అన్వేషించండి

TSPSC Group 4 Exam: నేడే గ్రూప్-4 పరీక్ష, హాజరుకానున్న 9 లక్షలకు పైగా అభ్యర్థులు!

తెలంగాణలో నేడు (జులై 1) జరుగనున్న గ్రూప్‌-4 పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

తెలంగాణలో నేడు (జులై 1) జరుగనున్న గ్రూప్‌-4 పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాలకు 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. శుక్రవారం రాత్రి వరకు 9,01,051 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు పొందారని కమిషన్ తెలిపింది. పరీక్షకు 15 నిమిషాల ముందే గేటు మూసివేస్తారని, ఆరు పద్ధతుల్లో అభ్యర్థులను తనిఖీ చేస్తారని వెల్లడించింది.

గ్రూప్‌-4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేయనున్నారు. అంటే ఉదయం జరిగే పేపర్‌-1కు 9.45 గంటలు, మధ్యాహ్నం జరిగే పేపర్‌-2కు 2.15 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఉదయం జరిగే పేపర్‌ 1కు ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం జరిగే పేపర్‌-2కు 1 గంట నుంచి అభ్యర్థులను అనుమతిస్తారు. పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. పేపర్‌ 2 (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.

కాగా, గ్రూప్‌-4 పరీక్షపై 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరీక్ష ఏర్పాట్లు, నిబంధనలు, పరీక్ష కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది విధులు తదితర అంశాలపై చర్చించారు. 2,878 లైజన్‌ ఆఫీసర్లతో కలెక్టర్లు ప్రత్యేకంగా మాట్లాడాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. వాచ్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లకూడదని తెలిపింది. పరీక్ష కేంద్రాల్లోని పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని వివరించింది. 

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) లేదా ఓంఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. 

గ్రూప్-4 అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

➥గ్రూప్‌ 4 పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. అందువల్ల నిర్ణీత సమయానికి ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

➥ అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్‌కు ఫొటో గుర్తింపుకార్డు చూపించాలి. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.

➥ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, విలువైన, నిషేధిత వస్తువులు తీసుకెళ్లొద్దు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి.. షూ వేసుకొని వెళ్లొద్దు.

➥ అభ్యర్థికాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు ఆ అభ్యర్థిని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తారు.

➥ ఈ పరీక్షకు భారీగా అభ్యర్థులు హాజరు కానుండటంతో ఈసారి వేలిముద్రను తప్పనిసరి చేశారు. నామినల్‌ రోల్‌లో సంతకం తరువాత ఎడమచేతి బొటన వేలిముద్ర కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. 

➥ ప్రతి సెషన్‌ పరీక్ష ముగిశాక ఓఎంఆర్‌ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేసి వేలిముద్ర వేయాలి. అరగంటకోసారి అభ్యర్థులకు సమయాన్ని గుర్తుచేస్తూ బెల్‌ మోగిస్తారు. పరీక్ష ముగియడానికి 5 నిమిషాల ముందు బెల్‌ మోగిస్తారు.

➥ అభ్యర్థులు ప్రశ్నపత్రంపై సమాధానాలను మార్క్‌ చేయకూడదు.  గ్రూప్‌-4 OMR పత్రంలో హాల్‌టికెట్‌, ప్రశ్నపత్రం నంబరు, పరీక్ష కేంద్రం కోడ్‌, అభ్యర్థి పేరుతో పాటు సంతకం చేయాలి. 

➥ ఓఎంఆర్‌ పత్రంలో బ్లూ/బ్లాక్‌ పెన్‌తో పేరు, కేంద్రం కోడ్‌, హాల్‌టికెట్‌, ప్రశ్నపత్రం నంబరు రాయాలి.

➥ హాల్‌టికెట్‌, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ/ బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌కాకుండా ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌, పెన్సిల్‌ ఉపయోగించినా ఓఎంఆర్‌ పత్రం చెల్లుబాటు కానిదిగా గుర్తిస్తారు. 

గ్రూప్‌-4కు తనిఖీలు ఇలా..

1)గేటు దగ్గర, పరీక్ష కేంద్రంలో హాల్‌టికెట్‌ను పరిశీలిస్తారు.

2)రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు(ఫొటో తప్పనిసరి)

3)పరీక్ష కేంద్రంలో నామినల్‌ రోల్‌లోని పేరును పరిశీలిస్తారు.

4)నామినల్‌ రోల్‌, ప్రభుత్వ ఐడీలోని ఫొటోను వెరిఫై చేస్తారు.

5)అభ్యర్థి సంతకాన్ని సరిపోలుస్తారు.

6)చివరిగా.. అభ్యర్థి వేలిముద్రలను స్వీకరిస్తారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
More Drink Less Kick : ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Embed widget