News
News
వీడియోలు ఆటలు
X

Chandrababu: రూ.2000 నోట్లపై ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు, కేంద్రానికి నేనే చెప్పానంటూ కీలక వ్యాఖ్యలు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు కీలక ప్రకటన చేసింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రూ.2 వేల నోట్లను బ్యాంకులు, ఆర్బీఐ రీజనల్ ఆఫీసులలో మార్చుకోవాలని సూచించింది.

FOLLOW US: 
Share:

Chandrababu About RBI to withdraw Rs 2000 Notes:  భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రూ.2 వేల నోట్లను బ్యాంకులు, ఆర్బీఐ రీజనల్ ఆఫీసులలో మార్చుకోవాలని.. డిపాజిట్లు అయితే ఎంతైనా చేసుకోవచ్చునని సూచించింది. ఆర్బీఐ తాజా నిర్ణయంపై ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. అనకాపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలో అవినీతి పరులు ఉన్నారని, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ తానే ఇచ్చానన్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే రిపోర్ట్ ఇచ్చానని గుర్తుచేశారు. తాజాగా ఆర్బీఐ రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటూ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించారు. దేశ సంపద కొందరు మాత్రమే దోచేస్తున్నారు... అందుకే పెద్ద నోట్లు రద్దు చేయమని కేంద్రానికి సూచించినట్లు చెప్పారు. 

బావి తరాల పిల్లలకోసం ఆలోచిస్తున్నా అన్నారు. ఖర్చులు పెరిగాయి.. ఆదాయం తగ్గింది.. మీ జీవితాలు ఆవిరి అయిపోయాయి. డబ్బు పిశాచి జగన్ మోహన్ రెడ్డి... బాబాయ్ వివేకానందరెడ్డిని కూడా చంపేశాడంటూ ఆరోపించారు. రాష్ట్రంలో ఎటు చూసినా బాదుడే బాదుడు... అన్ని ధరలు పెరిగాయి. కరెంట్ చార్జీలు పెరిగాయి కరెంట్ కోతలు పెరిగాయి. ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారు. ఏమైనా అడిగి తే కేసు లు పెడుతున్నారు అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

ఎన్టీఆర్ చైతన్య రథంపై తొమ్మిది నెలలు రాష్ట్రం అంతా తిరిగి చైతన్యం చేశారు. పోలీసులు సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం పోలీసులు విది అన్నారు. జీవో నెంబర్ 1 అనేది హై కోర్టు చెప్పింది. ప్రజాస్వామ్యంలో రోడ్ షో లు పెట్టుకునే హక్కు అందరికీ ఉందన్నారు. ఉత్తరాంధ్ర వెనుక బడిన వర్గాలు వుండే ప్రాంతం, నీతి నిజాయితీకి మారు పేరు ఉత్తరాంధ్ర.. మంచికి మారుపేరు విశాఖ, అనకాపల్లి అన్నారు. కానీ ఈ ప్రాంతంలో వైసీపీ వచ్ఛిన నుంచి అరాచకాలు, ఆస్తులు కబ్జాలు అవుతున్నాయి. వైసీపీ గద్దలు విశాఖ లో వాలాయి.. నాలుగు ఏళ్ళు లో నలబై వేల కోట్ల రూపాయలు ఆస్తులు కబ్జా చేశారు. దొంగ లు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు మదుర వాడ 5.5, హైగ్రీవా, రేడియంట్ వెయ్యి కోట్లు, వైఎస్ అనీల్ జగన్ చిన్నాన్న కొడుకు విశాఖలో యాబై ఎకరాలు కొట్టేశాడు. వీటి కి సమాధానం చెప్పాలి అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. 

మైన్స్, బాంబు లకే భయపడలేదు.. వాల్తేరు క్లబ్, ప్రేమ సమాజం, వెంకోజీ పాలెం ల్యాండ్, మర్రి పాలెం లో సర్వే నెంబర్ 1/81,1/83 అయిదు ఎకరాల వంద కోట్ల రూపాయలు భూమి కి టెండర్ పెట్టారు. నరేష్ ని రాసి ఇవ్వమని చెప్పి బెదిరించారు. కోర్టు కి పోయి స్టే తెస్తే మళ్లీ కోర్టుకి వెళ్లి ఎన్ఆర్ఐ ని బెదిరిస్తూ న్నారు. మన భూములు బెదిరించి తీసుకుని రియల్ ఎస్టేట్ చేసి 10 శాతం మాత్రమే మీకు వాటా అంటారు. చంపేస్తా మని తుపాకీ చూపించి ఆస్తులు కాజేస్తున్నారు. బాబాయ్ ని ఎవరు చంపారు. గొడ్డలి పోటా, గుండె పోటా అని ప్రశ్నించారు. 

ఇప్పుడు దేశం లో ఉన్న లాయర్ లు అందర్ని పెట్టి తమ్ముడ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు జగన్. బాబాయ్ కిల్లర్ పేరుతో ఒక సినిమా తీయొచ్చు. సిట్, సీబీఐ కూడా ఏం చేయలేకపోతున్నాయి. నేరస్తులను ఎంపీలు, ఎమ్మెల్యేలు చేశాడంటూ మండిపడ్డారు. ఇక్కడ వైసీపీ కోడిగుడ్డు మంత్రి ఉన్నాడంటూ గుడివాడ అమర్నాథ్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆయన వల్ల ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా, పరిశ్రమలు వచ్చాయా. విశాఖ ను మంచి హబ్ గా చేద్దాం అనుకుంటే. అన్ని పంపేశాడు. లులు వంటి సంస్థలు ను వాట ఇవ్వలేదని తరిమేశాడు, ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్, అదాని డేటా సెంటర్ పై డ్రామా చేస్తున్నారు. భావన పాడు పోర్ట్ ను వాళ్ల మనిషికి ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయానికి గతంలో శంకుస్థాపన చేశాను.. జగన్ మళ్లీ శంకుస్థాపన చేశాడన్నారు. 
Also Read: Prathibha Bharati: పచ్చ చొక్కా వేసుకుంటే చాలు కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారు: ప్రతిభా భారతి

విశాఖపై ప్రేమ లేదు.. మీ ఆస్తులపై ప్రేమ. ఋషికొండ ను గుండు కొట్టించారు. మొత్తం జిల్లా అభివృద్ధి ఆగిపోయింది. అనకాపల్లి బెల్లం ఏపీ లో టాప్.. టన్నుకు 3500 ఇస్తాను అని చెప్పి మోసం.. 80 వేల ఎకరాలలో గతంలో సాగు. ఇప్పుడు 30 వేల ఎకరాలకి తగ్గి పోయింది. బెల్లం మార్కెట్ కి పూర్వ వైవవం తెస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. పోలవరం నీళ్ళు... గోదావరి నీళ్ళు మీ ప్రాంతానికి తెస్తాం. నేను ఉంటే పోలవరం పూర్తయ్యేది. వంశధార వరకు నదుల అనుసంధానం జరిగేది.. 8 లక్షల ఎకరాలకు నీరు, సాగు నీరు అందేదన్నారు. 


నిరుద్యోగ భృతి లేదు. జాబ్ లేదు. జాబ్ రావాలి అంటే బాబు రావాలి. అందరికీ ఉద్యోగాలు ఇస్తాం. పెట్టుబడుల్లో 14 వ స్థానం కీ పడిపోయాం అన్నారు. 6 లక్షల కోట్లు రూపాయి లు పెట్టుబడులు పెట్టి లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం అన్నారు. నీళ్లు ఇవ్వలేక పోతున్నారు. ఏపీ 19 వ స్థానంలో వుంది. తెలంగాణ 1 వ స్థానం లో ఉంది. అమ్మ ఒడి అవాస్తవం.. నాన్న బుడ్డి వాస్తవం అని సెటైర్లు వేశారు చంద్రబాబు. వంట గ్యాస్, మరుగు దొడ్లు, వెస్ట్ కంపోస్టు ఇలా అన్ని టీడీపీ హయాంలో జరిగాయి. 

గ్రామ స్వరాజ్యం నిర్వీర్యమైంది. పేద వారికి ఇళ్ళు కట్టారా. 52 వేల ఇళ్ళు, 2500 అనకాపల్లి నియోజకవర్గంకి టిడ్కో ఇళ్ళు మంజూరు చేశాం. మేం ఇళ్ళు కడితే ఆ ఇళ్ళు కూడా ఇవ్వలేదు.. అమరావతిలో ఒక్క సెంటు ఇస్తాడంట. బెంగళూరులో 27 ఎకరాలు లో నీ ఇల్లు వాస్తవం కాదా. టీడీపీ హయాంలో మూడు సెంట్లు ఇచ్చాం.. ఇప్పుడు ఒక్క సెంటు ఇస్తున్నవు. సమాధి కి మాత్రమే పని చేస్తుంది. అయిదు సెంట్లు లేదా అర ఎకరం ఇవ్వు.. హర్షం వ్యక్తం చేస్తామన్నారు. 

సంక్షేమం అంటే టీడీపీనే... ఇళ్ళు, కూడు, గుడ్డ టీడీపీ తో ప్రారంభం అయిందన్నారు. 36 వేల కోట్ల రూపాయలు సబ్ ప్లాన్ బీసీలకి ఇచ్చాం. ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే వైసీపీ నేతలకు నిద్రపట్టదు. పరదాల చాటున దాక్కోవడం కాదు దమ్ముంటే సీఎం ఇక్కడికి వచ్చి నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  ఏపీలో గంజాయి ఎక్కువ. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ. రైతులపై అధిక అప్పుడు రాష్ట్రంలోనే ఉంది. డ్రోన్ లు లాగేసి, పోలీసు వ్యవస్థ తప్పు చేయొద్దు. డ్రోన్ లు ఇవ్వకపోతే నేను కూడా తిరుగుబాటు చేస్తా అని హెచ్చరించారు. విశాఖ ని నెంబర్ వన్ గా చేసే బాధ్యత నాది. 10 లక్షల కోట్లు అప్పు ఉన్నా రాజధాని లేదు. జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం ఉందన్నారు.

నాది ముందు చూపు... జగన్ ది దొంగ చూపు
తనది ముందు చూపు అయితే సీఎం జగన్ ది దొంగ చూపు అని ఎద్దేవా చేశారు. అవినాష్ రెడ్డి ఆడే డ్రామాలలో ఒక్క డ్రామా ఐనా మేము ఆడుతున్నమా. మిమ్మల్ని అరెస్టు చేస్తే పోలీసు స్టేషన్ లు చాలవు. సీఎం అబద్దాల చెబుతూనే ఉంటాడు. కోడిగుడ్డు మంత్రి పవన్ కళ్యాణ్ ను, నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ గుడివాడ అమర్నాథ్ పై సెటైర్లు వేశారు. అనకాపల్లి లో రెండు వేల కోట్లు రూపాయలు కర్చు పెట్టాం.. ఎన్ టి ఆర్ ఆసుపత్రి నేనే తెచ్చాను. తుమ్మపాల చెక్కెర కర్మాగారం 30 కోట్లు కర్చు పెట్టి తెరిపిస్తే ఇప్పడు మూసేశారు. విస్సన్న పేట 609 ఎకరాలు హాం ఫట్.. అయ్య కోడి గుడ్డు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజమండ్రిలో 28 న ఎన్ టి ఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. జూన్ నెలలో మళ్లీ వస్తా.. మీ కోసం ఎన్నికల మేనిఫెస్టో తయారు చేస్తా అన్నారు చంద్రబాబు.
Also Read: Vidadala Rajini About Chandrababu: పేదల నివాస స్థలాలను సమాధులతో పోల్చడం దారుణం

Published at : 19 May 2023 09:37 PM (IST) Tags: Chandrababu RBI Reserve Bank of India RBI Update

సంబంధిత కథనాలు

Visakha Crime News: అనకాపల్లి జిల్లాలో మద్యం వ్యాన్ బోల్తా, బీర్ బాటిళ్ళ కోసం పోటీపడ్డ జనం

Visakha Crime News: అనకాపల్లి జిల్లాలో మద్యం వ్యాన్ బోల్తా, బీర్ బాటిళ్ళ కోసం పోటీపడ్డ జనం

Top 10 Headlines Today: పోలవరం టూర్‌కు జగన్, నాగర్ కర్నూల్‌లో కేసీఆర్ పర్యటన, తిరుపతిలో ఆదిపురుష్‌ వేడుక

Top 10 Headlines Today: పోలవరం టూర్‌కు జగన్, నాగర్ కర్నూల్‌లో కేసీఆర్ పర్యటన, తిరుపతిలో ఆదిపురుష్‌ వేడుక

Top 10 Headlines Today: ఏపీకి గుడ్‌ న్యూస్ చెప్పిన కేంద్రం, ఒడిశా ప్రమాద బాధితులపై మమత

Top 10 Headlines Today: ఏపీకి గుడ్‌ న్యూస్ చెప్పిన కేంద్రం, ఒడిశా ప్రమాద బాధితులపై మమత

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

విశాఖలో పెట్టుబడులు, పురోగతిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

విశాఖలో పెట్టుబడులు, పురోగతిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!