అన్వేషించండి

Suma Kanakala: మీడియాకు క్షమాపణలు చెప్పిన యాంకర్‌ సుమ.. ఎందుకంటే?

యాంకర్ సుమ మీడియాకు క్షమాపణలు చెప్పారు. ‘ఆదికేశవ’ ఈవెంట్ లో తన వ్యాఖ్యలు బాధిస్తే మన్నించాలని కోరారు.

ప్రముఖ యాంకర్, టీవీ వ్యాఖ్యాత సుమ కనకాల గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా తన చలాకీ మాటలతో ఆడియన్స్ ను అలరిస్తూ, ప్రతీ తెలుగు ఇంటిలోనూ భాగమైంది. ఓవైపు హోస్ట్ గా బుల్లితెరపై హవా కొనసాగిస్తూనే, మరోవైపు యాంకర్ గా వరుస సినిమా ఈవెంట్స్ తో దూసుకుపోతోంది. ఆమె డేట్స్ ఖాళీ లేక సినిమా ఫంక్షన్స్ వాయిదా వేసుకుంటున్నారంటే సుమ రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తన మాటలతో, పంచ్ డైలాగ్స్ తో ఎలాంటి వేదికనైనా తన కంట్రోల్ లోకి తెచ్చుకునే సుమ.. ఇతరులను నొప్పించకుండానే సెటైర్స్ వేయడంలో దిట్ట అనిపించుకుంది. అయితే అనుకోకుండా ఆమె చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. ఈ సినిమాలోని ‘లీలమ్మో’ అనే పాటను హైదరాబాద్‌ లో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి యాంకర్‌ గా సుమ వ్యవహరించారు. ఆ సందర్భంలో మీడియా ప్రతినిధులను ఉద్దేశిస్తూ.. ''మేం పెట్టిన స్నాక్స్‌ ను భోజనంలా తింటున్నారు.. త్వరగా లోపలికి వచ్చి మీ మీ కెమెరాలను ఇక్కడ పెట్టాలని కోరుతున్నాము. బాబూ.. నువ్వు ముగ్గురికి చెప్పు.. వాళ్లను మరో ముగ్గురికి చెప్పమని చెప్పు.. తొందరగా రండి'' అని సుమ వ్యాఖ్యానించారు. దీనికి నొచ్చుకున్న ఓ సినీ జర్నలిస్ట్ ఆమె మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Also Read వైరల్ పిక్: అల్ట్రా మాస్ అవతార్‌లో మహేష్..!

మీడియా వారు స్నాక్స్‌ ను భోజనంలా తింటున్నారని అన్నారు.. అలా అనకుండా ఉంటే బాగుండేదని ఆ జర్నలిస్ట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి సుమ స్పందిస్తూ.. "ఓకే అండి.. అది నేను జోక్ గా అన్నాను. ఎందుకంటే మీరంతా చాలా ఏళ్ళ నుంచి నాకు తెలిసినవారే.. ఆ చనువుతో అలా మాట్లాడాను" అని బదులిచ్చారు. దీంతో "మీరు జోక్స్ బాగా వేస్తారు.. కానీ వాటిల్లో మీడియాకు మినహాయింపు ఇవ్వండి'' అని సదరు విలేఖరి అన్నారు. అప్పుడు సుమ ‘మీరు స్నాక్స్‌ ను స్నాక్స్‌ లానే తిన్నారు.. ఓకేనా?’ అని అడగ్గా.. ‘ఇదే వద్దనేది. ప్లీజ్.. జనరల్ గా మీ యాంకరింగ్‌ అందరికీ ఇష్టమేగానీ, మీడియా విషయంలో మాత్రం ఇలాంటివి వద్దు’ అని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.
 
తన మాటలకు బాధ పడినందుకు వేదికపై నుంచే సుమ మీడియా మిత్రులను క్షమాపణలు కోరారు. ఆ తర్వాత మరోమారు దేనిపై వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. "మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈ రోజు నేనొక ఈవెంట్‌ లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నాను. మీరెంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. మీరు, నేను కలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు సుమ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. 

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశ పరిచిన 'సలార్' మేకర్స్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
The Raja Saab: రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
Embed widget