By: ABP Desam | Updated at : 19 May 2023 06:10 PM (IST)
బీజేపీ పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తి
BJP Konda : తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కలకలం బయలుదేరింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది నేతలు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భారతీయ జనతాపార్టీ ఎదుగకపోవడానికి బీఆర్ఎస్ పార్టీతో ఉన్న అంతర్గత దోస్తీనే కారణమని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అవుతుందని అనుకున్నారని కానీ అరెస్ట్ చేయలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అందుకే బీజేపీ దూకుడుకు బ్రేక్ పడిందన్నారు. జూపల్లి పొంగులేటిలు కూడా అందుకే పార్టీలో చేరడం లేదని.. ఎవరూ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు. కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లనేప్రజలు రెండు పార్టీలు ఒకటేనని అనుకుంటున్నారన్నారు. తెలంగాణలో మరో కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదని.. అలా ఎవరైనా పార్టీ పెడితే.. కేసీఆర్ పురిటిలోనే చంపేస్తారన్నారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీలో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క రోజు ముందే కేసీఆర్ ను ఓడించడానికి బీజేపీలో ఉన్న నేతలు కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలా పిలుపునిచ్చిన వారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొంత కాలం ఏ పార్టీలోనూ చేరలేదు. కేసీఆర్ ను ఓడించే పార్టీలోనే చేరుతానని చెప్పేవారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున అంత్రగత కలహాలు ఉండటం.. రేవంత్ రెడ్డిని టీ పీసీసీ చీఫ్ గా చేయడంలో ఆలస్యం కావడంతో ఆయన బీజేపీలో చేరిపోయారు. రేవంత్ తో సన్నిహిత సంబంధాలున్న నేతల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒకరు.
అయితే కేసీఆర్ ను ఓడించడానికి కలసి బీజేపీలోనే చేరాలని ఆయన ఒక రోజు ముందుగా రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్క రోజులోనే బీజేపీ, బీఆర్ఎస్ దోస్తులన్నట్లుగా ప్రకటన చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ బీజేపీ నేతలంతా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి అక్కడి జాతీయ నేతలను కలిశారు. ఇతర నేతలూ ఢిల్లీకి వెళ్లారు. తాజాగా బండి సంజయ్ కూడా ఢిల్లీలోనే ఉన్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లడంతో వచ్చే కొద్ది రోజుల్లో తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఇప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని్ మార్చాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఎన్నికల ముంగిట ఇలా నాయకత్వాన్ని మార్చడం మంచిది కాదని ఉన్న వారితోనే స్ట్రాటజీ ఉపయోగించి రాష్ట్రంను కమలంలో కలుపుకోవాలని బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తమ ఖాతాలో వేసుకుంటే చాలు అత్యధిక మెజారిటీని దక్కించుకోగలుగుతామని అనుకుంటున్నారు బీజేపీ నాయకులు. కర్ణాటక ఫలితాలు కొంత ఇబ్బంది పెట్టడం మాట వాస్తవమేనని కానీ, అక్కడి పరిస్థితులకు ఇక్కడి పరిస్థితులకు తేడా స్పష్టంగా ఉందని అనుకుంటున్నారు.
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత
Warangal News: ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల్లో పోలీసులపై భరోసా పెరిగింది: దాస్యం వినయ భాస్కర్
TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథమిక కీ విడుదల! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్