By: ABP Desam | Updated at : 19 May 2023 11:33 PM (IST)
కేఏ పాల్
- స్టీల్ ప్లాంట్ కు అవసరమైన 4 వేల కోట్లు డబ్బు సిద్దం : డా .కె.ఏ.పాల్
-కేంద్రం సానుకూలంగా స్పందిస్తే 72 గంటల్లో డబ్బు ను చెల్లిస్తా
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ప్రవేటికరణ కాకుండా కాపాడటానికి కావాల్సిన 4 వేల కోట్లు తన వద్ద సిద్దంగా ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయత్రం నగరంలోని డా .కె.ఏ. ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు అవసరం అయిన మూలధనం 4 వేల కోట్లు అమెరికా వెళ్లి సమకుర్చానని.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాని ఈ విషయాన్ని తెలియజేస్తూ అనుమతి కోరతూ కేంద్రాని జూన్ 4 వరకూ సమయం ఇచ్చానని ఆయన అన్నారు.
ఆమరణ నిరాహారదీక్షకు దిగుతాను
స్టీల్ ప్లాంట్ ను అమ్మకుండా ఆపామన్న విషయాన్ని తెలుగు ప్రజలకు తెలియాలని జూన్ 4 లోపల అనుమతి ఇవ్వకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం తన ప్రతిపాదనకు అనుకూలంగా స్పందిస్తే 72 గంటల్లో 4 వేల కోట్ల వైట్ మనీని చెల్లించేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఒకవేళ మాట తప్పితే తన పాస్ పోర్ట్ సీజ్ చేసుకోవచ్చునని ఈ 4 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ థర్డ్ ఫేస్ రన్ చేయవచ్చు ఇది16 వేల కుటుంబాలకు శుభవార్త నిజానికి ప్రధాని మోడీ దగ్గర స్టీల్ ప్లాంట్ పోరాటకమిటీ నేతలు 27 మందిని కూర్చోపెడదామనుకున్నాను. ఏం జరిగిందో తెలీదు వారు రాలేకపోయారు స్టీల్ ప్లాంట్ పై ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని నాకు అనుమానంగా ఉంది. మరోసారి ప్రయత్నించి వారితో మోడీ ని కలిసే ఏర్పాటు చేస్తాను. అంతేకాకుండా బిజేపి అవినీతి చేస్తోంటే ఏపిలో పాలక ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నించలేకపోతున్నారని మరోసారి జగన్ సీఎం అయితే ఏంటి లాభం అని ఆయన ప్రశ్నించారు.
జనసైనికులు తనతో కలిసిరావాలని రాష్ట్రం లో రెండు కులాల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని కేఏ పాల్ అన్నారు. వాలంటీర్లకు నెలకు ఇచ్చే 5 వేల రూ జీతంతో తిండి ఎలా దొరుకుందని వాలంటీర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని , తనను గెలిపిస్తే తొలిదశలో లక్ష మంది వాలంటీర్లను పర్మినెంట్ ను చేస్తాను. జేడి లక్ష్మీనారాయణ మాదిరి జనసైనికులు ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆయన పిలిపునిచ్చారు.
Ganta Srinivasa Rao: ఏపీ అరాచకంలో అఫ్గాన్, అప్పుల్లో శ్రీలంకను దాటేసింది! అసలు సినిమా ముందుంది - గంటా
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం
Top 5 Headlines Today: బీజేపీలో ఉండలేమంటున్న నేతలు, మరికొంత సమయం కావాలంటున్న వైసీపీ
రూమ్ తీసుకున్నాడు, భార్యను పిలిచి చంపేశాడు - అనకాపల్లి జిల్లా లాడ్జ్ కేసు ఛేదించిన పోలీసులు
Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?