Pawan - Amit Shah Meet: అమిత్ షా - పవన్ కల్యాణ్ భేటీ, తెలంగాణలో పొత్తులపై చర్చలు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. పవన్ కల్యాణ్‌ను కలిసి తెలంగాణలో బీజేపీకి మద్దతివ్వాలని కోరిన సంగతి తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. తెలంగాణలో బీజేపీ - జనసేన పార్టీల పొత్తు, సీట్ల సర్దుబాటుపై వీరు చర్చించుకున్నారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. పవన్ కల్యాణ్‌ను కలిసి తెలంగాణలో బీజేపీకి మద్దతివ్వాలని కోరిన సంగతి తెలిసిందే. అటు తెలంగాణలో పోటీ చేయాలని జనసేన కూడా రెడీగా ఉన్నట్లు ప్రకటించడంతో.. ఇక రెండు పార్టీల మధ్య పొత్తుపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
మధ్యాహ్నమే ఢిల్లీకి
బీజేపీ అధిష్ఠానం నుంచి జనసేన నేత పవన్ కళ్యాణ్ కు పిలుపు రావడంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అమిత్ షా, నడ్డాతో సమావేశం అయ్యారు.