Garuda Puranam : రోజూ ఈ 4 నియమాలు పాటిస్తే మోక్షం పొందుతారు!
Garuda Puranam : ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసిన కర్మల ద్వారా పుణ్యం, మోక్షాన్ని పొందుతాడని గరుడ పురాణంలో తెలిపారు. ఈ 4 నియమాలను పాటిస్తే మోక్షాన్ని పొందవచ్చని గరుడ పురాణం చెబుతోంది. అవి మీకు తెలుసా?
![Garuda Puranam : రోజూ ఈ 4 నియమాలు పాటిస్తే మోక్షం పొందుతారు! Garuda Puranam :garuda purana says that daily should follow these 4 rules to get moksha Garuda Puranam : రోజూ ఈ 4 నియమాలు పాటిస్తే మోక్షం పొందుతారు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/ca6a2ccf55680582809155e5bafb34261684001984377691_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Garuda Puranam : గరుడ పురాణానికి హిందూ మతంలో మహాపురాణం అని పేరు. గరుడ పురాణం నుంచి మనం జనన మరణ రహస్యాలను తెలుసుకోవచ్చు. ఇది జననం, మరణం, పునర్జన్మ, ఆత్మ, స్వర్గం, నరకం, కర్మ ప్రకారం శిక్ష మొదలైన వాటి గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది. మన దైనందిన జీవితానికి సంబంధించిన అనేక ఆలోచనలు గరుడ పురాణంలో పేర్కొన్నారు. ఈ ఆలోచనలు మన మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గరుడ పురాణం వినడం, చదవడం వల్ల మనకున్న అనేక చింతలు తొలగిపోతాయని, జీవితంలో విజయం సొంతమవుతుందని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు తనకు ఇష్టుడైన గరుత్మంతుడి మధ్య జరిగిన సంభాషణను గరుడ పురాణంలో వివరించారు. దీనితో పాటుగా, జీవితకాలంలో మనిషి చేసే ఏ చర్య ద్వారానైనా మోక్షాన్ని పొందుతాడో దేవదేవుడు విపులంగా తెలిపాడు. గరుడ పురాణంలోని ఈ భాగంలో మనిషి జీవితంలో ఏ 4 నియమాలు పాటించాలో తెలుసుకుందాం.
1. దానధర్మాలు
గరుడ పురాణంలో మనిషి ఎప్పుడూ దానధర్మాలు, ధర్మం చేయాలని స్పష్టంచేశారు. దానధర్మాలతో జీవనం సాగించే సాధకునికి సంపదలు, ఐశ్వర్యం అనుగ్రహించే లక్ష్మీ ఆనందంతో సహకరిస్తుంది. దీనితో పాటు, దానం చేసిన వ్యక్తి అనేక రకాల దోషాల నుంచి విముక్తి పొందుతాడు. దానం చేసిన వారికి మరణానంతరం మోక్షం లభిస్తుందనే నమ్మకం కూడా ఉంది.
Also Read : ఈ చిన్న చిన్న పొరపాట్లే దురదృష్టానికి, దారిద్య్రానికి కారణం..!
2. కష్టార్జితం
అనైతిక మార్గాల ద్వారా డబ్బు సంపాదించకూడదని గరుడ పురాణం చెబుతోంది. అటువంటి సంపద వినాశనం సృష్టించే ప్రమాదముంది. ఈ డబ్బు మన దురాశను కొంతకాలం మాత్రమే తీర్చగలదు. అయితే ఇది లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణం అవుతుంది. అందుకే మనిషి ఎప్పుడూ సత్యం, ధర్మ మార్గాన్ని అనుసరించి డబ్బు సంపాదించాలి.
3. స్త్రీలకు గౌరవం
ఎక్కడ స్త్రీలు గౌరవం పొందుతారో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని గరుడపురాణంలో పేర్కొన్నారు. స్త్రీలతో అనుచితంగా ప్రవర్తించే వ్యక్తి యమలోకంలోనూ, ధర్తీలోకంలోనూ హింసలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మహిళలను ఎప్పుడూ అవమానించకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది.
4. పెద్దల పట్ల గౌరవం
దానధర్మాలతో పాటు పెద్దలు, తల్లిదండ్రులను గౌరవించే, సేవ చేసే వ్యక్తికి దేవతలు సహకరిస్తారు. అటువంటి వ్యక్తుల ఇంట్లో సిరులనిచ్చే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది. అలాంటి వ్యక్తికి సంపదతో పాటు శ్రేయస్సును అనుగ్రహిస్తుంది. పెద్దలను గౌరవించే వ్యక్తి మాత్రమే అన్ని సమస్యలకు దూరంగా ఉంటూ అడుగడుగునా విజయం సాధిస్తాడు.
Also Read : ఈ సంకేతాలు ఎదురవుతున్నాయా - అదృష్టం మీ ఇంటి తలుపు తట్టినట్టే!
గరుడ పురాణం ప్రకారం, పైన పేర్కొన్న నాలుగు నియమాలను ఖచ్చితంగా పాటించే వ్యక్తి తన జీవితకాలంలో మంచి ప్రయోజనాలను పొందడమే కాకుండా, మరణానంతరం మోక్షాన్ని కూడా పొందుతాడు. ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించడం అత్యంత అవసరం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)