Top 10 Headlines Today: మహారాష్ట్ర బస్సు ప్రమాదంలో 25 మంది మృతి- కాసేపట్లో గ్రూప్ 4 పరీక్ష, జగన్‌కు పవన్ వార్నింగ్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
గ్రూప్ 4 ఎగ్జామ్‌కు విస్తృత ఏర్పాట్లు
తెలంగాణలో నేడు (జులై 1) జరుగనున్న గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. శుక్రవారం రాత్రి వరకు 9,01,051 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు పొందారని కమిషన్ తెలిపింది. పరీక్షకు 15 నిమిషాల ముందే గేటు మూసివేస్తారని, ఆరు పద్ధతుల్లో అభ్యర్థులను తనిఖీ చేస్తారని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పవన్ ఫైర్
మద్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వం దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మద్యం ధరల రూపేణా అధిక ధరలు వసూలు చేస్తూ ప్రజల పొట్ట కొట్టి, ఆ డబ్బుల్నే సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్నారని అన్నారు. రూ.40, రూ.70 రూపాయలు ఉండే మద్యం ఇప్పుడు రూ.150, రూ.400 దాకా పెంచి కల్తీ మద్యాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యాలను ఛిద్రం చేసి, ఆడవారి పుస్తెలు తెంచి వ్యాపారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బీజేపీ వ్యూహం ఏంటీ?
తెలంగాణ బీజేపీ ఇప్పుడు సంధి దశలో ఉంది. గతంలో పాదయాత్రలని.. మరొకటని జోరుగా ప్రజల్లోకి వెళ్లిన నేతలు ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్వీట్లతో కాలక్షేపం చేస్తున్నారు. మా పదవుల్ని తీసేయడం లేదని మీడియాకు వివరణ ఇచ్చేందుకు సమయం వెచ్చిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం జోరు మీద ఉంది. బహిరంగసభలు.. పాదయాత్రలు..చేరికలతో తీరిక లేకుండా ఉంది. పనైపోయిందన్న కాంగ్రెస్ జోరు మీదకు రావడానికి.. ఊపు మీదుందనుకున్న బీజేపీ వెనుకబడిపోవడానికి కారణం ఎవరు ? ఖచ్చితంగా పార్టీ హైకమాండే. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో పార్టీ నేతల్ని అయోమయంలోకి నెట్టారు.ఇప్పటికీ అది కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అమర్‌నాథ్ పరామర్శ
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో సాహితీ ఫార్మా కంపెనీలో శుక్రవారం జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి గుడివాడ తెలియజేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారిని సాయంత్రం అమర్నాథ్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వెదర్ అప్‌డేట్
ఆగ్నేయ బంగాళాఖతం, దాని పరిసరాలలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నేడు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని వివరించారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బూడిదైన బతుకులు
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాగపూర్ నుంచి పుణె వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 25 మంది సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. ప్రమాదంలో పాతికమంది చనిపోగా మరో పది మంది గాయపడ్డారు. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. బస్సు పూర్తిగా గాలి బూడిద అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సోషల్ మీడియాలో కంటెంట్ రికమండేషన్లు ఎలా జరుగుతాయి?
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వినియోగదారుల కోసం కంటెంట్ రికమండేషన్లు ఎలా జరుగుతాయో తెలిపే అల్గారిథమ్‌లను మెటా వివరించింది. మెటా సోషల్ మీడియా అల్గారిథమ్‌ల గురించి లోతైన సమాచారాన్ని ప్రచురించింది. ఈ బ్లాగ్ పోస్ట్‌లో మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్... తన అల్గారిథమ్‌ల వెనుక ఉన్న ఏఐ సిస్టమ్‌లపై సమాచారాన్ని అందించడం కంపెనీ పారదర్శకత, జవాబుదారీతనాన్ని సూచిస్తుందని తెలిపారు. ప్లాట్‌ఫారమ్‌లో వారు చూసే కంటెంట్‌ను మెరుగ్గా కంట్రోల్ చేయడానికి ఇది వినియోగదారులను అనుమతిస్తుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టైర్ నెంబర్ కథ
మీరు కారు ఉపయోగిస్తూ ఉంటే ఆ టైర్‌పై కొన్ని నంబర్లు, లెటర్లు కనిపిస్తాయి. వాటి ద్వారా ఆ టైర్ గురించి దాదాపు మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. టైర్ సైడ్‌వాల్‌పై ఈ నంబర్లు కనిపిస్తాయి. ఇందులో చాలా కోడ్‌లు ఉన్నాయి. వాటిని చదవడం ద్వారా టైర్ గురించి వివరాలను పొందవచ్చు. ఈ సంఖ్యలను అర్థం చేసుకోవడానికి ఇక్కడ కోడ్ గురించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు
తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు మరికొన్ని రోజుల్లో వెలువడనున్నాయి. అంతా సజావుగా జరిగితే వారంరోజుల్లోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉండడంతో అవి పూర్తి చేసిన తర్వాత రెండు మూడు రోజుల్లో ఫలితాలను వెలువరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో జులై 7లోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మెగా ప్రిన్సెస్ పేరు ఇదే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కొణిదెల (Upasana Konidela) దంపతులు పది రోజుల క్రితం తల్లిదండ్రులు అయ్యారు. ఈ సంగతి అందరికీ తెలుసు. మెగాస్టార్ ఇంట మహాలక్ష్మి అడుగు పెట్టిందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కొణిదెల, కామినేని కుటుంబాలు చిన్నారి రాకతో సంతోషంలో మునిగాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ రోజు ఆ అమ్మాయికి పేరు పెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి