మీ జాతకంలో గ్రహాలు మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తాయి
ఓ వ్యక్తి జాతకం రాయాలన్నా ముందుగా చక్రాలు వేస్తారు. వాటిని రాశి చక్రం, అంశ చక్రం అంటారు. పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో సూచిస్తూ ఆయా గ్రహాల స్థానాలను ఆయా చక్రాల్లో పొందుపరుస్తారు.
కొన్ని గ్రహాలతో కలిస్తే మాత్రం ఆయా వ్యక్తి ప్రవర్తనపై ప్రభావం చూపిస్తుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
జాతకంలో బృహస్పతి, శుక్రుడు, శని కలిసి ఉంటే జాతకుడి స్వభావం చాలా బలంగా ఉంటుంది. మంచి ప్రవర్తనతో అందర్నీ మెప్పిస్తారు
సూర్యుడు-శని, చంద్రుడు-శని , సూర్యుడు-చంద్రుడు జాతకంలో కలసి ఉంటే వారు కొంత అసహనంతో ఉంటారు. ఈ కలయికలో గురువు కూడా పాల్గొంటే మాత్రం ఎలాంటి పరిస్థితులను అయినా తన అదుపులోకి తెచ్చుకోగలుగుతారు.
జాతకంలో గురు, శని, గురు శుక్ర గ్రహాల కలసి ఉన్నా లేదా ఒకదానికి ఎదురుగా మరొకటి ఉన్నా వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనా విధానం బావుంటుంది. ఎవ్వరినీ మోసం చేయలేరు..బంధాలను బలంగా మెంటైన్ చేస్తారు
కుజుడు, శుక్రుడు లగ్నం... ఏడో ఇంట్లో కూర్చుంటే ఆ జాతకులు ఓ వ్యక్తితో ఆగిపోరు..వీరిది చాలా విశాల హృదయం మనసులో ఎంతమందికి అయినా చోటివ్వగలరు. అయితే ఈ గ్రహాలతో పాటూ గురువు కలిస్తే ఆ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి
కుజుడు, శుక్రుడు ఏడు లేదా ఎనిమిదో స్థానంలో ఉంటే ఆ జాతకులకు చాలామందితో సంబంధాలుంటాయి. వీరి స్నేహితుల జాబితా కూడా పెద్దదే
ఏ వ్యక్తి జాతకంలో అయినా బృహస్పతి, శుక్రుడు, శని గ్రహాలు కలిస్తే వారి గుణం చాలా మంచిది. క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. వీరు బంధాలకు చాలా విలువనిస్తారు.
సూర్యుడు చంద్రుడు, శుక్రుడు లేదా చంద్రుడు, కుజుడు - బుధుడి కలయిక అయితే ఆ జాతకులు ప్రకాశవంతంగా ఉంటారు. ఎవ్వరినైనా ఆకట్టుకోవడంలో వీరు నిష్ణాతులు
జాతక చక్రంలో బుధుడు, చంద్రుడు, శుక్రుడు ఏడో ఇంట్లో, రాహువు లగ్నంలో ఉంటే జాతకుడి స్వభావం అస్సలు మంచిది కాదు. వీరి ఆలోచనలు ఎప్పుడూ తప్పుగానే ఉంటాయి. చివరకు భార్యను కూడా తప్పుడుపనులు చేయించడానికి ప్రేరేపిస్తారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితుల నుంచి సేకరించింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. Images Credit: Pinterest