Top 10 Headlines Today: రూ. 2000 నోట్ బ్యాన్ నుంచి రాజస్థాన్ విజయం వరకు లేటెస్ట్ అప్‌డేట్స్‌తో మే 20 నాటి మార్నింగ్ టాప్ టెన్ న్యూస్
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..
Top 10 Headlines Today:
2000 నోట్‌కు బైబై
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తన నిర్ణయం ప్రకటించింది. అయితే రూ.2వేల నోట్లను సెప్టెంబర్ 30వ తేదీ వరకు మార్చుకునేందుకు ఆర్బీఐ వెసలుబాటు కల్పించింది. రూ. 2000 నోటు చెలామణి కాకుండా ఉపసంహరించుకుంది. ఇకనుంచి రూ.2 వేల నోట్లను జారీ చేయకూడదని, వినియోగదారులకు ఇవ్వకూడదని బ్యాంకులకు సూచిస్తూ ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
మే19న ఏం జరిగింది? నవంబర్ 8న ఏం చేశారు?
2000 రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం (19 మే 2023) నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత దేశంలో కలకలం రేగింది. రూ. 2000 నోటును తక్షణం రద్దు చేయలేదు. ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీ మధ్య కాలంలో ప్రజలు ఏ బ్యాంకుకు వెళ్లి అయినా రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి RBI గడువు ఇచ్చింది. దీxతో పాటు, సెప్టెంబర్ 30, 2023 వరకు రూ. 2000 రూపాయల నోట్లు చెలామణిలో ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఒకవిధంగా దీనిని పాక్షిక రద్దుగా పరిగణించాలి. ఈ వార్త తర్వాత, 8 నవంబర్ 2016న మోదీ ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
బీజేపీపై విశ్వేశ్వర రెడ్డి సంచలన కామెంట్స్
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కలకలం బయలుదేరింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది నేతలు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భారతీయ జనతాపార్టీ ఎదుగకపోవడానికి బీఆర్ఎస్ పార్టీతో ఉన్న అంతర్గత దోస్తీనే కారణమని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అవుతుందని అనుకున్నారని కానీ అరెస్ట్ చేయలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అందుకే బీజేపీ దూకుడుకు బ్రేక్ పడిందన్నారు. జూపల్లి పొంగులేటిలు కూడా అందుకే పార్టీలో చేరడం లేదని.. ఎవరూ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు. కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లనేప్రజలు రెండు పార్టీలు ఒకటేనని అనుకుంటున్నారన్నారు. తెలంగాణలో మరో కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదని.. అలా ఎవరైనా పార్టీ పెడితే.. కేసీఆర్ పురిటిలోనే చంపేస్తారన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2000 నా ఎఫెక్టే: చంద్రబాబు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రూ.2 వేల నోట్లను బ్యాంకులు, ఆర్బీఐ రీజనల్ ఆఫీసులలో మార్చుకోవాలని.. డిపాజిట్లు అయితే ఎంతైనా చేసుకోవచ్చునని సూచించింది. ఆర్బీఐ తాజా నిర్ణయంపై ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. అనకాపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలో అవినీతి పరులు ఉన్నారని, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ తానే ఇచ్చానన్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే రిపోర్ట్ ఇచ్చానని గుర్తుచేశారు. తాజాగా ఆర్బీఐ రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటూ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించారు. దేశ సంపద కొందరు మాత్రమే దోచేస్తున్నారు... అందుకే పెద్ద నోట్లు రద్దు చేయమని కేంద్రానికి సూచించినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
రూ. 4 వేల కోట్లు రెడీ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ప్రవేటికరణ కాకుండా కాపాడటానికి కావాల్సిన 4 వేల కోట్లు తన వద్ద సిద్దంగా ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయత్రం నగరంలోని డా .కె.ఏ. ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు అవసరం అయిన మూలధనం 4 వేల కోట్లు అమెరికా వెళ్లి సమకుర్చానని.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాని ఈ విషయాన్ని తెలియజేస్తూ అనుమతి కోరతూ కేంద్రాని జూన్ 4 వరకూ సమయం ఇచ్చానని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఎన్టీఆర్ శతజయంతి వేడుక
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత నేత ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ’ మే 20న సాయంత్రం 5గంటలకు హైదరాబాద్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని కైతలాపూర్ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడులకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ప్రముఖ సినీ నటడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆధార్ కార్డు ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చు
భారత పౌరుడి అధికారిక గుర్తింపు పత్రాల్లో ఆధార్ ఒకటి. ఆధార్ అంటే వట్టి సంఖ్య మాత్రమే కాదు, ఆ కార్డులో సదరు వ్యక్తి పేరు, వయస్సు, చిరునామా వంటి సమాచారంతో పాటు అతి కీలకమైన వేలిముద్రలు (బయోమెట్రిక్), కంటిపాపల (ఐరిస్) సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి, ఇది చాలా ముఖ్యమైన పత్రం. వ్యక్తిగత గుర్తింపును నిరూపించుకోవాల్సిన ప్రతిచోటా దీని అవసరం ఉంటుంది. ఆధార్ లేకపోతే స్కూల్లో అడ్మిషన్ దొరకదు, బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయలేం, ఉద్యోగంలో చేరలేం, ఏ ప్రభుత్వ పథకం అందదు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆధార్ కార్డ్ వివరాల్లో చిన్న తప్పు దొర్లినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల, ఆధార్‌లో తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవడం శ్రేయస్కరం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రాశులవారు అనవసర చర్చలు పెట్టొద్దు - కోపాన్ని అదుపుచేసుకోవాలి!
ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ సూచన. ఆరోగ్యం బావుంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. మానసికంగా సంతోషంగా ఉండండి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
సెకండ్ హ్యాండ్ కార్లు కొంటున్నారా?
సాధారణంగా కొత్త కార్ల కంటే సెకండ్ హ్యాండ్ కార్లనే మంచి విలువైన ఉత్పత్తులుగా భావిస్తారు. వాటి ధర తక్కువగా ఉంటుంది. కానీ కొత్త కారు అందించే లగ్జరీనే అందిస్తుంది. కానీ మంచి సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలంటే చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిలో ముఖ్యమైన ఐదు అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఫ్లే ఆఫ్ బెర్త్‌లు మరింత సంక్లిష్టం
ఐపీఎల్‌లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది. కానీ కావాల్సినంత తేడాతో విజయం సాధించలేదు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెట్ రన్‌రేట్‌ను దాటాలంటే 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. కానీ రాజస్తాన్ 19.4 ఓవర్లలో ఛేదించింది. దీంతో బెంగళూరు దగ్గరకు వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెట్ రన్‌రేట్ +0.18 కాగా, రాజస్తాన్ రాయల్స్ నెట్ రన్‌రేట్ +0.148గా ఉంది. ఈ రెండు జట్ల మధ్య తేడా కేవలం 0.032 మాత్రమే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి