By: ABP Desam | Updated at : 20 May 2023 12:09 AM (IST)
మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న యశస్వి జైస్వాల్ ( Image Source : PTI )
Punjab Kings vs Rajasthan Royals: ఐపీఎల్‌లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది. కానీ కావాల్సినంత తేడాతో విజయం సాధించలేదు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెట్ రన్‌రేట్‌ను దాటాలంటే 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. కానీ రాజస్తాన్ 19.4 ఓవర్లలో ఛేదించింది. దీంతో బెంగళూరు దగ్గరకు వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెట్ రన్‌రేట్ +0.18 కాగా, రాజస్తాన్ రాయల్స్ నెట్ రన్‌రేట్ +0.148గా ఉంది. ఈ రెండు జట్ల మధ్య తేడా కేవలం 0.032 మాత్రమే.
రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో దేవ్‌దత్ పడిక్కల్ (51: 30 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (50: 36 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడ రెండు వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ తరఫున శామ్ కరన్ (49 నాటౌట్: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జితేష్ శర్మ (44: 28 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), షారుక్ ఖాన్ (41 నాటౌట్: 23 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) కూడా మంచి ఆటతీరు కనపరిచారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఆ ముగ్గురూ...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ అంత సాఫీగా ప్రారంభం కాలేదు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2: 2 బంతుల్లో), శిఖర్ ధావన్ (17: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), వన్ డౌన్ బ్యాటర్ అథర్వ తైదే (19: 12 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), టూ డౌన్‌లో వచ్చిన లియాం లివింగ్‌స్టోన్ (9: 13 బంతుల్లో, ఒక ఫోర్) అందరూ విఫలం అయ్యారు. దీంతో పంజాబ్ 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
అనంతరం శామ్ కరన్ (49 నాటౌట్: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), జితేష్ శర్మ (44: 28 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) పంజాబ్‌ను ఆదుకున్నారు. వీరు ఐదు వికెట్‌కు 64 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఆ తర్వాత భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో జితేష్ శర్మ అవుటయ్యాడు. క్రీజులో నిలదొక్కుకున్న శామ్ కరన్‌కు షారుక్ ఖాన్ (41 నాటౌట్: 23 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) జతకలిశాడు. ఈ జోడి ఆరో వికెట్‌కు 37 బంతుల్లోనే 73 పరుగులు జోడించారు. పంజాబ్ తరఫున ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం ఇదే.
చివర్లో రెండు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ ఏకంగా 46 పరుగులు రాబట్టింది. యుజ్వేంద్ర చాహల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 28 పరుగులు, ట్రెంట్ బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్లో 18 పరుగులను శామ్ కరన్, షారుక్ ఖాన్ రాబట్టారు. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఇక రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్, ఆడం జంపాలు తలో వికెట్ పడగొట్టారు.
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!
IPL Final 2023: రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ - ఐపీఎల్ చరిత్రలోనే!
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Andhra Politics : వైఎస్ఆర్సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?
Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!