Image Credit: Freepik
మే 20 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ సూచన. ఆరోగ్యం బావుంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. మానసికంగా సంతోషంగా ఉండండి.
వృషభ రాశి
మీరు కుటుంబ సభ్యులతో అవసరమైన చర్చలు జరుపుతారు. ఇంటి పనులు చేపడతారు. అమ్మవారి ఆశీస్సులు మీపై ఉంటాయి. ఉద్యోగులు తమ పనితీరు వల్ల అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితుల వల్ల ప్రయోజనం ఉంటుంది. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. ధనలాభం పొందే అవకాశం ఉంది.
మిథున రాశి
వ్యాపార రంగంలో ఉన్నవారికి అభివృద్ధి. కొన్ని విషయాలపై జరుగుతున్న చర్చలు సఫలం అవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. పని ఒత్తిడి వల్ల అనారోగ్య సూచన. నూతన వ్యక్తుల పరిచయం ఆనందాన్నిస్తుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధపెట్టాలి.
Also Read: శుక్రుడు-కుజుడి సంచారం ఈ 4రాశులవారికి అస్సలు బాలేదు!
కర్కాటక రాశి
ఈ రోజు రుణబాధలు తీరుతాయి. నూతన వ్యక్తుల పరిచయం మంచి చేస్తుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టండి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కార్యాలయ పనుల్లో బిజీగా ఉంటారు.
సింహ రాశి
కోపం తగ్గించుకుంటే మంచిది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జరిపే చర్చలు మంచి ఫలితాలున్నాయి..ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో పాల్గొంటారు.
కన్యా రాశి
ఈ రోజు మీరు కొత్తపనులు ఏవీ ప్రారంభించవద్దు. అత్యవసరం అయితేతప్ప ప్రయాణాలు చేయొద్దు. ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. మీరు తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. వ్యాపార భాగస్వాములతో అప్రమత్తంగా వ్యవహరించండి వివాదాలు పెట్టుకోవద్దు. అనవసరంగా మాట్లాడొద్దు
తులా రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. కొన్ని సమస్యలు దూరమవుతాయి. పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండడం మంచిది. మీ చుట్టూ ఉన్నవారిలో కొందరు శత్రువులున్నారు జాగ్రత్త పడండి. ఈ రోజు కొత్త పనులేవీ ప్రారంభించవద్దు.
వృశ్చిక రాశి
ఈ రాశివారు కోపాన్ని నియంత్రించుకోవాలి. ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావొచ్చు. స్నేహితులు, బంధువులను కలుస్తారు. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబంతో సమయం గడుపుతారు. ఉద్యోగస్తులు శ్రద్ధగా పనిచేయాలి. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. కష్టపడి తగిన ఫలితం దొరక్కపోయినా నిరాశపడొద్దు. తొందరపాటు ఆలోచనలు, నిర్ణయాలు చేయొద్దు. ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆర్థిక ప్రయోజనాలుంటాయి కానీ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి
ఈ రోజు మీరు మీ భావోద్వేగాలను అదుపుచేసుకోవాలి. నిరుత్సాహపరిచే ఆలోచనలకు దూరంగా ఉండాలి. వాహనప్రమాద సూచనలున్నాయి ప్రయాణంలో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో నిదానంగా మాట్లాడండి. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది.
Also Read: పుట్టినప్పటి నుంచి పోయేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలు ఇవే!
కుంభ రాశి
ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఆస్తి వివాదాలు వాయిదా పడతాయి. ఏదో ఒక మానసిక ఆందోళన వెంటాడుతుంది. విద్యార్థులు మరింత కష్టపడితేనే ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
మీన రాశి
ఈ రోజు ఎవరితోనూ గొడవలు పడకండి. మనస్పర్థలు ఏర్పడవచ్చు. మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రణాళికలు ఉన్నప్పటికీ అడుగు ముందుకువేసేందుకు ఆలోచిస్తారు.
Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!
జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం
Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!
June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే
జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!
Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!
Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్
Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం