Mangal and Shukra Yuti 2023: శుక్రుడు-కుజుడి సంచారం ఈ 4రాశులవారికి అస్సలు బాలేదు!
కుజుడు-శుక్రుడు కలసి కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం...
![Mangal and Shukra Yuti 2023: శుక్రుడు-కుజుడి సంచారం ఈ 4రాశులవారికి అస్సలు బాలేదు! Mangal and Shukra Yuti 2023: Venus-Mars conjunction in Cancer , these 4 zodiac signs get problems, Know in telugu Mangal and Shukra Yuti 2023: శుక్రుడు-కుజుడి సంచారం ఈ 4రాశులవారికి అస్సలు బాలేదు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/16/62407969609473f594641c882627fddd1684241486313217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mangal and Shukra Yuti 2023: అంగారకుడు (కుజుడు) మే 10న కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు..జూన్ 29 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. మరోవైపు మే 30న శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి అడుగుపెడతారు. ఈ రెండు రాశుల సంయక్త సంచారం వల్ల కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు, మరికొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలుంటాయి. శుక్రుడు-కుజుడి ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి
శుక్రుడు-కుజుడి సంయోగం ఈ రాశివారికి మంచి చేస్తుంది. శుభకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది. ఆరోగ్య బావుంటుంది. పిల్లలు ఆనందంగా ఉంటారు. పోటీ పరీక్షలకు హాజరైన వారు విజయం సాధిస్తారు.
వృషభ రాశి
విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కుజుడి సంచారం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. చర్మ సంబంధిత రుగ్మతలు ఇబ్బంది పెడతాయి. మాటతూలొద్దు..ఎవరితోనూ వివాదాలు వద్దు.
మిథున రాశి
మిథున రాశి వారికి శుక్రుడు-కుజుడి సంచారం పనిలో అడ్డంకులు సృష్టిస్తుంది. ప్రయాణంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. బంధువులతో వివాదాలు, విభేదాలు ఉంటాయి. మతపరమైన పనులు చేయాలని మీకు అనిపించదు.
కర్కాటక రాశి
శుక్ర-అంగారకుల కలయిక కర్కాటక రాశి వారికి ధనలాభాన్ని సూచిస్తోంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. మనసు ఆనందంగా ఉంటుంది. పనుల్లో విజయావకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు.
సింహ రాశి
శుక్రుడు-అంగారకుడు ఈ కలయిక సింహరాశి వారికి అశుభం. ఈ పొత్తు సమయంలో జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు ఉంటాయి. వ్యాపారంలో నష్టంతోపాటు సంపద నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉంటాయి . ఈ కాలంలో మానసిక సమస్యలు పెరుగుతాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి శుక్రుడు-అంగారకుడు కలయిక వల్ల ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆశక్తి పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. శత్రువులపై విజయం ఉంటుంది. మానసిక ఆనందం పొందుతారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది.
Also Read: రోజూ ఈ 4 నియమాలు పాటిస్తే మోక్షం పొందుతారు!
తులా రాశి
శుక్ర-అంగారకుల కలయిక తులారాశి వారికి మానసిక కుంగుబాటును కలిగిస్తుంది. పనుల్లో విజయం ఉండదు. జీవిత భాగస్వామి, పిల్లలతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ధన నష్టం కలగుతుంది. ప్రేమ సంబంధాలు కూడా విఫలమవుతాయి.
వృశ్చిక రాశి
శుక్రుడు-అంగారకుడి సంచారం వృశ్చికరాశివారిలో సంతోషాన్ని పెంచుతుంది. ఆర్థికలాభం ఉంటుంది. వాహన సుఖం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తులతో లాభపడతారు. కుటుంబ సంతోషాన్ని పొందుతారు. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారిలో ధైర్యం, శక్తి లోపిస్తుంది. ఆర్థికంగా నష్టపోతారు. బంధువులతో పరస్పర వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మాట తూలొద్దు.
మకర రాశి
శుక్రుడు - అంగారక గ్రహాల కలయిక మకర రాశివారికి మంచి చేస్తుంది. ఈ కాలంలో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు మానసిక ప్రశాంతత, ఆనందాన్ని పొందుతారు. పనుల్లో కూడా విజయావకాశాలు ఏర్పడుతున్నాయి.
కుంభ రాశి
శుక్రుడు - కుజుడు సంయోగం కుంభ రాశి వారికి సంపదను ఇస్తుంది. అన్ని వైపుల నుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఆశించిన పురోగతికి అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. బంధువుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ కాలంలో మీ ఆధిపత్యం కూడా పెరుగుతుంది.
Also Read : ఈ చిన్న చిన్న పొరపాట్లే దురదృష్టానికి, దారిద్య్రానికి కారణం..!
మీన రాశి
శుక్రుడు మరియు కుజుడు కలయిక మీన రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రసంగ ఆధారిత పనులలో విశేష ప్రయోజనం ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)