అన్వేషించండి

Car Tyre Numbers: మీ కారు టైర్లపై ఉండే నంబర్ల గురించి తెలుసా - ఈ కథనం చదివితే ఫుల్ క్లారిటీ!

మీ కారు టైర్‌పై కనిపించే సింబల్స్ గురించి తెలుసుకోండి.

Car Tyre Tips: మీరు కారు ఉపయోగిస్తూ ఉంటే ఆ టైర్‌పై కొన్ని నంబర్లు, లెటర్లు కనిపిస్తాయి. వాటి ద్వారా ఆ టైర్ గురించి దాదాపు మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. టైర్ సైడ్‌వాల్‌పై ఈ నంబర్లు కనిపిస్తాయి. ఇందులో చాలా కోడ్‌లు ఉన్నాయి. వాటిని చదవడం ద్వారా టైర్ గురించి వివరాలను పొందవచ్చు. ఈ సంఖ్యలను అర్థం చేసుకోవడానికి ఇక్కడ కోడ్ గురించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

టైర్ పరిమాణం
కారు టైర్‌పై P215/65 R16 95H అని రాసి ఉందనుకుందాం. ఇక్కడ మొదటి అక్షరం P అని రాసి ఉంది. అంటే ఈ టైర్ ప్యాసింజర్ వెహికిల్ కోసం తయారు చేశారన్న మాట. LT అని రాసి ఉంటే ఈ టైర్ తేలికపాటి ట్రక్కుల కోసం తయారు చేశారని అర్థం. ఇచ్చిన ఉదాహరణలో P తర్వాత 215 అని రాసి ఉంది. ఈ సంఖ్య సైడ్‌వాల్ నుంచి సైడ్‌వాల్ వరకు మిల్లీమీటర్‌లలో టైరు వెడల్పు.

ఎత్తు ఎంత?
పైన చెప్పిన సంఖ్యలో స్లాష్ తర్వాత సంఖ్య 65గా ఉంది. ఇది టైర్ రేషియో. ఇది టైర్ వెడల్పుకు సంబంధించి సైడ్‌వాల్ ఎత్తు శాతాన్ని చెబుతుంది. అంటే సైడ్‌వాల్ ఎత్తు టైర్ వెడల్పులో 65 శాతం అన్నమాట. ఎక్కువ సైడ్‌వాల్స్‌ ఉన్న టైర్లు రైడ్‌కు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. పైన చెప్పిన సంఖ్యలో R అంటే రేడియల్. కానీ దాని స్థానంలో B అని రాసినట్లయితే టైర్ బయాస్డ్ టైప్ అని అనుకోవాలి.

రిమ్ సైజు ఎంత?
టైర్ రిమ్ సైజు దానిపై రాసిన చివరి రెండు సంఖ్యల నుంచి తెలుస్తుంది. ఉదాహరణకు 15 అని రాశారు అంటే ఈ టైర్ 15 అంగుళాల వ్యాసం కలిగిన రిమ్ కోసం తయారు చేశారని అర్థం.

టైర్ స్పీడ్ రేటింగ్ ఎలా తెలుసుకోవాలి?
ఇది టైర్ స్పీడ్ రేటింగ్ ఇస్తుంది. H రేటెడ్ టైర్ గరిష్టంగా 210 kmph వేగంతో నడపవచ్చు. టైర్ల నుండి అత్యుత్తమ పనితీరును, వాహనం నుండి ఉత్తమ మైలేజీని పొందడానికి, టైర్లను సరిగ్గా చూసుకోవాలి. అందుకు సరైన నంబర్‌ను పీఎస్‌ఐ వెల్లడిస్తుంది. కారు టైర్లకు డైరెక్షనల్ యారోస్ కూడా ఉంటాయి. ఇది ముఖ్యమైనది కానీ తరచుగా పట్టించుకోని గుర్తు. ఇది టైర్ ఏ దిశలో తిరుగుతుందో తెలియజేస్తుంది. యూనిడైరెక్షనల్ టైర్‌లపై ఈ సింబల్ ఉంటుంది.

ప్రస్తుతం మనదేశంలో ప్రతి నెలా లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది కూడా. కొత్త కారు కొనుగోలుపై ఎక్స్-షోరూమ్ ధరతో పాటు వినియోగదారులు చాలా పన్నులు, ఇతర ఛార్జీలు చెల్లించాలి. కార్ల తయారీదారులు తమ అనేక మోడళ్లపై తరచుగా వివిధ రకాల ఆఫర్‌లను అందిస్తారు. వీటిని డీలర్‌షిప్‌లో కస్టమర్లకు ఎక్కువగా వెల్లడించరు. అటువంటి పరిస్థితిలో వాహనం కొనుగోలు చేయడానికి ముందు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మీకు ఇష్టమైన కారుపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్‌ను చెక్ చేసుకోండి.

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
KTR Latest News: లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
Vallabhaneni Vamsi: వంశీకి షాక్ - బెయిల్ పిటిషన్ డిస్మిస్ - ఇంకా చాలా కాలం జైలు జీవితం తప్పదా ?
వంశీకి షాక్ - బెయిల్ పిటిషన్ డిస్మిస్ - ఇంకా చాలా కాలం జైలు జీవితం తప్పదా ?
CM Revanth Reddy: విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs LSG Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ | ABPKL Rahul Joins Delhi Capitals | నైట్ పార్టీలో నానా హంగామా చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP DesamRC 16 Ram Charan Peddi First Look | రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 టైటిల్, ఫస్ట్ లుక్ | ABP DesamRiyan Parag Fan touches Feet | రియాన్ పరాగ్ కాళ్లు మొక్కిన అభిమాని | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
KTR Latest News: లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
Vallabhaneni Vamsi: వంశీకి షాక్ - బెయిల్ పిటిషన్ డిస్మిస్ - ఇంకా చాలా కాలం జైలు జీవితం తప్పదా ?
వంశీకి షాక్ - బెయిల్ పిటిషన్ డిస్మిస్ - ఇంకా చాలా కాలం జైలు జీవితం తప్పదా ?
CM Revanth Reddy: విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
Kolikapudi Srinivas: కొలికపూడి నోట రాజీనామా మాట - టీడీపీ పెద్దలకు గంటల డెడ్ లైన్ - లేకపోతే ?
కొలికపూడి నోట రాజీనామా మాట - టీడీపీ పెద్దలకు గంటల డెడ్ లైన్ - లేకపోతే ?
Telangana Assembly: ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
Peddi First Look: రామ్‌చరణ్ 'పెద్ది' ఫస్ట్ లుక్ - అచ్చం 'పుష్ప'లానే ఉందంటూ ఫ్యాన్స్ రియాక్షన్.. మరికొందరేమో ఆ హీరోలా ఉన్నాడంటూ..
రామ్‌చరణ్ 'పెద్ది' ఫస్ట్ లుక్ - అచ్చం 'పుష్ప'లానే ఉందంటూ ఫ్యాన్స్ రియాక్షన్.. మరికొందరేమో ఆ హీరోలా ఉన్నాడంటూ..
Kishan Reddy Letter : హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
Embed widget