US Shooting: అమెరికాలో కాల్పులు -22 మంది మృతి, 50 మందికి గాయాలు
US Shooting:అమెరికాలోని మూడు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 22 మంది మృతి చెందగా 50 మందికి గాయాలు అయ్యాయి.
![US Shooting: అమెరికాలో కాల్పులు -22 మంది మృతి, 50 మందికి గాయాలు us shooting 22 people were killed and 50 injured in a shooting incident in Lewiston And maines USA US Shooting: అమెరికాలో కాల్పులు -22 మంది మృతి, 50 మందికి గాయాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/26/51dcbd77f36955c239da8d8dcef916281698286698669215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
US Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. లివిన్‌స్టన్, మైనే లూయిస్ టన్‌లో బుధవారం (అక్టోబర్ 25) కాల్పులు జరిగాయి. ఈ దాడిలో కనీసం 22 మంది మరణించినట్లు సమాచారం. సిఎన్ఎన్ నివేదిక ప్రకారం, 50-60 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది.
CNN నివేదిక ప్రకారం, బుధవారం రాత్రి USలోని మైనే రాష్ట్రంలోని లెవిస్టన్‌లో కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెందారు. 50 నుంచి 60 మంది వరకు గాయపడ్డారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నట్లు ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది. షెరీఫ్ కార్యాలయం "గుర్తింపు కోసం అనుమానితుడు" చిత్రాలను విడుదల చేసింది. అందులో ఒక వ్యక్తి రైఫిల్ పట్టుకుని కాల్పులు జరుపుతూ కనిపించాడు. కాల్పులు జరిపేందుకు వచ్చిన వాహనం ఫోటోను కూడా లూయిస్టన్ పోలీసులు విడుదల చేశారు.
ఆ ప్రాంతంలో వ్యాపారాలను మూసివేయాలని ప్రజలకు ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ విజ్ఞప్తి చేశారు. కేసు దర్యాప్తులో చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ఏదైనా అనుమానాస్పద చర్యల, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 911కి కాల్ చేయమని రిక్వస్ట్ చేశారు.
నగరమంతటా మూడు వేర్వేరు ప్రదేశాల్లో కాల్పులు జరిగాయి. సన్ జర్నల్ వార్తాపత్రిక ప్రకారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మొల్లిసన్ వేలోని స్పేర్‌టైమ్ రిక్రియేషన్‌లో రాత్రి 7:15 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మొదట కాల్పులు జరిగాయి.
కొద్దిసేపటి తర్వాత, లింకన్ స్ట్రీట్‌లోని స్కీంగీస్ బార్ & గ్రిల్ రెస్టారెంట్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. ఆపై ఆల్ఫ్రెడ్ ఎ ప్లోర్డ్ పార్క్‌వేలోని వాల్‌మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో కాల్పుల సంఘటన జరిగాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)