదు అని దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తమ బాధ్యతగా మద్యం తయారీదారులు, వారి వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు తామే ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు.  

కల్తీ మద్యంలో ప్రజల ప్రాణాలకు రిస్క్ 

దశల వారీగా మద్యం నిషేధిస్తామన్న జగన్.. వారి అనుయాయులతో మద్యం తయారు చేసి పేదల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అని మండిపడ్డారు. కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు 39 మంది మద్యం వల్లే ఆస్పత్రిలో ఉన్నారని తేలిందన్నారు. ఏపీలో అటువంటి పరిస్థితి లేదని వైసీపీ నాయకులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారన్నారు. మరి వైద్యులు చెబుతున్న అంశాలపై ప్రభుత్వం స్పందించదా అని దగ్గబాటి పురంధేశ్వరి నిలదీశారు. రూ. 56వేల కోట్ల ఆదాయం మీకు వస్తుంటే రూ.20వేల కోట్ల ఆదాయం ప్రభుత్వం చెబుతుంది అని ఆరోపించారు. మరి లెక్కల్లోకి రాని ఆదాయం ఎక్కడకు వెళుతుందో జగన్ చెప్పాలి అని దగ్గుబాటి పురంధేశ్వరి నిలదీశారు. ఫైవ్ స్టార్ హోటల్స్‌కే మద్యం పరిమితం చేస్తానని చెప్పిన జగన్ కానీ అప్పు కోసం మద్యపాన నిషేధం ఉండదని...మార్పులు ఉండవని అగ్రిమెంట్‌లో జగన్ సంతకం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. 

ఇప్పటికే ఆధారాలతో సహా కేంద్రానికి పిర్యాదు

ఇప్పుటికే పురందేశ్వరి ఆధారాలతో సహా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ అంశపై బీజేపీ హైకమాండ్ ఏమి ఆలోచిస్తుందో స్పష్త లేదు కానీ..  ప్రభుత్వంపై పురందేశ్వరి పోరాటంలో వెనక్కి తగ్గవద్దన్న సంకేతాలు మాత్రం ఇచ్చారు. అందుకే ఆమె రోజు రోజుకు ఆరోపణల డోసు పెంచుకుంటూ పోతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ ఆరోపణలపై దృష్టి పెట్టాయో లేదో స్పష్టత లేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆమె దర్యాప్తు చేయమని అడిగితే.. ఖచ్చితంగా పరిశీలన చేస్తారు. అయితే సరైన సమయం చూసి చర్యలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. అందుకే.. ఏపీ మద్యం విధానం విషయంలో దర్యాప్తు అంటూ జరిగితే రాజకీయంగా  సంచలనం అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shadnagar Incident: సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Priyanka - Shiv: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
Andhra Pradesh: ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్! కరకట్ట కమల్ హాసన్ ఆర్కే- మంగళగిరిలో నారా లోకేష్ సెటైర్లు
ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్! కరకట్ట కమల్ హాసన్ ఆర్కే- మంగళగిరిలో నారా లోకేష్ సెటైర్లు
IPL 2024: ముంబై ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టం,  ఇక ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిందే
ముంబై ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టం, ఇక ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిందే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Sharmila on YS Jagan |YSRపేరు  ఛార్జిషీట్ లో పెట్టించిన పొన్నవోలుకు పదవి ఇస్తావా అన్న..!Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | ఫోన్ ట్యాపింగ్ పై మీ అభిప్రాయమేంటీ | ABPEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPBJP MP Candidate Madhavilatha | పదవులు వచ్చినా..రాకపోయినా... పాతబస్తీలోనే ఉంటానంటున్న మాధవిలత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shadnagar Incident: సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Priyanka - Shiv: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
Andhra Pradesh: ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్! కరకట్ట కమల్ హాసన్ ఆర్కే- మంగళగిరిలో నారా లోకేష్ సెటైర్లు
ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్! కరకట్ట కమల్ హాసన్ ఆర్కే- మంగళగిరిలో నారా లోకేష్ సెటైర్లు
IPL 2024: ముంబై ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టం,  ఇక ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిందే
ముంబై ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టం, ఇక ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిందే
HBD Samantha Ruth Prabhu: ఫ్యాన్స్‌కు సమంత బర్త్ డే సర్‌ప్రైజ్: అప్‌కమింగ్ మూవీ పోస్టర్ రిలీజ్ - హౌజ్ వైఫ్ పాత్రలో వైల్డ్​గా కనిపిస్తున్న సామ్
ఫ్యాన్స్‌కు సమంత బర్త్ డే సర్‌ప్రైజ్: అప్‌కమింగ్ మూవీ పోస్టర్ రిలీజ్ - హౌజ్ వైఫ్ పాత్రలో వైల్డ్​గా కనిపిస్తున్న సామ్
Hand Model: ఆమె చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది, హ్యాండ్ మోడలింగ్‌తో లక్షల్లో సంపాదన
Hand Model: ఆమె చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది, హ్యాండ్ మోడలింగ్‌తో లక్షల్లో సంపాదన
Andhra Pradesh: వాళ్లని తొక్కిపడేయండి, పాపం చేసిన వాళ్లని వదలొద్దు - బ్రదర్‌ అనిల్‌ సంచలన వ్యాఖ్యలు
వాళ్లని తొక్కిపడేయండి, పాపం చేసిన వాళ్లని వదలొద్దు - బ్రదర్‌ అనిల్‌ సంచలన వ్యాఖ్యలు
IPL 2024: మళ్లీ మెరిసిన సుదర్శన్‌,  బెంగళూరు లక్ష్యం 201
మళ్లీ మెరిసిన సుదర్శన్‌, బెంగళూరు లక్ష్యం 201
Embed widget