News
News
వీడియోలు ఆటలు
X

Second Hand Car Buying Tips: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు విషయాలు చూసుకోకపోతే కష్టమే!

ప్రస్తుతం మనదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. కానీ ఇలాంటి కార్లు కొనేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

FOLLOW US: 
Share:

Used Car Buying Tips: సాధారణంగా కొత్త కార్ల కంటే సెకండ్ హ్యాండ్ కార్లనే మంచి విలువైన ఉత్పత్తులుగా భావిస్తారు. వాటి ధర తక్కువగా ఉంటుంది. కానీ కొత్త కారు అందించే లగ్జరీనే అందిస్తుంది. కానీ మంచి సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలంటే చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిలో ముఖ్యమైన ఐదు అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం.

టెస్ట్ డ్రైవ్ కచ్చితంగా చేయాలి
దీనికి ఇంకో ప్రత్యామ్నాయం లేదు. మీరు కారును టెస్ట్ డ్రైవ్ చేసే దాకా కొనాలా వద్దా అనే నిర్ణయానికి రాలేరు. ఒకవేళ మీకు డ్రైవింగ్ రాకపోతే, వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లండి. టెస్ట్ డ్రైవ్ సమయంలో కారు ఎటువంటి ట్రబుల్ ఇవ్వకుండా, పెద్ద శబ్దాలు చేయకుండా స్మూత్‌గా నడిస్తేనే మీరు కొనాలనే నిర్ణయానికి రండి. గేర్లు మార్చేటప్పుడు స్మూత్‌గా ఉన్నాయా లేవా, స్టీరింగ్ వీల్ సరిగ్గా ఉందా లేదా అనేది, వీల్ అలైన్‌మెంట్ ఎలా ఉంది అనేవి కచ్చితంగా చూసుకోవాలి. అలాగే వాహనంలో లీకేజీ సమస్య ఏదైనా ఉందేమో ముందే చూసుకోవాలి.

స్మూత్ ఎక్స్‌టీరియర్, వర్కింగ్ ఎలక్ట్రికల్స్
కొత్త కారు కొనుగోలు చేసే ముందు దాని ఎక్స్‌టీరియర్ కూడా చెక్ చేసుకోవాలి. సెకండ్ హ్యాండ్ కారే అయినా డెంట్స్, గీతలు లేకుండా చూసుకుంటే మంచిది. దీంతో పాటు హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు, వైపర్స్ వంటివి సరిగ్గా పని చేస్తున్నాయా, లేవా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే బ్యాటరీ హెల్త్ దాని మీదనే ఆధారపడి ఉంటుంది.

ఓడోమీటర్ రీడింగ్
కొంతమంది బైక్ ఓడోమీటర్ రీడింగ్‌ను టాంపర్ చేసి తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపిస్తారు. కాబట్టి ఓడోమీటర్ రీడింగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. ఓనర్ చెప్పిన నంబర్ దాంతో మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. అలాగే కంపెనీ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి సర్వీస్ హిస్టరీ, ఓడోమీటర్ రికార్డులను కూడా చూడవచ్చు.

క్యాబిన్ క్వాలిటీ చెక్ చేయండి
కారు లోపలి భాగం కూడా ఎంతో ముఖ్యం. కాబట్టి ఇంటీరియల్, క్యాబిన్ క్వాలిటీని తప్పకుండా చెక్ చేయండి. ఏసీ సరిగ్గా పని చేస్తుందా లేదా, కారులో స్పీకర్లు  ఎలా ఉన్నాయి వంటి వాటిని కూడా చెక్ చేయాలి.అలాగే సీట్ బెల్టులు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. అవి చిరగకుండా ఉండటం ముఖ్యం.

డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి
కొత్త కారు లాగానే, సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు కూడా అందులో ఎన్నో డాక్యుమెంట్స్ ఇన్‌వాల్స్ అయి ఉంటాయి. కాబట్టి సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పేపర్లు తప్పకుండా చెక్ చేయండి. దాంతో పాటు పీయూసీ, రోడ్ ట్యాక్స్ పేమెంట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వంటివి కూడా తీసుకోండి. ఎన్ఓసీ తీసుకోకపోతే తర్వాత మీరు నేమ్ ఛేంజ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది.

దీంతోపాటు అధికారిక గవర్నమెంట్ వెబ్‌సైట్లో కూడా కారుపై ఏవైనా పెండింగ్ కేసులు, చలాన్లు ఉన్నాయేమో చూసుకోండి. వీటన్నిటినీ ఫాలో అయ్యి కారు విషయంలో మీరు పూర్తిగా సంతృప్తి చెందితేనే సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేయడం ఉత్తమం.

Read Also: దేశీయ మార్కెట్లోకి సరికొత్త BMW X1 లాంచ్, ధర రూ.45.90 లక్షల నుంచి షురూ!

Published at : 19 May 2023 06:27 PM (IST) Tags: Used Car Purchase Tips Second Hand Car Buying Guide Car Buying Tips Used Car Buying Tips Second Hand Car Buying Tips

సంబంధిత కథనాలు

Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?

Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?

మారుతి To టయోటా- రూ. 10 లక్షల్లోపు రాబోతున్న 5 బెస్ట్ కార్లు ఇవే!

మారుతి To టయోటా- రూ. 10 లక్షల్లోపు రాబోతున్న 5 బెస్ట్ కార్లు ఇవే!

బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నారా? అయితే, తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నారా? అయితే, తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Tesla Entry in India: త్వరలో భారతదేశానికి రానున్న టెస్లా - 2023 చివరిలోపు!

Tesla Entry in India: త్వరలో భారతదేశానికి రానున్న టెస్లా - 2023 చివరిలోపు!

Ajith Kumar: తోటి బైకర్‌కు అజిత్ సర్‌ప్రైజ్ - రూ.12.5 లక్షల విలువైన బైక్‌ గిఫ్ట్!

Ajith Kumar: తోటి బైకర్‌కు అజిత్ సర్‌ప్రైజ్ - రూ.12.5 లక్షల విలువైన బైక్‌ గిఫ్ట్!

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!